Showing posts with label సజీవం. Show all posts
Showing posts with label సజీవం. Show all posts

Tuesday, August 22, 2017

ఎవరిని ఏమని తలిచేది ఎంతని ఎవరిని కొలిచేది

ఎవరిని ఏమని తలిచేది ఎంతని ఎవరిని కొలిచేది
ఎవరిని ఏమని వలచేది ఎంతని ఎవరిని మలిచేది

తెలియని భావం తెలిసిన స్వప్నం తెలియక సజీవం
తోచని రూపం తెలుపని వేదం తెలిపేదే సహృదయం  || ఎవరిని ||

ఎవరో మలచిన రూపం ఎవరికో తెలియని వర్ణం
ఎవరో వలచిన భావం ఎవరికో తెలిసిన సువర్ణం

ఎవరో తలచిన దేహం ఎవరికో తెలపని సుగంధం
ఎవరికి ఎవరో ఏమని తపించిన తెలియదు బంధం  || ఎవరిని ||

ఎవరిదో రూపం ఎవరిదో బంధం ఎవరికి ఎవరో అనుబంధం
ఎవరిదో స్వప్నం ఎవరిదో భావం ఎవరికి ఎవరో అనుస్వారం

ఏమని కోరిన ఎంతని ఓర్చిన ఏదని కలగదే అనుపథం
ఏమని వాల్చిన ఎంతని వేచిన లేదని అలగదే అనురాగం  || ఎవరిని || 

Wednesday, June 14, 2017

ప్రతి అణువులో ఆత్మగా జీవం ఉంటే

ప్రతి అణువులో ఆత్మగా జీవం ఉంటే
ప్రతి పరమాణువులో పరమాత్మగా సజీవం ఉంటే
ప్రకృతి పరంధామమే విశ్వం పరధ్యానమే జగతి జీవత్వమే  || ప్రతి అణువులో ||

అణువే ఆత్మ జ్ఞానమైతే పరమాణువే పరమాత్మ విజ్ఞానంగా తోచేనుగా
అణువే ఆకృతి ఐతే పరమాణువే వికృతి ఐతే  ప్రజ్ఞానంగా పరజ్ఞానమే

అణువులోనే జీవ భావ స్వభావాలు మహోదయ తత్వమై ఉదయించునే
పరమాణువులోనే సజీవ సూక్ష్మ స్వభావాలు మహా తత్వమై ప్రజ్వలించునే   || ప్రతి అణువులో ||

అణువులో జీవం అనుభవమైతే పరమాణువులో సజీవం సమన్వయ భావమే
అణువులో పరమాణువే పరధ్యానమైతే ఆత్మలో పరమాత్మయే పరలీనత్వమే

అణువుగా దర్శించే రూపం విజ్ఞానమైతే పరమాణువుగా వీక్షించే భావం ప్రజ్ఞానమే
అణువే అపురూపమైతే పరమాణువే స్వరూపమైతే ఆత్మ పరమాత్మ విశ్వ రూపమే   || ప్రతి అణువులో || 

Monday, March 27, 2017

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో

విడిచిపో నీ రూపాన్ని మరచిపో నీ విజ్ఞానాన్ని మరణంతో
నడిచిపో నీ గమ్యాన్ని తలచిపో నీ గౌరవాన్ని సజీవంతో    || విడిచిపో ||

జీవించే కాలం తెలుసుకునే సమయం మన జీవితానికే
నడిపించే కార్యం సాగించే సహనం మన జీవన వృద్ధికే

ఎంత కాలం జీవిస్తున్నా మన ఆకార రూపం తరుగునని
ఎంత జ్ఞానం పొందుతున్నా మన అనుభవం చాలదని   || విడిచిపో ||

ఉన్నప్పుడే కాస్త తీరిక చేసుకో ఉన్నంతలో ఊపిరి పీల్చుకో
ఉన్నట్లుగా జీవం సాగించుకో ఉంటూనే ఊహను చూసుకో

ఉదయించేది ఏదైనా అస్తమించేనని జన్మించిన నీకు మరణం తప్పదని
నీకోసం ఉన్నది ఏదైనా సొంతం కాదని సంపాదన ఖర్చులకే పరిమితమని   || విడిచిపో ||