Showing posts with label సందేహం. Show all posts
Showing posts with label సందేహం. Show all posts

Monday, May 30, 2016

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో
ఏదో సందేహం ఎంతో ఆరాటం ఏమో సందిగ్దం నాలో
తీరని అనుభవం వీడని అనుబంధం మనలో సాగే అనురాగం ఎందుకో ఈ వేళ || ఏదో సంతోషం ||

మనస్సులో ఆనందం హృదయంలో కలిగే సంతోషం
యదలో అనురాగం మేధస్సులో కలిగే అనుబంధం

మాటలతో సాగే ప్రయాణం మమతై కోరినది మమకారం
భావాలతో సాగే కాలం మధురమై వచ్చినది మకరందం

ఏనాటి భావాలో నేడు నీ కోసమే వస్తున్న మధురిమలు
ఏనాటి స్వప్నాలో నీ చెంతకే చేరుతున్న పదనిసలు    || ఏదో సంతోషం ||

జీవనమే హాయిగా నీతో సాగే జీవితమే మన ప్రేమ
జీవమే స్వేచ్ఛగా నీతో కలిసే మదియే మన జన్మ

పుష్పాలు వికసించే పరిమళాలు నాలోనే దాగున్నాయి
తేనీయం కవ్వించే సుమ గంధాలు నీతోనే వస్తున్నాయి

తెలియనిది ఏదైనా ఉంటే సందేహమే
తెలుసుకోవాలని ఎంతైనా ఉంటే ఆరాటమే
తెలుసుకున్నా తోచకపోతే సందిగ్ధమే

భావాలతో జీవిస్తే జీవితం ఎంతో సంతోషం
బంధాలతో జీవిస్తే జీవనమే ఎంతో ఉల్లాసం  || ఏదో సంతోషం ||