Showing posts with label విరమణం. Show all posts
Showing posts with label విరమణం. Show all posts

Tuesday, February 7, 2017

విధిగా జీవించు విధినే అధిరోహించు

విధిగా జీవించు విధినే అధిరోహించు
విధిగా ప్రేమించు విధినే జయించు

నీ విజ్ఞానంతో విధినే తప్పించు
నీ అనుభవంతో విధినే వదిలించు  || విధిగా ||

ఏనాటి విధితత్వ జీవితమో మన కార్యాల శ్రమ సాధన సమస్యలతో సాగే జీవన విధానం
ఏనాటి బహు బంధమో మన భావాలు స్నేహితుల అనురాగాల ప్రేమతో సాగే అనుబంధం

ఎప్పటికీ తెలియని వేదాంత సారాంశం మన జీవితంలో సుఖ దుఃఖాలను కలిగిస్తుంది
ఎప్పటికీ తోచని భావోదయ వేదాంతం మన జీవనంలో బహు బంధాలను చేరుస్తుంది    || విధిగా ||

ఏమిటో కాల ప్రభావం ఎప్పటికో కార్య విరమణం
ఏమిటో జీవ ప్రభావితం ఎప్పటికో వేద విజ్ఞానం

ఏదో అనుభవం ఎక్కడికో గమ్యం సాధనలో ఎరుకే మహా గొప్ప మార్గం
ఏదో కొత్త విజ్ఞానం ఎక్కడికో ప్రయాణం శ్రమలో సాధన మహా ఆయుధం

అనుభవ విజ్ఞానమే శాంతి మార్గాన్ని సాగించే కాల ప్రయాణం
వేద ప్రభావమే విధిని తొలగించే ప్రేమ ప్రశాంత జీవన గమ్యం   || విధిగా ||