Thursday, June 16, 2016

చక్కనైన ఓ చిరుగాలి ఒక్క సారి వీచి పోవాలి

చక్కనైన ఓ చిరుగాలి ఒక్క సారి వీచి పోవాలి
చల్లనైన ఓ చిరుగాలి నీవే నన్ను బ్రతికించాలి
గాలి చిరుగాలి చల్లనైనా ఓ చిరుగాలి నీవే నాకై రావాలి  || చక్కనైన ||

నీవు లేని నా దేహం శ్వాస లేక అలజడిని సృష్టిస్తున్నది
నీవు లేక నా జీవం ధ్యాస లేక దుఃఖమును కలిగిస్తున్నది

నీవు లేని నాలో ఆవేదన మొదలై ప్రాణాన్ని అలమటిస్తున్నది
నీవు లేక నా ఆత్మ అదిరిపోయి చిందర వందరమై పోతున్నది || చక్కనైన ||

నీ రాకతో నాలో కలిగే స్పర్శతో కొత్త జీవం ఎదగాలి
నీ భావంతో నాలో ఏదో సరి కొత్త జీవితం మొదలాలి

నీవే నా అమర జీవమై నా యదలో నిలిచిపోవాలి
నీవే నా ప్రాణ ధారమై నా శ్వాసలో ఒదిగిపోవాలి     || చక్కనైన ||

No comments:

Post a Comment