విజయమే లేదు విజయమా
నీవైనా తెలుపవా అపజయానికి
విజయమే లేదు విజయమా
నీవైనా పలకవా అపజయంతో
విజయమే లేదు విజయమా
నీవైనా అడగవా అపజయాన
విజయమే లేదు విజయమా
నీవైనా తలచవా అపజయంచే
విజయాన్నే నిత్యం తలిచినా కలగదే ఏ సమయాన
విజయాన్నే సర్వం తపించినా వలచదే ఏ సమయాన
విజయంతోనే ఆరంభం కోరుకున్నా నిలువదే ఏ సమయాన
విజయంతోనే ప్రారంభం అనుకున్నా కలువదే ఏ సమయాన
నాతో నడిచే విజయం ఎప్పటికి నన్ను సహృదయంతో చేరదుగా
నాతో కలిసే విజయం ఎన్నటికి నన్ను సహృదయంతో తాకదుగా || విజయమే ||
సూర్యోదయంలా శ్రమిస్తున్నా సూర్యాస్తయాన విశ్రమించకపోతున్నా
సూర్యోదయంలా భ్రమిస్తున్నా సూర్యాస్తయాన విశ్రాంతిలేకపోతున్నా
సూర్యోదయంలా ఉదయిస్తున్నా సూర్యాస్తయాన ఉపశమించకపోతున్నా
సూర్యోదయంలా ఉద్భవిస్తున్నా సూర్యాస్తయాన ఊఱడించలేకపోతున్నా || విజయమే ||
సూర్యోదయంలా అవతరిస్తున్నా సూర్యాస్తయాన ప్రకాశించకపోతున్నా
సూర్యోదయంలా అధిరోహిస్తున్నా సూర్యాస్తయాన ప్రభవించకపోతున్నా
సూర్యోదయంలా పరిశోధిస్తున్నా సూర్యాస్తయాన పర్యావరణించకపోతున్నా
సూర్యోదయంలా ప్రబోధిస్తున్నా సూర్యాస్తయాన పత్రహరిణించకపోతున్నా || విజయమే ||
No comments:
Post a Comment