Tuesday, October 20, 2015

మానవ మేధస్సుకు మరుపేలా మహానుభావా!

మానవ మేధస్సుకు మరుపేలా మహానుభావా!
మరుపుతో ఎన్నో ఆలోచనలు మరచి పోయెదమే
మరుపుతో మంచి ఉన్నది అనర్థము ఉన్నది
అవసరమైనది ఎప్పటికీ మరచిపోతే నిరుపయోగం
చాలా కాలానికి జ్ఞాపకమైనా అవసరం లేకపోతే శూన్య ప్రయోజనమే
సరైన సందర్భానికి గుర్తు వస్తే మరచుట తాత్కాళికమైన ఉపయోగమే
మరుపుతో మేధస్సులలో అజ్ఞాన విజ్ఞాన భావాలు అనంత సదృశం
తాత్కాళిక మరుపుతో విజ్ఞాని శాశ్విత మరుపుతో అజ్ఞానిగా మారవచ్చు
ఏ మరుపులో ఏ మర్మం ఉన్నదో జ్ఞాపకాల మంత్రానికే తెలియాలి
కావలసిన దానిని పదే పదే గుర్తు చేసుకుంటే విజ్ఞానంగా ఎదుగుతాము
అనవసరమైన దానిని పదే పదే మరచిపోతుంటే విజ్ఞానాన్ని సమకూర్చుకోవచ్చు
మరుపు ప్రతి జీవికి అవసరం అందులోనే విశ్రాంతి భవిష్య ఆలోచనలు కలుగుతాయి
ఎంత మరుపు ఉన్నా విజ్ఞాన ఉత్తేజంతో కార్య సాధన చేస్తే మహానుభావులవుతాం 

2 comments:

  1. Replies
    1. Thanks for your comment, just look for the below blogs for your favourites...
      http://telugusongstime.blogspot.com/
      http://gsystime.blogspot.com/
      http://galaxystime.blogspot.com/
      http://quotesinmind.blogspot.com/
      http://galaxystartime.blogspot.com/
      http://universalprocedure.blogspot.com/
      http://galaxylinktime.blogspot.com/

      Delete