Showing posts with label ఉదయత్వం. Show all posts
Showing posts with label ఉదయత్వం. Show all posts

Tuesday, July 18, 2017

మనలోనే మానవత్వం

మనలోనే మానవత్వం
మనతోనే జీవత్వం
మనదే వేదత్వం
మనకే వినయత్వం
మనమే సర్వత్వం   || మనలోనే ||

మహా గుణమే గుణతత్వం
మహా లక్ష్యమే వీరత్వం
మహా భావమే ప్రేమత్వం
మహా ధ్యానమే దివ్యత్వం
మహా లోకమే ఉదయత్వం  || మనలోనే ||

అక్కడ ఉన్నదే అల్పత్వం
ఇక్కడ లేనిదే శూన్యత్వం
మరల రానిదే శాంతత్వం
ఎప్పుడో వచ్చినదే దైవత్వం
ఇప్పుడే వెళ్ళినదే దేహత్వం  || మనలోనే || 

Friday, June 30, 2017

ఎవరు మీరు ఎవరు ఎంతటివారు భావాలకే తోచినవారు

ఎవరు మీరు ఎవరు ఎంతటివారు భావాలకే తోచినవారు
ఎవరు మీరు ఎవరు ఏనాటివారు తత్వాలకే తెలిసినవారు

ఎక్కడున్నా మీరు మహోదయ ప్రజ్వలమే
ఎలావున్నా మీరు మహోన్నత ప్రదర్శనమే   || ఎవరు ||

ప్రకృతిలో పరవశించిపోయే పరిశోధనమా
జగతిలో జలమైపోయే జలధార జీవత్వమా

ఉదయించే పుష్పంలో సుగంధాల పూర్ణోదయమా
జన్మించే స్వర జీవంలో సంకీర్తనల జీర్ణోదయమా   || ఎవరు ||

ప్రకృతిలో సాగే అన్వేషణ మహా పరిశోధనమా
జగతిలో కొనసాగే ఆలోచన మహా ప్రభంజనమా

ఉదయత్వంలో దాగిన మహా ప్రకృతి స్వరూపమా
జీవత్వంలో ఒదిగిన మహా ఆకృతి మీ ప్రతిబింబమా  || ఎవరు ||