Showing posts with label ధైర్యం. Show all posts
Showing posts with label ధైర్యం. Show all posts

Tuesday, January 3, 2017

ఘటన ప్రతిఘటన ప్రతి జీవికి ఓ మహా సంఘటన

ఘటన ప్రతిఘటన ప్రతి జీవికి ఓ మహా సంఘటన
ఘటన ప్రతిఘటన ప్రతి రోజుకు ఓ గొప్ప సంఘటన  || ఘటన ||

లక్ష్యంతో పోరాడే జనులలో కలిగే మహా సమరమే ప్రతిఘటన
ధైర్యంతో పోరాడే జనులలో కలిగే మహా ఆవేశమే ప్రతిఘటన

ప్రతి జీవికి ఎదురయ్యే సమస్యలే ఎన్నో సంఘటనల సందిగ్ధం
ప్రతి రోజు ఎదురయ్యే సమస్యలే ఎన్నో సంఘటనల సంశయం  || ఘటన ||

మన కార్యాలతో సాగే సమావేశాల సంఘటనలే సమాజంలో ప్రతిఘటనలై ఉద్భవించేను
మన కార్య సాధనాలతో సాగే ధర్నాల సంఘటనలే మనలో ప్రతిఘటనలై సంభవించేను

మనలో కలిగే వ్యసనాల సంక్షోభాల సంశయమే సంఘటనల ప్రతిఘటనం
మనలో తీరని ఆశా కోరికల సమస్యల సందేశమే సంఘటనల ప్రతిఘటనం   || ఘటన || 

Thursday, July 14, 2016

సహాసమే సామర్థ్యమై శ్వాసే విజయం వైపు సాగించునా

సాహసమే సామర్థ్యమై శ్వాసే విజయం వైపు సాగించునా
ఆలోచనే ప్రయత్నమై ధ్యాసే మహా కార్యంతో సాగిపోవునా

సాహసమే ఊపిరిగా కార్యమే ధ్యాసగా విజయమే లక్ష్యమై సాగేనా
ఆలోచనే ధైర్యంగా ప్రయత్నమే ఉత్తేజముగా కర్తవ్యంతో సాగునా  || సాహసమే ||

జీవించుటలో ఎదిగే విజ్ఞానమునకై సాహసం చేసెదెమా
జీవితంలో కలిగే అనుభవానికై సామర్థ్యంతో పోరాడెదమా

భవిష్య కాలంతో సాగేందుకు పరుగులు చేసెదమా
రేపటి కాలంతో నడిచేందుకు ప్రయాణం సాగించెదమా   || సాహసమే ||

జీవం ఉన్నంతవరకకైనా మన విజ్ఞానాన్ని చాటుకుందామా
విశ్వం సహకరించువరకు మన అనుభవాన్ని తెలుపుకుందామా

స్నేహంతో సాగే జీవితాన్ని అందరికి ఇప్పుడే పంచెదమా
సాహసంతో సాగే విజయ రహస్యాన్ని ఎందరికో తెలిపెదమా  || సాహసమే ||