Wednesday, August 23, 2017

మర్మం నాదే మంత్రం నాదే

మర్మం నాదే మంత్రం నాదే
తంత్రం నాదే యంత్రం నాదే

జీవం నాదే రూపం నాదే
దేహం నాదే దైవం నాదే  || మర్మం ||

రహస్యంతో మర్మమే మదించాను విజ్ఞానంతో మంత్రమే మలిచాను
వేదంతో తంత్రమే తలిచాను అధ్యాయంతో యంత్రమే అర్పించాను

రూపమే మర్మంగా మలిచాను భావమే మంత్రంగా కొలిచాను
తత్వమే తంత్రంగా తలిచాను దేహమే యంత్రంగా వలిచాను  || మర్మం ||

జీవమే ఆత్మ పర మర్మం రూపమే వేద పర మంత్రం
భావమే జ్ఞాన పర తంత్రం దేహమే స్వర పర యంత్రం

బంధమే పర జ్ఞాన మర్మం వర్ణమే పర ధ్యాన మంత్రం
తత్వమే పర వేద తంత్రం దేహమే పర దైవ యంత్రం  || మర్మం || 

No comments:

Post a Comment