Thursday, August 10, 2017

జగమే నీవని ఉదయిస్తున్నావా

జగమే నీవని ఉదయిస్తున్నావా
విశ్వమే నీవని ప్రజ్వలిస్తున్నావా
లోకమే నీవని అస్తమిస్తున్నావా
సర్వమే నీవని ప్రకాశిస్తున్నావా

ఓ సూర్య దేవా మహా తేజ రూపా
ఉదయించుటలో శాంతం నీవే
అస్తమించుటలో ప్రశాంతం నీవే  || జగమే ||

ప్రతి ఉదయం మేధస్సుకు నవోదయ భావాల కార్యాల తేజోదయం
ప్రతి సాయంత్రం ఆలోచనలకు విశ్రాంతి భావాల ఆనందమయం

ప్రకృతిలోనే వేదాలను పరిశోధిస్తూ అనంత భావాలను తెలిపెదవు
జీవులలోనే భావాలను పరిశీలిస్తూ అనంత స్వభావాలను చూపెదవు  || జగమే ||

వెలిగే గుణముతో ప్రకాశిస్తున్నా నిత్యం ప్రజ్వలించే భావంతో జగమంతా ఉదయిస్తూ జీవిస్తున్నావు
జ్వలించే భావంతో వెలుగుతున్నా సర్వం కాలచర్యగా విశ్వమంతా ప్రకాశిస్తూనే పరిశోధిస్తున్నావు

నీవు లేని లోకానికే ప్రతి స్పర్శ లేదని జీవుల జీవన ప్రభావం కలగదని అంతరిక్షమే తెలిపేను
నీవు లేని కాలానికి ప్రతి చలన లేదని గ్రహాల జీవిత ప్రభావం మారదని భవిష్య జ్ఞానమే తెలిపేను  || జగమే ||

No comments:

Post a Comment