Monday, January 9, 2017

అఖిలాండ కోటి బ్రంహాండ నాయక తిరుమల గిరి నివాస శ్రీ శ్రీనివాస జయహో జయహో నీ బ్రంహోత్సవం

అఖిలాండ కోటి బ్రంహాండ నాయక తిరుమల గిరి నివాస శ్రీ శ్రీనివాస జయహో జయహో నీ బ్రంహోత్సవం
పర బ్రంహ పర రూప పరంధామ నీ రూప దర్శన భాగ్యంతో మాకు పరమాత్మ స్వరూపుని విజయానంద రథోత్సవం

మహా ఉత్సవమైన రథోత్సవం అఖిలాండ కోటి జనులకు మహా బ్రంహోత్సవం
మహా ఉజ్వలమైన మహోత్సవం మహా ప్రజ్వలమైన మహా దేవుని సర్వోత్సవం  || అఖిలాండ కోటి ||

ఉత్సాహంతో సాగే ఉత్సవం మహోన్నతంగా సాగే మహోత్సవం
స్వర్ణాలతో సాగే స్వర్ణోత్సవం స్వరాగాలతో సాగే మహా స్వరోత్సవం

దైవత్వంతో సాగే దైవోత్సవం సూర్యోదయానే సాగే సూర్యోత్సవం
ధర్మ రక్షణకై సాగే ధర్మోత్సవం సత్యానికై సాగే నిత్య సత్యోత్సవం

పసుపు కుంకుమ గంధముల తేనీయ క్షీరములతో అర్చన అభిషేకములే జరిగేను స్వామి దర్శనోత్సవం
నవ ధాన్యముల రాసులతో స్వర్ణ నాణెముల సిరి సంపదల ఆనందాలతో కలిగేను సుఖ సంతోషోత్సవం

స్వర్ణాకర్షణీయమైన నూతన నవ భావ వర్ణాల వస్త్రాలతో సాగే సుందరమైన శంఖు చక్రాల వస్త్రోత్సవం
మిరుమిట్లు గొలిపే వజ్ర వైడూర్య ముత్యపు పగడాల స్వర్ణాలంకారాలతో సాగే మహోజ్వల వజ్రోత్సవం   || అఖిలాండ కోటి ||

అనంత భరితమైన సులేత పుష్పాలతో సాగే సుమధుర సుగంధాల పుష్పోత్సవం
అత్యంత ప్రియమైన నవ అభిరుచులు గొలిపే ఫల హారములతో సాగే ఫలోత్సవం

మహా జ్యోతి దీపాల మంగళ హారతులతో ఆలయ అలంకారాల వెలుగులతో అఖండమైన దివ్య కాంతులతో జరిగేను ప్రజ్వలమైన నవ తేజోత్సవం
స్వప్త స్వరాల వేణు నాదముల కళా నైపుణ్య నాట్యములతో భూత భవిష్య విజ్ఞాన నాటక రంగములతో జరిగేను మహా విద్వాంసుల సంగీతోత్సవం

మేధస్సులో మర్మమే కలుగునట్లు వేద శ్లోకాల మంత్రాలతో సాగే మహా పండితుల సుప్రభాతోత్సవం
ఆలయమంతా మైమరచిపోవునట్లు నేతి సువాసనలు వెదజల్లే  నైవేద్యముతో జరిగేను ప్రసాదోత్సవం

అంగరంగ వైభోవంగా ఆడంభరమై అశ్వ గజ ఒంటె గోవులతో ఊరేగింపులే జరిగేను దేవుని పల్లకీతోత్సవం
అసంఖ్యాక జన సమ్మేళనంతో మేళ తాళాల డమరుకాలతో మహా భరితంగా సాగేను బ్రంహాండ రథోత్సవం  || అఖిలాండ కోటి ||

దశ దిశలుగా మహా పర్వతాల శిఖరాలకు సాగే మహా పురాణాల పవిత్ర ప్రతిభతో దివ్యోత్సవం
మహా భక్తుల వేద విజ్ఞాన పండితులకై సాగే అనంత రూపాల దశావతారాల విశ్వరూపోత్సవం

తరతరాలకు తరగని తన్మయోత్సవం ఆత్మ పరమాత్మ అంతరంగమున అంతర్భావోత్సవం
బ్రంహ జ్ఞాన విజ్ఞానులకు మహా బ్రంహ్మోత్సవం సర్వ విజ్ఞాన వేద పండితులకు వేదాంతోత్సవం

జన్మించే ప్రతి జీవికి ఎదుగుటలో శ్వాసకు జీవోత్సవం శ్రమించే ప్రతి జీవికి ప్రతిఫలమే విజయోత్సవం
హితముకై నీతి తత్వాలతో సాగే మహాత్ములకు హంసోత్సవం ఆనందాన్ని పంచువారికే బ్రంహానందోత్సవం

విశ్వ జగతి శాంతముకై లోక కళ్యాణముతో జరిగేను మహా బ్రంహాండ నాయకుని శుభ కళ్యాణోత్సవం
అంతరిక్షపు బ్రంహాండ లోక రక్షణకై సుదీర్ఘ కాల ప్రయాణమై జరిగేను ప్రశాంతమైన అనంతోత్సవం   || అఖిలాండ కోటి ||

No comments:

Post a Comment