Thursday, June 2, 2016

ఓ బాటసారి... నీవు నడిచే మార్గం నాదే నీవు తెలిపే రహదారి నాదే

ఓ బాటసారి...
నీవు నడిచే మార్గం నాదే
నీవు తెలిపే రహదారి నాదే
నీవు ఎక్కడ నిలిచినా ఏ గమ్యం చేరినా నా ప్రయాణం సాగిపోవునే  || ఓ బాటసారి... ||

విశ్వమంతా నా రహదారి మార్గమే కనిపిస్తున్నది
నీవు ఉన్న చోట నా స్థానమే నీకు సూచిస్తున్నది

ఏ దారి లేని చోట నీవు నడచినా అదే నా రహదారిగా మారేను
ఏ మార్గాన్ని నీవు విడచినా ఆ దారిలోనే నడిచే వారు ఎందరో

ఎడారిలో కనిపించదు నా దారి ఆకాశం చూపదు నా మార్గము
నీటిలో తోచదు నా మార్గం నీకు ఏ దిక్కున ఎలా వెళ్ళిపోవాలో  || ఓ బాటసారి... ||

విజ్ఞానంతో సాగిపోతే దిక్సూచిలా నా మార్గం నీకు తెలిసేను
అనుభవంతో సాగిపోతే మరో మార్గం నా రహదారిలో కలిసేను

జన్మించిన స్థానము నుండి మార్గాన్ని సాగించే మరణ గమ్యాన్ని చేరేవు
ఎందరో సాగించిన ఈ మార్గాలే సృష్టిలో రహదారులుగా సాగి పోయేను

తెలియని మార్గాన్ని అన్వేషిస్తే సూచనలెన్నో తెలిసేను
సూచనలతో మార్గాన్ని సాగిస్తే అనుభవమే నీకు కలిగేను

ఇదే నా ప్రయాణం ఇదే నా మార్గం ఇదే నా దారి రహదారి
ఇదే నా లోకం ఇదే నా రహస్యం ఇంతే నీ ప్రయాణ జీవితం  || ఓ బాటసారి... ||

No comments:

Post a Comment