Wednesday, January 25, 2017

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నీ కరుణ దీవెనలు మాకు శుభదాయకం

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నీ కరుణ దీవెనలు మాకు శుభదాయకం
ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావో నీ ఆశీర్వాదములు మాకు ఆనందాయకం  || ఎక్కడ ||

ధామ పరులకు పరంధామవు నీవే
ఆత్మ జ్ఞానులకు పరమాత్మవు నీవే
హిత పరులకు పురోహితుడవు నీవే
ప్రజల పాలకులకు ప్రజాపతివి నీవే
శోధన పరులకు పరిశోధకుడవు నీవే
నాభి పద్మములకు పద్మనాభవు నీవే    || ఎక్కడ ||

భువన వాసులకు మహా ప్రభువు నీవే
జ్యోతి వెలుగులకు పరంజ్యోతివి నీవే
పుర నివాసులకు పురందరుడవు నీవే
ఆనంద పరులకు పరమానందవు నీవే
ప్రతిభ పరులకు ప్రతిభావంతుడవు నీవే
ఉత్తమ పురుషులకు పురుషోత్తమవు నీవే    || ఎక్కడ || 

No comments:

Post a Comment