Sunday, February 28, 2021

దైవమే నిన్ను పరిశోధించునా

దైవమే నిన్ను పరిశోధించునా 
దేహమే నిన్ను పరీక్షించునా 

భావమే నిన్ను అన్వేషించునా 
భాగ్యమే నిన్ను ఆవహించునా 

కాలమే నిన్ను ఆశ్రయించునా  
కార్యమే నిన్ను అనుగ్రహించునా 

జీవన సిద్ధాంత విధానమే నీ మేధస్సును పరిభ్రమించునా 
జీవిత వేదాంత వైఖర్యమే నీ మనస్సును పరిశ్రయించునా   || దైవమే || 

ఏ దివ్య జ్ఞానం నీ రూపాన్ని నిర్మాణాకృతం చేయునో 
ఏ విద్య గీతం నీ నాదాన్ని సరళీకృతం చేయునో 

ఏ భవ్య లోకం నీ స్థానాన్ని కేంద్రీకృతం చేయునో 
ఏ నవ్య విశ్వం నీ క్షేత్రాన్ని స్వయంకృతం చేయునో 

ఏ రాజ్య ధర్మం నీ తేజాన్ని విశదీకృతం చేయునో 
ఏ కార్య మర్మం నీ వేదాన్ని సంధ్యాకృతం చేయునో   || దైవమే || 

ఏ సూర్య కాంతం నీ జ్ఞానాన్ని అధిష్ఠాకృతం చేయునో 
ఏ శౌర్య శాంతం నీ భావాన్ని మహనీకృతం చేయునో 

ఏ సవ్య నాభం నీ తత్వాన్ని సురభీకృతం చేయునో 
ఏ కావ్య కాలం నీ బంధాన్ని అమరాకృతం చేయునో 

ఏ ధన్య ధూపం నీ ప్రజ్ఞాన్ని విశ్వాకృతం చేయునో 
ఏ భాగ్య జీవం నీ స్నేహాన్ని జన్మాకృతం చేయునో   || దైవమే || 

No comments:

Post a Comment