Sunday, February 28, 2021

దైవమే నిన్ను పరిశోధించునా

దైవమే నిన్ను పరిశోధించునా 
దేహమే నిన్ను పరీక్షించునా 

భావమే నిన్ను అన్వేషించునా 
భాగ్యమే నిన్ను ఆవహించునా 

కాలమే నిన్ను ఆశ్రయించునా  
కార్యమే నిన్ను అనుగ్రహించునా 

జీవన సిద్ధాంత విధానమే నీ మేధస్సును పరిభ్రమించునా 
జీవిత వేదాంత వైఖర్యమే నీ మనస్సును పరిశ్రయించునా   || దైవమే || 

ఏ దివ్య జ్ఞానం నీ రూపాన్ని నిర్మాణాకృతం చేయునో 
ఏ విద్య గీతం నీ నాదాన్ని సరళీకృతం చేయునో 

ఏ భవ్య లోకం నీ స్థానాన్ని కేంద్రీకృతం చేయునో 
ఏ నవ్య విశ్వం నీ క్షేత్రాన్ని స్వయంకృతం చేయునో 

ఏ రాజ్య ధర్మం నీ తేజాన్ని విశదీకృతం చేయునో 
ఏ కార్య మర్మం నీ వేదాన్ని సంధ్యాకృతం చేయునో   || దైవమే || 

ఏ సూర్య కాంతం నీ జ్ఞానాన్ని అధిష్ఠాకృతం చేయునో 
ఏ శౌర్య శాంతం నీ భావాన్ని మహనీకృతం చేయునో 

ఏ సవ్య నాభం నీ తత్వాన్ని సురభీకృతం చేయునో 
ఏ కావ్య కాలం నీ బంధాన్ని అమరాకృతం చేయునో 

ఏ ధన్య ధూపం నీ ప్రజ్ఞాన్ని విశ్వాకృతం చేయునో 
ఏ భాగ్య జీవం నీ స్నేహాన్ని జన్మాకృతం చేయునో   || దైవమే || 

Monday, February 22, 2021

ఓ దేవా మహా దేవా ప్రభు దేవా జయ దేవా సూర్య దేవా

ఓ దేవా మహా దేవా ప్రభు దేవా జయ దేవా సూర్య దేవా 
ఓ దేవా మహా దేవా ప్రభు దేవా జయ దేవా సూర్య దేవా

జయ దేవా సూర్యోదయం మనస్సుకు మహోదయం 
జయ దేవా సూర్యోదయం మేధస్సుకు తేజోదయం 
జయ దేవా సూర్యోదయం వయస్సుకు వర్ణోదయం 
జయ దేవా సూర్యోదయం దేహస్సుకు జీవోదయం 
జయ దేవా సూర్యోదయం ఉషస్సుకు నవోదయం 
జయ దేవా సూర్యోదయం శ్రేయస్సుకు పూర్ణోదయం 
జయ దేవా సూర్యోదయం ఆయుస్సుకు పూర్వోదయం 

Friday, February 12, 2021

విశ్వానికి మౌనమైన మేధస్సును ఇచ్చా

విశ్వానికి మౌనమైన మేధస్సును ఇచ్చా 
జగానికి మోహమైన మనస్సును ఇచ్చా 

లోకానికి ముత్యమైన వయస్సును ఇచ్చా 
కాలానికి మూల్యమైన ఆయుస్సును ఇచ్చా  

రూపానికి మర్మమైన దేహస్సును ఇచ్చా 
వేదానికి మంత్రమైన ఉషస్సును ఇచ్చా  

మేధస్సును సువర్ణముచే పరిశోధించా

మేధస్సును సువర్ణముచే పరిశోధించా 
మనస్సును సుతత్త్వముచే పర్యవేక్షించా 

దేహస్సును సుగంధంచే పరిజ్ఞానించా  
వయస్సును సుకాంతంచే పరిపూర్ణించా 

ఆయుస్సును సుకాలంచే పరిశుద్దించా 
ఉషస్సును సుకార్యంచే పర్యావర్ణించా 

తేజస్సును సుజ్ఞానంచే పరిగ్రహించా 
రేతస్సును సుధ్యానంచే పురస్కృతించా

విశ్వంలోనే సాగరమై ఉన్నా లోకంలోనే సాగరమై ఉన్నా

విశ్వంలోనే సాగరమై ఉన్నా లోకంలోనే సాగరమై ఉన్నా 
రూపంలోనే సాగరమై ఉన్నా వేదంలోనే సాగరమై ఉన్నా 

జీవంలోనే సాగరమై ఉన్నా దైవంలోనే సాగరమై ఉన్నా 
నాదంలోనే సాగరమై ఉన్నా భావంలోనే సాగరమై ఉన్నా 
 
రాగంలోనే సాగరమై ఉన్నా జ్ఞానంలోనే సాగరమై ఉన్నా 
దేహంలోనే సాగరమై ఉన్నా తత్త్వంలోనే సాగరమై ఉన్నా
 
సర్వంలోనే సాగరమై ఉన్నా నిత్యంలోనే సాగరమై ఉన్నా 
ధ్యానంలోనే సాగరమై ఉన్నా సత్యంలోనే సాగరమై ఉన్నా

సాగరమే సంపూర్ణం సాగరమే సంతోషం 
సాగరమే సమావేశం సాగరమే సమాధానం 

సాగరమే ఉత్తేజం సాగరమే ఉత్సాహం
సాగరమే ఉత్కృష్టం సాగరమే ఉత్పన్నం

సాగరమే సమయం సాగరమే సంకేతం 
సాగరమే సిద్ధాంతం సాగరమే సిద్ధత్వం 

సాగరమే చరణం సాగరమే చరితం 
సాగరమే భరణం సాగరమే భరితం 
 
సాగరమే అమరం సాగరమే  అమృతం 
సాగరమే అపూర్వం సాగరమే అమూల్యం

సాగరమే అఖిలం సాగరమే అలేఖ్యం 
సాగరమే అమోఘం సాగరమే అఖండం 

సముద్రమందే ఉదయిస్తున్నా సముద్రమందే అస్తమిస్తున్నా 
సముద్రమందే ప్రవహిస్తున్నా సముద్రమందే ప్రయాణిస్తున్నా

సముద్రమందే ఎదుగుతున్నా సముద్రమందే ఒదుగుతున్నా 
సముద్రమందే వెలుగవుతున్నా సముద్రమందే చీకటవుతున్నా 

సముద్రమందే జన్మణిస్తూవున్నా సముద్రమందే మరణిస్తూవున్నా   
సముద్రమందే దర్శనమిస్తున్నా సముద్రమందే అదృశ్యమౌతున్నా 
 
సముద్రమందే ఉత్తిష్ఠతమౌతున్నా సముద్రమందే ఉత్తీర్ణతమౌతున్నా  
సముద్రమందే ఉద్రిక్తతమౌతున్నా సముద్రమందే ఉపోద్ఘాతమౌతున్నా

Thursday, February 11, 2021

విజయమే లేదు విజయమా

విజయమే లేదు విజయమా 
నీవైనా తెలుపవా అపజయానికి 

విజయమే లేదు విజయమా 
నీవైనా పలకవా అపజయంతో 

విజయమే లేదు విజయమా 
నీవైనా అడగవా అపజయాన 

విజయమే లేదు విజయమా 
నీవైనా తలచవా అపజయంచే  

విజయాన్నే నిత్యం తలిచినా కలగదే ఏ సమయాన 
విజయాన్నే సర్వం తపించినా వలచదే ఏ సమయాన 

విజయంతోనే ఆరంభం కోరుకున్నా నిలువదే ఏ సమయాన 
విజయంతోనే ప్రారంభం అనుకున్నా కలువదే ఏ సమయాన 

నాతో నడిచే విజయం ఎప్పటికి నన్ను సహృదయంతో చేరదుగా  
నాతో కలిసే విజయం ఎన్నటికి నన్ను సహృదయంతో తాకదుగా   || విజయమే || 

సూర్యోదయంలా శ్రమిస్తున్నా సూర్యాస్తయాన విశ్రమించకపోతున్నా 
సూర్యోదయంలా భ్రమిస్తున్నా సూర్యాస్తయాన విశ్రాంతిలేకపోతున్నా 

సూర్యోదయంలా ఉదయిస్తున్నా సూర్యాస్తయాన ఉపశమించకపోతున్నా 
సూర్యోదయంలా ఉద్భవిస్తున్నా సూర్యాస్తయాన ఊఱడించలేకపోతున్నా   || విజయమే ||

సూర్యోదయంలా అవతరిస్తున్నా సూర్యాస్తయాన ప్రకాశించకపోతున్నా  
సూర్యోదయంలా అధిరోహిస్తున్నా సూర్యాస్తయాన ప్రభవించకపోతున్నా 

సూర్యోదయంలా పరిశోధిస్తున్నా సూర్యాస్తయాన పర్యావరణించకపోతున్నా  
సూర్యోదయంలా ప్రబోధిస్తున్నా సూర్యాస్తయాన పత్రహరిణించకపోతున్నా   || విజయమే ||

Tuesday, February 9, 2021

ఒకే ఒక విశ్వము నేనే

ఒకే ఒక విశ్వము నేనే 
విశ్వానికి మేధస్సును నేనే 
మేధస్సుకు ఆలోచనను నేనే 

ఆలోచనకు భావనను నేనే 
భావనకు తత్వమును నేనే 
తత్త్వానికి స్పందనను నేనే 

స్పందించే విశ్వానికి నిత్యం సర్వం నేనే కాలమా  || ఒకే ఒక ||  

Thursday, February 4, 2021

నవ భూషణం సవ భాషణం

నవ భూషణం సవ భాషణం 
దివ్య బోధనం విద్య శోధనం 

సర్వ సాహిత్యం సవ్య సాఫల్యం 
సత్య సంపూర్ణం నిత్య సంపూర్వం 

జీవ అమరత్వం దైవ అమృతత్వం 
జన మహోన్నతం గణ మహోత్సవం  

విశ్వాన్ని విజ్ఞానంగా మార్చిన భావన ఏది

విశ్వాన్ని విజ్ఞానంగా మార్చిన భావన ఏది 
జగాన్ని వేదాంతంగా తీర్చిన తత్త్వన ఏది 

లోకాన్ని సహజంగా మార్చిన యోచన ఏది 
ప్రాంతాన్ని సమాజంగా తీర్చిన భాషణ ఏది 

కాలాన్ని కార్యాలుగా సాగిస్తున్న ఉద్భావన ఏది 
రూపాన్ని బంధాలుగా నడిపిస్తున్న ఆచరణ ఏది 

భావ తత్వాలతో సాగే మహా జన్మ స్థల బ్రంహాండం ఏనాటిది 
భాష బంధాలతో సాగే మహా రూప జ్ఞాన ప్రబోధనం ఎంతటిది  || విశ్వాన్ని ||