Tuesday, January 17, 2017

విశ్వ భోగమిదే దైవ యోగమిదే దేవా

విశ్వ భోగమిదే దైవ యోగమిదే దేవా
సర్వ యోగమిదే వేద భోగమిదే దేవా
జీవ ప్రయోగమైన ఉపయోగ శోభనమిదే దేవా  || విశ్వ భోగమిదే ||

ధ్యాన యోగమైన ధ్యాస సంభోగమైన
ఆత్మ జీవమైన పరమాత్మ సహజీవమే

వేద భావమైన జీవ తత్వమైన
పర దేహమైన పరరూప తత్వమే

ప్రాణ బంధమైనా ప్రణయ రూపమైన
కాల కార్యమైనా కర్త క్రమ సిద్ధాంతమే   || విశ్వ భోగమిదే ||

జన్మ జన్మలకు తర తరాలకు
యుగ యుగాలకు దశ దిశల శతాబ్దాలు సాగేనే

విశ్వ జనులకు సకల జీవరాసులకు
జీవ శ్వాసకు దైవ దేహ ప్రకృతి ఒకటిగా సాగేనే

జనన మరణాల సంభోగ యోగములు
కార్య చరణాల ఇంద్రియ భావాలు కాలమై సాగేనే   || విశ్వ భోగమిదే || 

No comments:

Post a Comment