Tuesday, October 20, 2015

ఈ రోజు ఏ రోజులా లేదు

ఈ రోజు ఏ రోజులా లేదు
ఇక ఈనాడు ఏనాడులా ఉండదు
ఆరోజు అదే రోజని తెలియాలని లేదు
మరో రోజు ఎన్నో రోజులుగా వస్తూ ఉంటాయి
రేపటిది ఏనాటికి ఆగదు 

మానవ మేధస్సుకు మరుపేలా మహానుభావా!

మానవ మేధస్సుకు మరుపేలా మహానుభావా!
మరుపుతో ఎన్నో ఆలోచనలు మరచి పోయెదమే
మరుపుతో మంచి ఉన్నది అనర్థము ఉన్నది
అవసరమైనది ఎప్పటికీ మరచిపోతే నిరుపయోగం
చాలా కాలానికి జ్ఞాపకమైనా అవసరం లేకపోతే శూన్య ప్రయోజనమే
సరైన సందర్భానికి గుర్తు వస్తే మరచుట తాత్కాళికమైన ఉపయోగమే
మరుపుతో మేధస్సులలో అజ్ఞాన విజ్ఞాన భావాలు అనంత సదృశం
తాత్కాళిక మరుపుతో విజ్ఞాని శాశ్విత మరుపుతో అజ్ఞానిగా మారవచ్చు
ఏ మరుపులో ఏ మర్మం ఉన్నదో జ్ఞాపకాల మంత్రానికే తెలియాలి
కావలసిన దానిని పదే పదే గుర్తు చేసుకుంటే విజ్ఞానంగా ఎదుగుతాము
అనవసరమైన దానిని పదే పదే మరచిపోతుంటే విజ్ఞానాన్ని సమకూర్చుకోవచ్చు
మరుపు ప్రతి జీవికి అవసరం అందులోనే విశ్రాంతి భవిష్య ఆలోచనలు కలుగుతాయి
ఎంత మరుపు ఉన్నా విజ్ఞాన ఉత్తేజంతో కార్య సాధన చేస్తే మహానుభావులవుతాం 

విశ్వమా! శూన్యం నుండి ఉదయించిన భావన నా మేధస్సులోనే

విశ్వమా! శూన్యం నుండి ఉదయించిన భావన నా మేధస్సులోనే ఉన్నది
శూన్యము నుండి నేటి వరకు కలిగిన భావాలన్నీ నాలోనే దాగి ఉన్నాయి
అనంత విశ్వ భావాలన్నీ నేనుగా నాలో లీనమై ఆలోచిస్తూ సేకరించినవే
విశ్వ కాలం సాగేంత వరకు నాలో అనంత భావాలు చేరుతూనే ఉంటాయి
శూన్య భావన కూడా నాలో నిశబ్ధమై తొలి భావనతో ఉదయించినది 

Friday, October 9, 2015

మరుపుతో మహా విజ్ఞాన జీవితాన్ని అందుకోలేక పోయాను

మరుపుతో మహా విజ్ఞాన జీవితాన్ని అందుకోలేక పోయాను
సరైన సమయానికి తెలుసుకోలేక మరుపుతోనే సాగిపోయాను
మరుపుతో మేధస్సు అజ్ఞానమైనట్లు జీవితం విచారమైనది
విచారంతో సాగే జీవితం ఉత్తేజం లేని మేధస్సుగా సాగినది
విజ్ఞాన ఆలోచనలు తోచలేక లేదా అమలులో లేక ఇక్కట్లే
ఎదిగే మేధస్సుకు విజ్ఞాన సాధన లేకపోతే మరుపేగా
విజ్ఞాన ఆలోచనలతో జీవిస్తేనే మేధస్సు బ్రంహాండం అవుతుంది
దీర్ఘ కాలపు మరుపుతో జీవితం విచారంగా సాగిపోయినది
విజ్ఞాన జీవితాన్ని అందుకోలేని వారు ఉపాయంతో జీవించాలి
ఎరుకతో ఆలోచిస్తూ విజ్ఞానంతో ఏకాగ్రత వహిస్తూ అనుభవంతో సాగాలి 

ఎప్పుడు మరుపు కలిగినదో గాని యుగాల తర్వాత

ఎప్పుడు మరుపు కలిగినదో గాని యుగాల తర్వాత మెలకువలో తెలిసినది
మరచిన విజ్ఞానం మేధస్సులో మళ్ళీ కలగక ఎన్నో యుగాలే గడచిపోయేనే
మరుపులో మర్మం ఉన్నదో మేధస్సులో మంత్రం ఉన్నదో ఎరుకకైనా తెలియదే
మరుపులేని మేధస్సుకై అన్వేషించినా అలసటలో ఆలోచనలే మారి పోయేనే
అలసటతో కలిగే మరుపు ఆలోచనతో కలిగే మరుపు మేధస్సులోనే మంత్రమాయే
మరుపుతో జీవించే మేధస్సుకు విజ్ఞానం ఒక అఖండమైన సాధనయే
ధ్యాస లేని ఆలోచనలతో ఎరుకను మాయ చేసే మనస్సు అజ్ఞాన మంత్రమేగా
సాధనలో సాగే అన్ని ఆలోచనలు విజ్ఞానమైతే ఎరుకతో కూడిన అనుభవమే
సాధనలో కలిగే విఫలాలు అనుభవాలు లేని అజ్ఞాన మరుపు ఛాయలే
సరైన సమయానికి ఆహారం నిద్ర విశ్రాంతి తీసుకుంటే మరుపు ఓ విజ్ఞాన ఉత్తేజమే 

మరుపుతోనే మహా ఆనందమైన జీవితాన్ని మరిచాను

మరుపుతోనే మహా ఆనందమైన జీవితాన్ని మరిచాను
మరుపుతో అజ్ఞానంగా ఆలోచిస్తూ మేధస్సునే మరిచాను
విజ్ఞానం లేని మేధస్సులో ఎరుక లేక అజ్ఞానంతో జీవించాను
అలసట చెందే మేధస్సుకు అజ్ఞానపు మరుపు ఎందుకు కలిగెనో
అలసట చెందే మేధస్సుకు విజ్ఞానపు ఆలోచన ఎలా తప్పి పోవునో
విశ్రాంతికై మేధస్సులో మరుపు కలిగేలా మరో ఆలోచన ఎలా వచ్చునో
ఎక్కడ నుండి మరుపు కలుగునో మేధస్సుకే విచారమై అజ్ఞానమే ఆవహించేనా
మేధస్సులో నిత్యం ఆలోచించే ఎరుక లేనందున మేధస్సుకు మరుపేనా 

నరుడా! మేధస్సున మరుపు ఎలా కలుగునో తెలుసుకోవా

నరుడా! మేధస్సున మరుపు ఎలా కలుగునో తెలుసుకోవా
మరచిన విజ్ఞానంతో మేధస్సున విచారమే మొదలాయనే
విచారంతో మేధస్సులో ఉత్తేజం లేక దేహం అవస్థగా మారెనే
అలసట చెందిన మేధస్సుకు విశ్రాంతి కోసమే మరుపు కలిగేనా
అవసరమైన భావన లేక అనవసరాన్ని ఆలోచించగా కలిగేనా
అనవసర ఆలోచనలలో దీర్ఘ కాలంగా సమయాన్ని వెచ్చిస్తే మరుపేనా
అనవసర భావాలలో ఎరుక లేక అజ్ఞానమే మేధస్సుకు కలిగేనా
మరుపుతో మంచి కలిగితే మేధస్సులో మహానంద ఉత్తేజమే
మరుపుతో అశుభం కలిగితే దేహ మేధస్సులో చంచలనమే
ఎప్పటికైనా మేధస్సును ఎరుకతో ఆలోచించేలా అనుభవించరా
మరుపులోనే అజ్ఞానం అఖండమై అమాంతం ఆవహించెనే నరుడా! 

Wednesday, October 7, 2015

చుక్కల్లో చుక్కనై ఎక్కడ ఉన్నానో చుక్కలకే తెలియదులే

చుక్కల్లో చుక్కనై ఎక్కడ ఉన్నానో చుక్కలకే తెలియదులే
ఏ చుక్కైనా నాలాగే మెరిసి పోతున్నది అన్ని చుక్కల్లలో

చుక్కల్లో చంద్రుడైనా నా చుక్కను మరిచేనుగా
చూసినా అన్ని చుక్కల్లో నేను చుక్కగానే తోచానుగా ॥

తారనై తపించే నాభావం ఏ చుక్కకు అర్థమయ్యేనో
తారగా విహరించే నా ప్రయాణం ఆకాశానికే తెలియునులే

తారలలో సితారనై ఎప్పుడు సింధూరాన్ని ధరిస్తానో
సింధూరాన్ని ధరించినా నా రూపం సింధూరమేగా

సింధూర సితారనై సిరి వెన్నెల తారలలో స్వాతి ముత్యమౌనా
సిరి కాంతుల తారలలో సింధూరమై నేలపై రాలిపోవునా  ॥

తారల తోరణాలలో బంధించే నా జీవితం తప్పిపోదులే
మేఘాలలో దాగి ఉన్నా తోరణంలో నిలిచే ఉంటానులే

చీకటిలో మెరిసే నా జీవితం పగటి వెలుగులో కానరాదులే
చీకటిలో దాగే నా స్థానం కాంతి భావానికే తెలియునులే

తారగా జీవిస్తున్నా సింధూర తిలకమై ప్రకాశిస్తానులే
ప్రకాశించే తారలలో సింధూర తోరణ చుక్కను నేనేలే ॥  

ఆరోగ్యమే మహా భాగ్యం

ఆరోగ్యమే మహా భాగ్యం
ఆరోగ్యమే ఐశ్వర్య యోగం
ఆరోగ్యమే ఆనంద శిఖరం
ఆరోగ్యమే మహా చైతన్యం
ఆరోగ్యమే విశ్వ విజ్ఞానం
ఆరోగ్యమే ప్రయత్న భావం
ఆరోగ్యమే లోక కల్యాణం
ఆరోగ్యమే మరో ప్రపంచం
ఆరోగ్యమే దైవ సత్యం
ఆరోగ్యమే దివ్య దర్శనం
ఆరోగ్యమే సర్వ శాంతం
ఆరోగ్యమే మహా ధ్యానం
ఆరోగ్యమే అందరి స్వప్నం
ఆరోగ్యమే దీర్ఘ కాలం
ఆరోగ్యమే పవిత్ర పరిశుద్ధం
ఆరోగ్యమే దివ్య క్షేత్రం
ఆరోగ్యమే మహా బంధం
ఆరోగ్యమే మహా ఖండం
ఆరోగ్యమే మహా మంత్రం
ఆరోగ్యమే మహా తంత్రం
ఆరోగ్యమే మహా యంత్రం
ఆరోగ్యమే నవ వసంతం
ఆరోగ్యమే అందరికి ఆహారం
ఆరోగ్యమే సూర్య తేజం
ఆరోగ్యమే సుదీర్ఘ ప్రయాణం
ఆరోగ్యమే మహా సైన్యం
ఆరోగ్యమే వీరుల ధైర్యం
ఆరోగ్యమే అన్నింటికీ మూలం  
ఆరోగ్యమే ప్రయోజన కార్యం
ఆరోగ్యమే శక్తి స్థూపం
ఆరోగ్యమే కాల చక్రం
ఆరోగ్యమే మహా బ్రంహాండం
ఆరోగ్యమే జన్మ రహస్యం
ఆరోగ్యమే ఆధార ధర్మం
ఆరోగ్యమే స్నేహ సహాయం
ఆరోగ్యమే పుష్ప సుగంధం
ఆరోగ్యమే ప్రకృతి సహజం
ఆరోగ్యమే దేహ వైద్యం
ఆరోగ్యమే ఉద్దేశ లక్ష్యం
ఆరోగ్యమే అక్షర జ్ఞానం
ఆరోగ్యమే వాస్తు వరం
ఆరోగ్యమే ఆకాశ తత్వం
ఆరోగ్యమే ఆలోచన అర్థం
ఆరోగ్యమే మహా రూపం
ఆరోగ్యమే ఎదుగుదల లక్షణం

Tuesday, October 6, 2015

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు
సూర్య ప్రకాశమే తేజోదయమై విశ్వమంతా వెలుగుతో ఉదయిస్తున్నాడు
ఆకాశాన కనిపించే మేఘ వర్ణ రూపాలు సూర్య కిరణాల తేజస్సు భావాలే
సూర్యుడే జగతికి స్పూర్తినిస్తూ జీవులకు మార్గ దర్శకమౌతున్నాడు
సూర్యని నుండే జీవుల మేధస్సులలో మార్పు కలుగుతూ వస్తున్నది
మానవ మేధస్సుకు సూర్యుడే ఆది జీవమై పరిణామం చెందించాడు
సూర్యుని నుండే మానవ మేధస్సు ఉత్తేజమై ఆలోచన అర్థాన్ని గ్రహిస్తున్నది
అన్ని దిక్కులను సమ భావాలతో చూసే మహా నేత్ర గుణపతి సూర్యుడే 

ఓం గుణపతి నమః

ఓం గుణపతి నమః
ఓం గణపతి నమః
ఓం గజపతి నమః
ఓం గలపతి నమః
ఓం గరపతి నమః
ఓం గతపతి నమః
ఓం గదపతి నమః
ఓం గయపతి నమః

ఓం విజ్ఞేశ్వర విశ్వ జ్ఞానేశ్వర విశ్వానంద సూర్యేశ్వర

ఓం విజ్ఞేశ్వర విశ్వ జ్ఞానేశ్వర విశ్వానంద సూర్యేశ్వర
ఓం ప్రథమేశ్వర ఆదీశ్వర ఆనంద శుభ విశ్వేశ్వర
ఓం మూలాధీశ్వర ఏక దంతేశ్వర సర్వ శుభంకర
ఓం జీవేశ్వర దైవ మూర్తీశ్వర కాల గమన సర్పేశ్వర
ఓం శుద్దేశ్వర పరిశుద్ధ పరమేశ్వర పరంజ్యోతేశ్వర
ఓం కాళేశ్వర కర్త కర్మ క్రియ భావ కరుణేశ్వర
ఓం గృహేశ్వర కార్య కారణ ఫలిత పరమానందేశ్వర
ఓం సర్వేశ్వర సర్వానంద త్రిగుణ త్రిపురేశ్వర 

అద్భుతాల ఆకాశమా! సూర్య మేఘ ఆకార రూప వర్ణాల తేజోదయమా

అద్భుతాల ఆకాశమా! సూర్య మేఘ ఆకార రూప వర్ణాల తేజోదయమా
చీకటి వెన్నెల చంద్రుని నక్షత్రాల కాల గమన మహా భావ శుభోదయమా
విశ్వమంతటా అద్భుతాలను చూపించే ఆకాశం ఎందరికో విశ్వోదయమా
సూర్యోదయ సూర్యాస్తమయ మేఘ వర్ణ రూప భావాలు అతిశయోదయమా
చంద్రుని కాంతి వెన్నెల మేఘ రూప ప్రయాణాలు అపురూప అస్వదయమా
సూర్య తేజస్సుల కాంతి కిరణాలు మేధస్సుకు ప్రజ్వల ఉత్తేజోదయమా
క్షణ కాల అంతరిక్షపు భూభ్రమణ గమన నూతన భావాలు ఉషోదయమా  

ఓ విశ్వ రూపమా నీ రూపాన్ని చూసేందుకు మరో రూపాన్ని నేనే

ఓ విశ్వ రూపమా నీ రూపాన్ని చూసేందుకు మరో రూపాన్ని నేనే
నీ రూపాన్ని తిలకించేందుకు మరో నేత్ర రూపంగా నేనే అవతరించాను
నీ విశ్వ రూప భావ తత్వాలు నా మేధస్సులో నిలయమౌతున్నాయి
నీలో దాగిన అనంత విశ్వ రూప ఆకార వర్ణాలన్నీ నాలో చేరుతున్నాయి
నీకు లేని భూత భవిష్య వర్తమాన విజ్ఞాన మేధస్సు నాలో నిర్మితమైనది
నీలో కలిగే భావాలన్నీ నా విశ్వ కాల మేధస్సులో స్థిరంగా చేర్చబడతాయి 

Monday, October 5, 2015

రణ రంగం సిద్ధం జయ భేరి మృదంగం

రణ రంగం సిద్ధం జయ భేరి మృదంగం
రాజ్యాల పోరాటంలో ఎవరైనా సమరం
బంధాలను పెన వేసుకున్నా పోరాటం అవశ్యం
శతృత్వం లేకున్నా పోరాటంలో బంధాలు శూన్యం
బహు బలగాలు ఉన్నా లేకున్నా సమరానికి సై  ॥

వీరుల లక్ష్యమే ఆయుధం ధీరుల అడుగే ధ్యైర్యం
భయంకర పోరాటంలో గాయాల మరణాల శౌర్యం
విధ్వంస్వం సృష్టించే యుద్ధం మహా ఘోర భయంకర ప్రళయం
మనిషైనా మృగమైనా స్త్రీ పురుషులైనా యుద్ధంలో పోరాటమే
విజయమైనా అపజయమైనా సమరంలో సహాసమే లక్షణ లక్ష్యం
ప్రకృతిని ఆవహించే పోరాటం గుండెలను దద్దరిల్లించే సమర సింహం  ॥

రాజ్యాలను ఆక్రమిస్తే వీరత్వమే విజయం
రాజ్యాలే కూలిపోతే అపజయమే మరణం  
యుద్ధాలే లేకుంటే స్నేహ భావాలే శాంతికి చిహ్నం
గర్వం లేదంటే స్నేహ బంధాలే ప్రగతికి మార్గ దర్శకం
ధృడమైన స్నేహ బంధాలే విదేశాలకు స్ఫూర్తి దాయకం
దేశ ధృడత్వం సరిహద్దుల సాహాస వీరుల చైతన్య శిఖరం ॥

Friday, October 2, 2015

మెరిసే విజ్ఞానం సూర్య కిరణాల తేజోదయమే

మెరిసే విజ్ఞానం సూర్య కిరణాల తేజోదయమే
సువర్ణ కాంతిలో కలిగే భావన మహా ఆలోచనే
ఉదయించే కిరణం మెలకువలో కలిగే భావనయే
సూర్య తేజస్సు భావాలే మేధస్సుల ఆలోచన విజ్ఞానం
కాంతిలో కలిగే భావన ఆలోచనతో కలిగే విజ్ఞానార్థమే
వెలుగుతో విశ్వం ఉదయిస్తుంది ఆలోచనతో మేధస్సు జీవిస్తుంది 

అమోఘం అమోహం అపురూపమైనది మహా విశ్వ రూపం

అమోఘం అమోహం అపురూపమైనది మహా విశ్వ రూపం
ఔన్నత్వం ఔచిత్యం ఔరా అదరహో అంతులేనిది ఆకాశత్వం
ప్రమోదం ప్రమేయం ప్రయోగం సంయోగం ప్రకృతి పర భావం
బంధం అనుబంధం సంబంధం పరమావదీయ జీవ తరంగం