Showing posts with label ప్రభాతము. Show all posts
Showing posts with label ప్రభాతము. Show all posts

Thursday, May 4, 2017

ఏనాటిదో నీ రూపం ఏనాటిదో నీ దేహం

ఏనాటిదో నీ రూపం ఏనాటిదో నీ దేహం
ఏనాటికి చెదరని బెదరని భావ స్వభావం

ఎక్కడి నుండి వచ్చావో ఎక్కడి దాక ఉంటావో
ఎవరికి తెలియని మహానుభావుడివై ఉన్నావో   || ఏనాటిదో ||

పరమాత్మ నీలోనే పరిశుద్ధం నీలోనే
పరిశోధన నీలోనే ప్రజ్ఞానం నీలోనే

విజ్ఞానం నీతోనే వైభోగం నీతోనే
వేదాంతం నీతోనే విశ్వాసం నీతోనే

ప్రతి జీవికి నీవే పరబ్రంహవై ప్రత్యక్షమైనావు   || ఏనాటిదో ||

ప్రకృతిలో ఉన్నావో పరిశోధనలో ఉన్నావో
పరవశమై ఉన్నావో ప్రభాతములో ఉన్నావో

ఎక్కడైనా నీ ధ్యాసే ఎక్కడున్నా నీ శ్వాసే
ఎక్కడైనా నీ ప్రయాసే ఎక్కడున్నా నీ ఉచ్చ్వాసే

ప్రతి జీవిలో నీవే విశ్వ జగమై లీనమైనావు   || ఏనాటిదో ||