Showing posts with label భరితం. Show all posts
Showing posts with label భరితం. Show all posts

Monday, June 19, 2017

ఏనాడు లేని ఆలోచన కలిగేను ఈనాడే నాలో

ఏనాడు లేని ఆలోచన కలిగేను ఈనాడే నాలో
ఎక్కడ ఎవరికి లేని భావన తోచేను ఈనాడే నాలో

యదలోన కదిలే మదిలోన మొదిలే అనురాగ వేదం
తపించిపోతున్నది నేడే నా మనసున్న మేధస్సులో   ||  ఏనాడు ||

హృదయానికే దూరం కంటికే చేరువై కనిపిస్తున్నదే నవ భావ దృశ్యం
మేధస్సుకే ఊహా చిత్రం ఆలోచనకే అలంకార రూపం నవ రస భరితం

ప్రకృతిలో పరవశించిపోయే జీవామృతం తపనంతో విహరిస్తున్నది
విశ్వ జగతిలో ఉప్పొంగిపోయే నాదామృతం విరహంతో గాలిస్తున్నది    ||  ఏనాడు ||

విజ్ఞానమైన జీవన విధానం వేదాంతమైన జీవిత సవరణగా సాగుతున్నది
శాస్త్రీయమైన జీవన కవచం సిద్ధాంతమైన జీవిత రహస్యంగా వెళ్ళుతున్నది

వినయం ఎంతటి భావమో ఆలోచనకు అంతటి వేదనగా కలుగుతున్నది
పరువం ఎంతటి మోహమో వయస్సుకు అంతటి ఆత్రతగా తెలుస్తున్నది  ||  ఏనాడు ||

Tuesday, August 23, 2016

విజయం మన కోసమే వస్తుంది విజేతగా

విజయం మన కోసమే వస్తుంది విజేతగా
జయించుటలో సహాసమే మన విజయం
పోరాటంలో ధైర్యమే మనకు ఆయుధం   || విజయం ||

జయించు మన జగతిలో విజయాన్ని ఆశ్వాదించు
త్యజించు మన విశ్వంలో అజ్ఞానాన్ని వదిలించు

మేధస్సులో మరో ప్రపంచం మన విజయ సంకేతం
ఆలోచనలలో మరో విశ్వం మన సహాసాల పతాకం

సముద్రాల కెరటాలలో మన దేహం నిర్భయం
శిఖరాల ఉప్పెనలో మన జీవం అభయ అస్తం  || విజయం ||

గెలుపుతో మన పోరాటం విజయం విజ్ఞాన చరితం
పట్టుదలతో మన యుద్ధం విజయానికే విశ్వ భరితం

నిర్భయముతో ముందుకు సాగే కార్యం విజయానికి స్ఫూర్తి
నమ్మకముతో ప్రయాణించే మార్గం విజయానికి మహా భరోస

ఆలోచనతో అనుభవంతో విజ్ఞానాన్ని గెలిపించడం వివేకం
శాంతంతో ప్రజ్ఞానంతో ప్రశాంతతను పొందడం విజయోత్సవం || విజయం ||