Showing posts with label పరిపూర్ణ. Show all posts
Showing posts with label పరిపూర్ణ. Show all posts

Wednesday, January 4, 2017

ప్రతి జీవికై వెలిగే ప్రజ్వల జ్యోతి ఉజ్వలమైన ఆత్మ పరంజ్యోతి స్వరూపమే

ప్రతి జీవికై వెలిగే ప్రజ్వల జ్యోతి ఉజ్వలమైన ఆత్మ పరంజ్యోతి స్వరూపమే
ప్రతి అణువుకై నిలిచే నిశ్చలమైన ఆత్మ జ్యోతి పరిపూర్ణ ప్రజ్ఞాన స్వరూపమే  || ప్రతి జీవికై ||

ప్రతి జీవిలో ఓ మహా శక్తి జీవమై ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో జీవితాన్ని సాగిస్తున్నది
ప్రతి అణువులో ఓ మహా శక్తి నిశ్చలమై పరధ్యాస ధ్యానముతో రూపాన్ని సాగిస్తున్నది  

ప్రతి జీవి ఓ మహా జ్ఞానిగా ఆత్మ పర శక్తిగా తన జీవితాన్ని తరతరాలుగా సాగిస్తుంది
ప్రతి అణువు ఓ మహా రూప శక్తిగా ప్రయోజనాత్మకంగా జీవితాన్ని కాలంతో సాగిస్తుంది  || ప్రతి జీవికై ||

ప్రతి జీవి మరణిస్తుంది మరణం జన్మలకు స్వాగతం పలుకుతుంది
జీవం ప్రకృతిలోను మరియు సకల జీవరాసులలోను శ్వాసతో ఉంటుంది

అణువులు వివిధ రకాలుగా కాలంతో రూపాంతరం చెందుతూ ఉంటాయి
కొన్ని అణువులు క్షీణిస్తాయి మరి కొన్ని దీర్ఘ కాలంతో సాగుతూ ఉంటాయి
అణువులలో నిర్జీవం ఉన్నా కొన్ని రూపాలు దీర్ఘ కాలంతో నిలిచి ఉంటాయి  || ప్రతి జీవికై || 

Friday, June 3, 2016

ఓం నమో సరస్వతి

ఓం నమో సరస్వతి
విశ్వ సంపూర్ణ విజ్ఞానవతి
జ్ఞాన విజ్ఞాన మహా మేధావతి
భావ ధ్యాన పరిపూర్ణ పవిత్రవతి
దేహ శుద్ధ అభిజ్ఞాన సంగీత సరస్వతి
వేద జ్ఞాన గురు కళా ప్రపూర్ణ సత్యవతి