Wednesday, October 7, 2015

చుక్కల్లో చుక్కనై ఎక్కడ ఉన్నానో చుక్కలకే తెలియదులే

చుక్కల్లో చుక్కనై ఎక్కడ ఉన్నానో చుక్కలకే తెలియదులే
ఏ చుక్కైనా నాలాగే మెరిసి పోతున్నది అన్ని చుక్కల్లలో

చుక్కల్లో చంద్రుడైనా నా చుక్కను మరిచేనుగా
చూసినా అన్ని చుక్కల్లో నేను చుక్కగానే తోచానుగా ॥

తారనై తపించే నాభావం ఏ చుక్కకు అర్థమయ్యేనో
తారగా విహరించే నా ప్రయాణం ఆకాశానికే తెలియునులే

తారలలో సితారనై ఎప్పుడు సింధూరాన్ని ధరిస్తానో
సింధూరాన్ని ధరించినా నా రూపం సింధూరమేగా

సింధూర సితారనై సిరి వెన్నెల తారలలో స్వాతి ముత్యమౌనా
సిరి కాంతుల తారలలో సింధూరమై నేలపై రాలిపోవునా  ॥

తారల తోరణాలలో బంధించే నా జీవితం తప్పిపోదులే
మేఘాలలో దాగి ఉన్నా తోరణంలో నిలిచే ఉంటానులే

చీకటిలో మెరిసే నా జీవితం పగటి వెలుగులో కానరాదులే
చీకటిలో దాగే నా స్థానం కాంతి భావానికే తెలియునులే

తారగా జీవిస్తున్నా సింధూర తిలకమై ప్రకాశిస్తానులే
ప్రకాశించే తారలలో సింధూర తోరణ చుక్కను నేనేలే ॥  

No comments:

Post a Comment