Thursday, June 2, 2016

ఏది నీ జీవం ఏది నీ విశ్వం ఏది నీ భావం

ఏది నీ జీవం ఏది నీ విశ్వం ఏది నీ భావం
శ్వాసే అనుకున్నా ధ్యాసే అనుకున్నా ధ్యానమే నీ సొంతం
మౌనమే అనుకున్నా శూన్యమే అనుకున్నా నాదమే నీ స్వరం || ఏది నీ జీవం ||

జీవమై ఉన్నావు ఈ జగతికి లీనమై పోయావు ఈ లోకానికి
దేహమై ఉన్నావు ఈ దైవానికి శ్వాసతో వచ్చావు ఈ స్వర్గానికి

శిఖరమై దాగి ఉన్నావు హిమాలయాన
ఆకాశమై నిలిచావు అంతర్గపు గగనాన

నీవు లేని రూపం అణువు లేని ఆకారం
నీవు లేని ఆకారం పరమాణువు లేని రూపం   || ఏది నీ జీవం ||

జన్మతో కరుణించి మరణంతో మరిచెదవు
మరో జన్మతో లాలించి మరణంతో విడిచెదవు

కాలంతో సాగించే జీవితం కనిపించని నీ భావమే
మరణంతో సాగించే మౌనం వినిపించని సత్యమే  

నీలో వేద మంత్రమో నాలో జీవ తంత్రమో
విశ్వానికి మోహ బంధమై జీవితాన్నే సాగించేవు || ఏది నీ జీవం || 

No comments:

Post a Comment