ఎప్పుడు మరుపు కలిగినదో గాని యుగాల తర్వాత మెలకువలో తెలిసినది
మరచిన విజ్ఞానం మేధస్సులో మళ్ళీ కలగక ఎన్నో యుగాలే గడచిపోయేనే
మరుపులో మర్మం ఉన్నదో మేధస్సులో మంత్రం ఉన్నదో ఎరుకకైనా తెలియదే
మరుపులేని మేధస్సుకై అన్వేషించినా అలసటలో ఆలోచనలే మారి పోయేనే
అలసటతో కలిగే మరుపు ఆలోచనతో కలిగే మరుపు మేధస్సులోనే మంత్రమాయే
మరుపుతో జీవించే మేధస్సుకు విజ్ఞానం ఒక అఖండమైన సాధనయే
ధ్యాస లేని ఆలోచనలతో ఎరుకను మాయ చేసే మనస్సు అజ్ఞాన మంత్రమేగా
సాధనలో సాగే అన్ని ఆలోచనలు విజ్ఞానమైతే ఎరుకతో కూడిన అనుభవమే
సాధనలో కలిగే విఫలాలు అనుభవాలు లేని అజ్ఞాన మరుపు ఛాయలే
సరైన సమయానికి ఆహారం నిద్ర విశ్రాంతి తీసుకుంటే మరుపు ఓ విజ్ఞాన ఉత్తేజమే

No comments:
Post a Comment