ఏ మంత్రం వేశానో విశ్వానికి
ఏ తంత్రం పంచానో జగతికి
ఏ యంత్రం ఇచ్చానో దేహానికి
తెలియని మర్మమై మేధస్సులోనే వరించినది ఓ కాలమా! || ఏ మంత్రం ||
శూన్య భావముతో విశ్వాన్ని మహా మంత్రంచే తలచాను
పూర్ణ స్వభావముతో జగతిని మహా తంత్రంచే తపించాను
మంగళ తత్వముచే దేహాన్ని మహా యంత్రంచే కొలిచాను || ఏ మంత్రం ||
మంత్రమన్నది మేధస్సుకు కార్యాచరణగా సాగే పరిశీలన
తంత్రమన్నది ఆలోచనకు కార్యాదరణగా సాగే పరిశోధన
యంత్రమన్నది భావనకు కార్యావరణగా సాగే ప్రతిస్పందన || ఏ మంత్రం ||

No comments:
Post a Comment