Wednesday, January 11, 2017

నీరు లేక రైతు కంటి నీరు కరిగి నేల రాలి ఆవిరైపోయేనే

నీరు లేక రైతు కంటి నీరు కరిగి నేల రాలి ఆవిరైపోయేనే
నీరు లేక రైతు భూమి ఎండిపోయి బీడుగా మారిపోయేనే

నీరు లేక వర్షాలు రాక ఎండలకే ఎండిపోయిన నేల కరువుతో ఎంతకాలం సాగునో
నీరు లేక కరువు కాలం కలికాలమై రైతుల జీవితాలు పేదబారిపోయి తరిగిపోవునో || నీరు లేక ||

నీరు లేక బావులే ఎండినా దాహమే తీరని నీటి చుక్కలతో రైతు శక్తి పదును లేని నాగలిగా పడిపోయెనే
నీరు లేక దాన్యమే పండక ఆకలి తీరని అల్పాహారంతో రైతు శక్తి ఉత్తేజము లేని పనిగా మిగిలిపోయెనే

అన్నదాతగా ఉన్న నీకు నీరు లేకపోతే అన్నపూర్ణేశ్వరి గంగమ్మతో వర్షాల సంగతి చెప్పుకోలేకపోయెనే
మహారాజుగా నవ దాన్యముల రాసులతో ఎదిగిన నీకు నీరు లేకపోతే భగీరథ ప్రయత్నం జరగలేకపోయెనే

నీరు లేని క్షణం ఎవరికైనా మహా కఠినమైన జీవనం నీరు లేని పైరు హరితము లేక వాడిపోయెనే
నీరు లేని రోజు ఎప్పటికైనా మహా నికృష్టమైన జీవనం నీరు లేని ప్రకృతి శ్వాస లేక చెదిరిపోయెనే  || నీరు లేక ||

నీరు లేక జనం అనారోగ్యంతో విలవిలలాడుతూ ఊపిరి లేక మూర్ఛపోయెనే
నీరు లేక జగతి జలశోషముతో భగభగమంటూ నీడ లేక వృక్షాలే వాలిపోయెనే

నీరు లేని దేశం నదులు లేని ప్రదేశం సముద్రాలకు తెలియని అనర్థమైపోయెనే
నీరు లేని విశ్వం జీవం లేని ప్రాంతం ఏ పర్వతాలకు తెలియని వ్యర్థమైపోయెనే

నీరు లేక ఇంకిపోయిన పొలాలను చూసి భూదేవి వరుణుడకు జలధారకై చెప్పలేకపోయెనే
నీరు లేక నదులు ఉప్పొంగలేక వాగు వంకలు ప్రవహించక సప్త సముద్రాలు నిలిచిపోయెనే  || నీరు లేక || 

No comments:

Post a Comment