Wednesday, January 25, 2017

ఏమిటో నీ జాడ కాస్తైనా తెలియకున్నది ఓ పరమాత్మా

ఏమిటో నీ జాడ కాస్తైనా తెలియకున్నది ఓ పరమాత్మా
ఏమిటో నీ రూపం కాస్తైనా కనబడకున్నది ఓ పరంధామా

ఏమిటో నీ భావం ఒకటైనా కలగకున్నది ఓ పురుషోత్తమా
ఏమిటో నీ తత్వం ఒకటైనా ధరించకున్నది ఓ పద్మనాభమా  || ఏమిటో ||

ఏనాటి పర బ్రంహవో యుగ యుగాలకు నీవే మా పూర్వ పురుషోత్తమవు
ఏనాటి పర విష్ణువో తర తరాలకు నీవే మా పురాణ గాధల పురోహితుడవు

ఏ ధ్యానము చేసినా ఏ ధ్యాస ఉంచినా నీవే కానరాని మహోదయ పురుషుడవు
ఏ యాగము చేసినా ఏ దీక్షలు సాగించినా నీవే దర్శించని మహా పురంధరుడవు  || ఏమిటో ||

నీవు లేకున్నా ఉన్నావనే భావనతో దైవ ప్రవక్తగా కొలిచి వేదాల ప్రవచనాలనే నీకు అర్పించెదము
నీవు ఎలా ఉన్నావో తెలియకున్నా విశ్వ కర్తగా తలిచి శతాబ్దాలుగా కీర్తనలనే నీకు వినిపించెదము

నీవు లేనన్న మాట ఎవరికి తెలియనివ్వక మీ పూర్వ చరణములనే భోదించెదము
నీవు రావన్న బాట ఎవరికి చూపనివ్వక మీ పురాణ చరిత్ర గాధములనే తెలిపెదము  || ఏమిటో || 

No comments:

Post a Comment