ఎవరిని ఏమని తలిచేది ఎంతని ఎవరిని కొలిచేది
ఎవరిని ఏమని వలచేది ఎంతని ఎవరిని మలిచేది
తెలియని భావం తెలిసిన స్వప్నం తెలియక సజీవం
తోచని రూపం తెలుపని వేదం తెలిపేదే సహృదయం || ఎవరిని ||
ఎవరో మలచిన రూపం ఎవరికో తెలియని వర్ణం
ఎవరో వలచిన భావం ఎవరికో తెలిసిన సువర్ణం
ఎవరో తలచిన దేహం ఎవరికో తెలపని సుగంధం
ఎవరికి ఎవరో ఏమని తపించిన తెలియదు బంధం || ఎవరిని ||
ఎవరిదో రూపం ఎవరిదో బంధం ఎవరికి ఎవరో అనుబంధం
ఎవరిదో స్వప్నం ఎవరిదో భావం ఎవరికి ఎవరో అనుస్వారం
ఏమని కోరిన ఎంతని ఓర్చిన ఏదని కలగదే అనుపథం
ఏమని వాల్చిన ఎంతని వేచిన లేదని అలగదే అనురాగం || ఎవరిని ||

No comments:
Post a Comment