Tuesday, January 3, 2017

రామ శ్రీరామ పరంధామ రావా మన జీవుల రక్షణకై మహా పర్వతాలను అధిరోహిస్తూ రాలేవా

రామ శ్రీరామ పరంధామ రావా మన జీవుల రక్షణకై మహా పర్వతాలను అధిరోహిస్తూ రాలేవా
రామ జయరామ నవదశరామ రావా మన మహాత్ముల భవిష్య జీవితాలకై అవధూతగా రాలేవా  || రామ శ్రీరామ ||

విశ్వానికి నీ రూపం చూపే భాగ్యం సూర్యోదయంతో మహా అవతారమై దర్శనమిస్తున్నది
జగతికి నీ ఆకారం చూసే సౌభాగ్యం ప్రజ్వల ఉజ్వల కిరణాలతో అద్వైత్వమై కనిపిస్తుంది

ఎగిరే కెరటాలన్నీ నీ రూపాన్ని తాకేలా ఉద్వేగ స్వభావాన్ని చూపే నైతిక నవ తేజమే
ఎగిరే అలలన్నీ నీ ఆకారాన్ని చేరేలా ప్రయాణించే మార్గాన్ని తెలిపే భావాల ఉత్తేజమే  || రామ శ్రీరామ ||

ఆకాశాన్ని తాకే నీ రూపాన్ని ఎగిరే పక్షులకు అందని సాగని దూర ప్రదేశ స్థానమున కొలువై ఉన్న మహర్షివే
పాతాళాన్ని చూపే నీ పాదాన్ని జల జీవ రాసులకు తెలియని కనిపించని లేత స్వాభావితమై ఉన్న బ్రంహర్షివే

యుగముల గడిచినా వేద కాలాలు తరలిపోయినా ప్రళయాలు సంభవించినా నీ రూపం జగన్మాత జగదీశ్వరమే
సకల జీవరాసులు అంతమైన సూక్ష్మ రూపములు అదృశ్యమైన చీకటి వెలుగులు ఆగినా నీ రూపం రామచంద్రమే  || రామ శ్రీరామ ||  

No comments:

Post a Comment