Friday, October 9, 2015

నరుడా! మేధస్సున మరుపు ఎలా కలుగునో తెలుసుకోవా

నరుడా! మేధస్సున మరుపు ఎలా కలుగునో తెలుసుకోవా
మరచిన విజ్ఞానంతో మేధస్సున విచారమే మొదలాయనే
విచారంతో మేధస్సులో ఉత్తేజం లేక దేహం అవస్థగా మారెనే
అలసట చెందిన మేధస్సుకు విశ్రాంతి కోసమే మరుపు కలిగేనా
అవసరమైన భావన లేక అనవసరాన్ని ఆలోచించగా కలిగేనా
అనవసర ఆలోచనలలో దీర్ఘ కాలంగా సమయాన్ని వెచ్చిస్తే మరుపేనా
అనవసర భావాలలో ఎరుక లేక అజ్ఞానమే మేధస్సుకు కలిగేనా
మరుపుతో మంచి కలిగితే మేధస్సులో మహానంద ఉత్తేజమే
మరుపుతో అశుభం కలిగితే దేహ మేధస్సులో చంచలనమే
ఎప్పటికైనా మేధస్సును ఎరుకతో ఆలోచించేలా అనుభవించరా
మరుపులోనే అజ్ఞానం అఖండమై అమాంతం ఆవహించెనే నరుడా! 

No comments:

Post a Comment