Showing posts with label ఆలయం. Show all posts
Showing posts with label ఆలయం. Show all posts

Tuesday, March 28, 2017

ఈ లోకం ఒక ఆలయం ఈ భువనం ఒక మందిరం

ఈ లోకం ఒక ఆలయం ఈ భువనం ఒక మందిరం
జగమంతా ఓ శరణాలయం విశ్వమే ఓ దేవాలయం
కాలమే ఒక వేదాలయం సమయమే ఓ దైవాలయం  || ఈ లోకం ||

ప్రతి జీవికి తన దేహమే మహోన్నత దేహాలయం
ప్రతి శ్వాసకు తమ ధ్యాసే మహోదయ ఆలయం

ప్రతి రోజు మన లోకం మేధస్సుకే మహా ఆలయం
ప్రతి క్షణం మన విశ్వం ఆలోచనకే మహా మందిరం  

భావాలతో సాగే ప్రతి జీవికి తమ తత్వమే దేహానికి నిలయం
స్వభావాలతో ఎదిగే ప్రతి జీవికి తమ శ్వాసే దేహానికి నివాసం  || ఈ లోకం ||

కాలం తెలిపే అనుభవాల వేదాలకు దేహమే స్వరాలయం
సమయం చూపే కార్య మార్గాలకు సూర్య తేజమే మార్గాలయం

విజ్ఞానంతో ఎదిగే మహా మేధస్సుకు మహోదయ భావాలే క్షేత్రాలయం
వినయంతో సాగే ఆలోచనకు మహోన్నత స్వభావాలే ప్రశాంతాలయం  

ఉత్తేజంతో సాగే మేధస్సులో సూర్య కిరణాల తేజమే కార్యాలకు స్వర్ణాలయం
ఆలోచనలతో సాగే సూక్ష్మ పరిశోధన భావాలకు విజ్ఞాన సోపానాలే తత్వాలయం  || ఈ లోకం ||

Tuesday, January 24, 2017

ఏనాటి మరణమో నీది ఓ అద్వైత్వ మహాత్మా

ఏనాటి మరణమో నీది ఓ అద్వైత్వ మహాత్మా
ఏనాటి జననమో నీది ఓ దైవత్వ పరమాత్మా
నీవు లేని మా లోకం ఏ మార్గం లేని గమ్యస్థానం  || ఏనాటి ||

నీ శ్వాస నిశ్వాస అయ్యేను
నీ జీవం నిర్జీవం అయ్యేను
నీ శబ్దం నిశ్శబ్దం అయ్యేను
నీ అర్థం నిరర్థకం అయ్యేను
నీ వ్యవస్థ అవస్థం అయ్యేను
నీ సారం నిస్సారం అయ్యేను
నీ జనం నీరాజనం అయ్యేను
నీ ఆకారం అహంకారం అయ్యేను   || ఏనాటి ||

నీ దేహం దైవం అయ్యేను
నీ సత్యం నిత్యం అయ్యేను
నీ తనం నిరంతరం అయ్యేను
నీ ప్రాణం ప్రణామం అయ్యేను
నీ లయం ఆలయం అయ్యేను
నీ స్వార్థం నిస్వార్ధం అయ్యేను
నీ శాంతం నిశాంతం అయ్యేను
నీ రూపం అపురూపం అయ్యేను
నీ వచనం నిర్వచనం అయ్యేను
నీ దర్శనం నిదర్శనం అయ్యేను
నీ అహంకారం ఓంకారం అయ్యేను   || ఏనాటి || 

Wednesday, December 21, 2016

నీలో నేనే ఉదయిస్తున్నా నీలో నేనే జీవిస్తున్నా

నీలో నేనే ఉదయిస్తున్నా నీలో నేనే జీవిస్తున్నా
నీలో నేనే ఆకాశమై నీలో నేనే ప్రకృతిగా ఉన్నా

నీకై నేనే విశ్వానికి తోడుగా జగతికి జతగా ఉన్నా
నీకై నేనే మనస్సుకు నీడగా వయస్సుకు జాడగా ఉన్నా  || నీలో నేనే ||

నీవు నేను కలసిన రూపం సువర్ణ వర్ణాల మహా సుందర తేజం
నీవు నేను చూసిన భావం సుగంధ పరిమళాల సువర్ణ పుష్పం

నీవు నేను ఒకటైన సమయం సువర్ణ భావాల సంబంధం
నీవు నేను ఒకటైతే సంతోషం సుమధుర గంధాల నేస్తం

నీవు నేను ఎక్కడ ఉన్నా అనువైన అనురాగాల అనుబంధం
నీవు నేను ఎలా ఉన్నా అపారమైన అనుభవాల ఆనందనం    || నీలో నేనే ||

నీవు నేను నిలిచిన స్థానం తేనీయ గంధాలు పూచే పర్వతం  
నీవు నేను తలచిన గమ్యం సుగంధ పుష్పాలు వెలిసే శిఖరం

నీవు నేను జన్మించిన ప్రదేశం పరమాత్ముని ప్రార్థించే ఆలయం
నీవు నేను వెలసిన ప్రాంగణం పరంధాముని పూజించే గోపురం

నీవు నేను మరచిన తరుణం మనస్సులు కలసిన అలనాటి మౌనపు గమనం
నీవు నేను తిలకించిన సమయం వయస్సులు తెలిపిన మోహన మంత్రణం   || నీలో నేనే || 

Wednesday, December 14, 2016

ఓ జీవా మహా జీవా చిరంజీవా నీవే జై చిరంజీవా

ఓ జీవా మహా జీవా చిరంజీవా నీవే జై చిరంజీవా
ఓ దేవా మహా దేవా మహదేశ్వరా నీవే మహేశ్వరా

ఈ జగతిలో ఎక్కడ ఏ జీవి జన్మించినా నీ రూప తత్వమే చిరంజీవా
ఈ విశ్వంలో ఎక్కడ ఏ రూపం ధ్యానించినా నీ జీవత్వమే పరమేశ్వరా  || ఓ జీవా ||

ఏ లోకాన్ని దర్శించినా నీ రూపమే వెలిసింది
ఏ ప్రదేశాన్ని చూసినా నీ ధ్యానమే తెలిసింది

ఏ శబ్దం వింటున్నా నీ ఓంకారమే పిలిచింది
ఏ స్వరం వస్తున్నా నీ లయకారమే పలికింది

ఏ రాగం పలుకుతున్నా నీ బంధమే తెలుపుతుంది
ఏ గానం తలచుకున్నా నీ స్వరమే వినిపిస్తుటుంది   || ఓ జీవా ||

ప్రతి జీవి దేహంలో ఓంకారమై ఆలయంగా కొలువై ఉన్నావు
ప్రతి జీవి శ్వాసలో లయకారమై దేవాలయంగా వెలిసున్నావు

ప్రతి రూపంలో ప్రత్యక్షమై ప్రతి స్వరూపంతో దర్శనమిస్తావు
ప్రతి ఆకారంలో ప్రవేశమై ప్రతి శ్వాసతో ఆత్మవై జీవిస్తున్నావు

ప్రతి భావంలో స్వభావమై నీవే వేదాన్ని తెలుపుతున్నావు
ప్రతి తత్వంలో పరతత్వమై నీవే జ్ఞానాన్ని భోదిస్తున్నావు   || ఓ జీవా ||

Wednesday, October 12, 2016

అదిగో మన తిరుమల గిరి తిరుమలేశుని బ్రంహాండోత్సవం

అదిగో మన తిరుమల గిరి తిరుమలేశుని బ్రంహాండోత్సవం
అదిగో మన బ్రంహాండ నాయకుని మహా ధ్వజ రథోత్సవం   || అదిగో ||

తిరుమల గిరిలో బ్రంహాండ నాయకుని కళ్యాణ మహోత్సవం శుభ సంతోషకరదాయకం
తిరుమల గిరిలో బ్రంహాండ నాయకుని మహా బ్రంహాండోత్సవం శుభోదయ మహనీయం

బ్రంహోత్సవాల కళ్యాణమును తిలకించేందుకు నడకతో సాగేను మహా జనుల సమూహమే
బ్రంహాండమైన రథోత్సవాన్ని దర్శించేందుకు భక్తి శ్రద్ధలతో కదిలేను మహా జనుల సంభరమే

తిరుమల గిరియే బ్రంహాండమై జగతికే మహా పుణ్య క్షేత్రముగా వెలిసినది
తిరుమల గిరియే మహోత్తరమై విశ్వానికే మహా ఖ్యాతి ఆలయంగా నిలిచింది  || అదిగో ||

సువర్ణ ఆభరణముల వజ్ర వైడూర్యములతో అలంకారమే అంగరంగ వైభోగము
మహా సుగంధ పరిమళాల పుష్పాలతో అలంకారమే మహోత్తర వైభోగ భాగ్యము

తేనీయ పాల ఫలహారములతో అభిషేకమే తిరుమలేశునికి మహా సుందర శ్రేష్టము
నూతన నవ సువర్ణ వర్ణ ఛాయ వస్త్రాలంకారణ తిరుమల వాసునికి మహా సౌభాగ్యము

రథములో కొలువై ఉన్న శ్రీనివాసుని దర్శనమే భక్తులకు మోక్షానందమయము
నిత్యం అన్నదాన ప్రసాదములతో భక్తుల అలసట తెలియని ఓ దైవానందము  || అదిగో || 

Tuesday, October 4, 2016

బ్రంహోత్సవం బ్రంహోత్సవం బ్రంహాండ నాయకుని బ్రంహోత్సవం

బ్రంహోత్సవం బ్రంహోత్సవం బ్రంహాండ నాయకుని బ్రంహోత్సవం
బ్రంహోత్సవం బ్రంహోత్సవం బ్రంహాండ నాయకుని మహా రథోత్సవం || బ్రంహోత్సవం ||

దివి నుండి భువి దాక అందరితో కలిసి సాగేను మహా బ్రంహోత్సవం
జనులందరు వచ్చి జరిపేను మహా నాయకుని కళ్యాణ మహోత్సవం

ముల్లోకాళ్ళ నుండి త్రీ లోక మూర్తులు వచ్చి దర్శించి జరిపేను మహా బ్రంహోత్సవం
గంధర్వ లోకాల నుండి అనంత లోకాల వరకు తరలి వచ్చి చూసేను బ్రంహోత్సవం

అంగరంగ వైభోవంగా జరిగేను బ్రంహాండ నాయకుని కళ్యాణ బ్రంహోత్సవం
ఆనందంతో మహా సుందరముగా జరిగేను బ్రంహాండ నాయకుని రథోత్సవం  || బ్రంహోత్సవం ||

పసుపు కుంకుమల గంధాల ఫలహారములతో జరిగేను అర్చనా అభిషేకములు
నవ నూతన పట్టు వస్త్రాలతో వజ్ర వైడూర్య సువర్ణాలతో జరిగేను అలంకారములు

కోటి జ్యోతులతో ఆలయం నక్షత్రాల నవ కాంతులతో గోపురములే మెరిసిపోయేను
సుగంధ కర్పూర కాంతులతో మహా జ్యోతులే మిరుమిట్లు గొలిపేలా వెలిగిపోయేను

నిత్య అన్నదానములు మహా ప్రసాదములు మధురమైన పానీయములే గొప్పగా ఆహారమయ్యేను
నవ ధాన్యములు తాజా కూరగాయలను మహా రాసులుగా పేర్చి వండేను మహా పరమాన్నములను || బ్రంహోత్సవం ||

విశ్వమంతా మహా ధ్వనులతో సంగీత వాద్యముల మేళ తాళాల సన్నాయిలతో జరిగేను బ్రంహోత్సవం
జగమంతా జనులందరు కలిసి మెలసి దైవత్వంతో జరుపుకునేను బ్రంహాండ నాయకుని మహా రథోత్సవం  

ప్రతి రోజు ప్రతి చోట ప్రతి రాత్రి సాగేను ఊరేగింపుగా మహా నాయకుని అశ్వ గజ సువర్ణ సూర్య చంద్ర రథోత్సవం
ప్రతి సారి పలుమార్లుగా సాగుతూ ఊరేగి పోయేను బ్రంహాండ నాయకుని మహా మధురమైన సర్వ బ్రంహోత్సవం

అవధులే లేని ఆనందమైన పరవళ్ళతో నృత్యం నాట్యం వేష భాష సాంప్రదాయ ప్రావీణ్య ప్రదర్శనలతో జరిగేను గొప్పగా మహా బ్రంహోత్సవం
ప్రతి ఒక్కరు సుఖ శాంతులతో ఆయురారోగ్యాలతో దీర్ఘ కాలం అనురాగ బంధాలతో జీవించేలా కల్పించేను మహా నాయకుని బ్రంహోత్సవం || బ్రంహోత్సవం ||