Tuesday, January 24, 2017

ఏనాటి మరణమో నీది ఓ అద్వైత్వ మహాత్మా

ఏనాటి మరణమో నీది ఓ అద్వైత్వ మహాత్మా
ఏనాటి జననమో నీది ఓ దైవత్వ పరమాత్మా
నీవు లేని మా లోకం ఏ మార్గం లేని గమ్యస్థానం  || ఏనాటి ||

నీ శ్వాస నిశ్వాస అయ్యేను
నీ జీవం నిర్జీవం అయ్యేను
నీ శబ్దం నిశ్శబ్దం అయ్యేను
నీ అర్థం నిరర్థకం అయ్యేను
నీ వ్యవస్థ అవస్థం అయ్యేను
నీ సారం నిస్సారం అయ్యేను
నీ జనం నీరాజనం అయ్యేను
నీ ఆకారం అహంకారం అయ్యేను   || ఏనాటి ||

నీ దేహం దైవం అయ్యేను
నీ సత్యం నిత్యం అయ్యేను
నీ తనం నిరంతరం అయ్యేను
నీ ప్రాణం ప్రణామం అయ్యేను
నీ లయం ఆలయం అయ్యేను
నీ స్వార్థం నిస్వార్ధం అయ్యేను
నీ శాంతం నిశాంతం అయ్యేను
నీ రూపం అపురూపం అయ్యేను
నీ వచనం నిర్వచనం అయ్యేను
నీ దర్శనం నిదర్శనం అయ్యేను
నీ అహంకారం ఓంకారం అయ్యేను   || ఏనాటి || 

No comments:

Post a Comment