Showing posts with label కణం. Show all posts
Showing posts with label కణం. Show all posts

Wednesday, March 8, 2017

ఓం నమో సూర్య దేవా ... ఓం నమో సూర్య కాంతా ...

ఓం నమో సూర్య దేవా ... ఓం నమో సూర్య కాంతా ...
సువర్ణముచే ఉదయించెదవా సుగుణముచే విస్తరించెదవా
నీ సువర్ణ సుగుణాలచే విశ్వాన్ని తేజస్సులతో ఆవరించెదవా  || ఓం నమో ||

నీలోని ప్రతి కిరణం మేధస్సులకు ప్రజ్వలమైన పరిశోధనమే
నీలోని ప్రతి తేజం ఎన్నో కార్యాలకు మహత్యమైన ప్రయోగమే

నీలోని ప్రతి వర్ణం ఆలోచనలకు మహోజ్వల పర్యావరణమే
నీలోని ప్రతి భావం జీవరాసులకు మహోదయ ప్రభంజనమే                  

నీలోని ప్రతి గుణం ఎన్నో జీవితాలకు మహనీయమైన ప్రబోధమే            
నీలోని ప్రతి తత్వం ఎందరో మహానుభావులకు మహా ప్రఘారమే    || ఓం నమో ||        

నీలోని ప్రతి వేదం ఎందరో మహాత్ములకు మహా ప్రచ్ఛనమే                  
నీలోని ప్రతి స్పర్శనం ఎన్నో అణువులకు మహా ప్రభావమే

నీలోని ప్రతి కణం ఎన్నో గ్రహాలకు దిక్సూచితమైన ప్రదర్శనమే
నీలోని ప్రతి చలనం ఎన్నో లోకాలకు సుదర్శనమైన ప్రకాశమే

నీలోని ప్రతి రూపం భావ స్వభావాలకు అత్యంతమైన ప్రక్షాళనమే
నీలోని ప్రతి ఆకారం వేద తత్వాలకు ఉన్నతమైన ప్రతిబింబమే    || ఓం నమో ||