Wednesday, January 4, 2017

జీవం ఉన్న రూపంలో మేధస్సు ఉందా

జీవం ఉన్న రూపంలో మేధస్సు ఉందా
మహా జీవం ఉన్న మేధస్సులో వేద విజ్ఞానం ఉందా
నిశ్చలమైన ఆకారంలో తత్వం ఉందా
మహా ఆకారం ఉన్న తత్వంలో స్వభావత్వం ఉందా   || జీవం ||

జీవమే రూపమై స్వధ్యాస భావాలతో సంచలనమై జీవిస్తున్నదా
ఆకారమే భావమై పరధ్యాస స్వభావాలతో అచలమై నిలిచినదా

జీవమే దేహ రూపమై శ్వాసే పరధ్యానమై ప్రతి జీవిలో నిలయమై ఉన్నాదా
అణువులే వివిధ ఆకారాలై పరధ్యాస ప్రభావంతో సృష్టిలో పొదిగి ఉన్నాయా  || జీవం ||

ప్రతి జీవం సహజత్వం ప్రతి అణువు పరమార్థం ప్రతి ఆకార రూపం పరమాత్మం
జీవంలో మహా తత్వం అణువులో స్వభావత్వం ప్రతీది పర రూప ఆకార తత్వం

జీవరాసుల జీవం ప్రకృతి సహజత్వం అణువుల పర జీవం పంచభూతాల భావాకార నైజత్వం  
జీవరాసుల జీవత్వం ప్రకృతిపై పరాధీనం రూపముల సహజత్వం పంచభూతాల నిశ్చలతత్వం  || జీవం ||

No comments:

Post a Comment