Monday, June 13, 2016

విశ్వమే లేదని విజ్ఞానమే ఇక ఎందుకని

విశ్వమే లేదని విజ్ఞానమే ఇక ఎందుకని
ఆవేశంతో సాగే విజ్ఞానం ఎవరికి ఎందుకని
అనర్థాలతో సాగే జీవితం ఎందుకో తెలుసుకోలేమని  || విశ్వమే ||

విజ్ఞానం ఉన్నా ఉపయోగించుకోలేని మాటల తీరు
అనుభవం ఉన్నా స్వార్థంతో సాగే జీవన విధానం

ప్రతి పనికి సమయస్పూర్తి సమయాలోచన లేకపోవటం
ప్రతి కార్యానికి ఏదో ఒక వంకర చాటు మాటల విధానం

ఖర్చులతో సాగే జీవితం అనర్థాల విలాసాల సంధ్యా వేళ జీవనం
మోసపోవడం మోసగించడం అనవసరమైన వాటికి అధికంగా వ్యచ్చించడం   || విశ్వమే ||

ప్రతి పనికి ఒక లాభం ఆశించడం కర్తవ్యాన్ని మరచిపోవడం
రోజుతో పోయేదానికి మాసాలు సంవత్సరాలు వాయిదా వేయడం

ఉన్నవారికి అందని ప్రతిఫలం ఎవరికో లభించడం
అనుభవించడానికి వయసు లేని వృద్ద్యాప్యం అనారోగ్యం

సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఏదో కావాలని ఏదో లేదని తిప్పించుకోవడం
ఒకసారి వివరాలు సేకరించి సమాచారాన్ని అందిస్తే చాలు పనైపోతుంది  || విశ్వమే || 

No comments:

Post a Comment