Showing posts with label బ్రంహాండేశ్వరా. Show all posts
Showing posts with label బ్రంహాండేశ్వరా. Show all posts

Friday, March 17, 2017

గౌరికే గౌరీశ్వరా శాంతికే శాంతీశ్వరా

గౌరికే గౌరీశ్వరా శాంతికే శాంతీశ్వరా
ఆదికే ఆదీశ్వరా నందికే నందీశ్వరా
జగతికే జగదీశ్వరా జీవులకే జీవేశ్వరా
రాజులకే రాజేశ్వరా తేజానికే తేజేశ్వరా
లోకానికే లోకేశ్వరా విశ్వానికే విశ్వేశ్వరా
దేహానికే దేహేశ్వరా దైవానికే దైవేశ్వరా
వేదాలకే వేదేశ్వరా జ్ఞానులకే జ్ఞానేశ్వరా
ప్రాణులకే ప్రాణేశ్వరా శ్వాసకే శ్వాసేశ్వరా
తారలకే తారకేశ్వరా భూమికే భూమేశ్వరా
స్వరాలకే స్వరేశ్వరా నాదానికే నాదేశ్వరా
సోమముకే సోమేశ్వరా వీరముకే వీరేశ్వరా
సత్యానికే సత్యేశ్వరా నిత్యానికే నిత్యేశ్వరా
రూపానికే రూపేశ్వరా ధర్మానికే ధర్మేశ్వరా
కోట్లకే కోటేశ్వరా త్రినేత్రానికే త్రినేత్రేశ్వరా
పరులకే పరమేశ్వరా మునులకే మునేశ్వరా
ఉమకే ఉమామహేశ్వరా లలితకే లలితేశ్వరా
అర్ధాంగికే అర్ధనారీశ్వరా లింగానికే లింగేశ్వరా
విజ్ఞానులకే విజ్ఞేశ్వరా మాదవులకే మహదేశ్వరా
సర్వానికే సర్వేశ్వరా అనంతానికే అనంతేశ్వరా
సూర్యునికే సూర్యేశ్వరా చంద్రునికే చంద్రేశ్వరా
ఋషులకే ఋషేశ్వరా మహాత్ములకే మహేశ్వరా
గ్రహాలకే గ్రహేశ్వరా బ్రంహాండానికే బ్రంహాండేశ్వరా
అఖిలానికే అఖిలేశ్వరా అఖిలాండానికే అఖిలాండేశ్వరా