Showing posts with label శృతి. Show all posts
Showing posts with label శృతి. Show all posts

Monday, August 21, 2017

ఓ శివ .. శివ శంకరా .. నీ లయ పరమేశ్వరా ...

ఓ శివ .. శివ శంకరా .. నీ లయ పరమేశ్వరా ...
ఓ శివ .. శివ శంకరా .. నీ స్వర మహదేశ్వరా ...
శివ శివ .. శివ శంకరా .. నీవే లోకానికి జీవేశ్వరా ..   || ఓ శివ .. ||

నీ శ్వాసలో ఏకమై నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే గమనిస్తున్నా
నీ ధ్యాసలో లీనమై నీ పర ధ్యాన స్వభావాలనే తిలకిస్తున్నా

నీ లయలో గానమై నీ స్వర శృతులనే తపిస్తున్నా
నీ స్వరలో గాత్రమై నీ శృతి స్వరాలనే జపిస్తున్నా   || ఓ శివ .. ||

నీ జీవమే విశ్వానికి భావమై నీ స్వరానికే ధ్యానమై వినిపిస్తున్నా
నీ ప్రాణమే జగతికి స్వభావమై నీ లయకే వేదమై ఆలపిస్తున్నా

నీ రూపమే మౌనమై లోకానికే శాంతమై నీ రాగమే వహిస్తున్నా
నీ దేహమే వర్ణమై దైవానికే ప్రశాంతమై నీ వరమే ధరిస్తున్నా   || ఓ శివ .. || 

Monday, August 14, 2017

గమనించవా నా శృతి భావాలను

గమనించవా నా శృతి భావాలను
వినిపించవా నా ధృతి స్వరాలను
ధ్వనించవా నా కృతి తత్వాలను ... హరా హరా!  || గమనించవా ||

స్వరం శృతిస్తున్న గానమే గాత్రం
గళం స్మరిస్తున్న గంధర్వమే ఘనం
శుభం పలుకుతున్న శోభనమే శరణం

దేహం జీవిస్తున్న విధానమే దైవం
దైవం వరిస్తున్న స్వభావమే జీవం
జీవం విహరిస్తున్న తత్వమే గానం  || గమనించవా ||

మోహం తపిస్తున్న కాలమే తపనం
సూక్ష్మం జీవిస్తున్న క్షణమే వినయం
దాహం పలికిస్తున్న గానమే గమకం

వేదం తరిస్తున్న విజ్ఞానమే కమలం
భావం ఫలిస్తున్న మేధస్సే మధురం
తత్వం తిలకిస్తున్న దేహమే తన్మయం  || గమనించవా || 

Tuesday, September 20, 2016

భరణి శంకర ఆభరణములు శంకరా భరణం

భరణి శంకర ఆభరణములు శంకరా భరణం
సాగర స్వరాల సంగములు సాగర సంగమం
సూర్యోదయ తొలి లేత కిరణాలు స్వాతి కిరణం
శృతి స్వర రాగ సప్త లయములు శృతి లయలు 

Monday, August 8, 2016

పలికించవా నా భావన వినిపించవా నా కీర్తన

పలికించవా నా భావన వినిపించవా నా కీర్తన
సంగీతాల సరిగమలతో పదనిసలనే మెప్పించవా
నా జీవన వేదాన్ని స్వర రాగాల లోకాలకు పంపించవా  || పలికించవా ||

నాలోని విజ్ఞానం వినయమా నా అనుభవం అభినయమా
సర్వాంతరం సంగీత యోగమా నిరంతరం నిజతత్వమా

నా నవ జీవితం నవీనత్వమా నా నూతన జీవనం నందనమా
స్వర భాషలో భావం సంయోగమా శృతి ధ్యాసలో సర్వాంతరమా

అమృతాల పలుకులతో మాతృ భావాల సుగంధాలనే మెప్పించనా
మకరందాల పిలుపులతో మాతృ తత్వాల సవ్వడినే ఒడి చేర్చుకోనా  || పలికించవా ||

శృతిలయలో దాగే స్వర రాగ సంగీతాన్ని స్మరించగా తేనీయమే తెలిసిందిలే
ఒడిలయలో దాగే శ్వాస భావ సంతోషాన్ని స్పందించగా మాతృత్వమే తెలిసేనులే

వేదాల సరిగమలు పదనిసలుగా గజ్జెల మువ్వల సవ్వడితో మృదంగమా
సుస్వరాల పలుకుల చరణములు మాటల రాగాలతో వేదాంత స్వరగానమా

సంగీత జ్ఞానం స్వరాల విజ్ఞానం అనుభవానికి గమనమా
సంపూర్ణ గీతం సందేశ గాత్రం అనుబంధానికి తపనమా  || పలికించవా || 

Tuesday, August 25, 2015

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా
నా స్వర గాన సంగీతాన్ని వినిపించరా
నాలోని వేద గీతాన్ని నీవే ఆలకించరా
నీకై నా శ్వాస భావాన్ని అర్పించెదనురా ॥

నీ ధ్యాన శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసనై శృతిని కలిపెదనురా
నీ విశ్వ భావాలలో నవ నాడుల జీవ తత్వాలను గమనించెదనురా
నీ దేహ ఆకారాలలో విభూదినై మహా రూపాన్ని అవతరించెదనురా
నీ యోగ ధ్యాసలో విశ్వ భావాన్నై స్వప్త స్వరాలతో శృతించెదనురా

శంకరా శంఖంతో శంకించకురా నాపై కక్ష ఉన్నను నీ కక్ష్యలోనే జీవించెదనురా
విష నాగులతో భయ పెట్టినను నీ డమరుకాన్ని ఏనాటికి నేను విడవలేనురా
త్రిలోకాలలో త్రినేత్రుడవై త్రినేత్రంతో నన్ను భస్మం చేసినను నీ త్రిశూలాన్ని వదలనురా
ఎన్ని ప్రళయాలు సంభవించినను నీకై యుగాలుగా జీవిస్తూ గంగా జలమై నివసించెదనురా ॥

శంకరా నీకై శృతి మించెదనురా నటరాజ కళా నాట్యంతో నిన్నే మెప్పించెదనురా
విశ్వమంతా నీ నామ శృతినే వివిధ స్వర భావ జీవ తత్వాలతో స్మరించెదనురా
నీకై పుష్పమైనను పత్రమైనను జలమైనను సమర్పిస్తూ పాద సేవ చేసెదనురా
నీ మెడలో రుద్రాక్షమై కర్త కర్మ క్రియల బంధాన్ని నేనుగా అనుభవించెదనురా

విశ్వమందు నిన్ను ఎక్కడ వెతికినను అక్కడే నా శ్వాసలో నీవే జీవించెదవురా
జగతిలో నీవు ఎక్కడ ఉన్నను ప్రతి జీవి శ్వాసలో నీవే జీవమైనావని తెలిసెనురా
సృష్టిలో ఏ స్వరమైనను నీ ఓంకార శృతియే ఆది రాగమై విశ్వ భాషగా పలికెదమురా
భువిలో నీ విశిష్టత విశ్వాంతరమై కాలమంతా వ్యాపిస్తూ నలు దిక్కులు దాగెనురా ॥