Monday, October 5, 2015

రణ రంగం సిద్ధం జయ భేరి మృదంగం

రణ రంగం సిద్ధం జయ భేరి మృదంగం
రాజ్యాల పోరాటంలో ఎవరైనా సమరం
బంధాలను పెన వేసుకున్నా పోరాటం అవశ్యం
శతృత్వం లేకున్నా పోరాటంలో బంధాలు శూన్యం
బహు బలగాలు ఉన్నా లేకున్నా సమరానికి సై  ॥

వీరుల లక్ష్యమే ఆయుధం ధీరుల అడుగే ధ్యైర్యం
భయంకర పోరాటంలో గాయాల మరణాల శౌర్యం
విధ్వంస్వం సృష్టించే యుద్ధం మహా ఘోర భయంకర ప్రళయం
మనిషైనా మృగమైనా స్త్రీ పురుషులైనా యుద్ధంలో పోరాటమే
విజయమైనా అపజయమైనా సమరంలో సహాసమే లక్షణ లక్ష్యం
ప్రకృతిని ఆవహించే పోరాటం గుండెలను దద్దరిల్లించే సమర సింహం  ॥

రాజ్యాలను ఆక్రమిస్తే వీరత్వమే విజయం
రాజ్యాలే కూలిపోతే అపజయమే మరణం  
యుద్ధాలే లేకుంటే స్నేహ భావాలే శాంతికి చిహ్నం
గర్వం లేదంటే స్నేహ బంధాలే ప్రగతికి మార్గ దర్శకం
ధృడమైన స్నేహ బంధాలే విదేశాలకు స్ఫూర్తి దాయకం
దేశ ధృడత్వం సరిహద్దుల సాహాస వీరుల చైతన్య శిఖరం ॥

No comments:

Post a Comment