Showing posts with label క్రియ. Show all posts
Showing posts with label క్రియ. Show all posts

Thursday, May 25, 2017

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను
భావమే ఒక కార్యమై మేధస్సునే నడిపించేను

మనలో ఎన్ని కార్య భావాల ఆలోచనలు సాగినా
మేధస్సులో అంతరంగ స్వత భావాలు దాగేను
 
విజ్ఞానము మేధస్సులో ఆలోచనగా లేకున్నను
భావనగా దేహములో అంతర్భావమే కొనసాగేను   || ఆలోచన ||

ఏనాడు నా శ్వాసపై స్వధ్యాస ఉంచకున్నను 
నా మేధస్సే హృదయ క్రియలను సాగించేను

ఏనాడు నా స్వభావాలపై సమయాలోచన చేయకున్నను
నా మేధస్సే ఆలోచనలతో ఎన్నో కార్యాలను జరిపించేను  || ఆలోచన ||

ఏనాడు నా అంతర్భావాలను గమనించకున్నను
నా మేధస్సే అంతర్లీనమై దేహాన్ని సమకూర్చేను

ఏనాడు నా దేహాన్ని స్వతహాగ ఓదార్చకున్నను
నా మేధస్సే నన్ను మహా గొప్పగా మైమరిపించేను  || ఆలోచన ||

Tuesday, July 5, 2016

సృష్టి కర్తవు నీవే సృష్టి వినాశానివి నీవే

సృష్టి కర్తవు నీవే సృష్టి వినాశానివి నీవే
సృష్టిలోని జీవితాన్ని నడిపించేది నీవే
సృష్టి క్రియలలో దాగిన సృష్టి కర్మవు నీవే
కర్త కర్మ క్రియల ప్రతిఫలాన్ని అందించేది నీవే
ప్రతి కార్యము నీ భావ స్వభావాన్నే తెలుపుతున్నది 

Thursday, May 26, 2016

శివాయ విశ్వరూపాయా ఓంకార నమః శివాయా

శివాయ విశ్వరూపాయా ఓంకార నమః శివాయా
శివాయ దివ్య రూపాయా ఓంకార పంచ భూతాయా
శివాయ మహా రూపాయా  ఓంకార సర్వ రూపాయా
శివాయ దైవ రూపాయా ఓంకార జీవ రూపాయా
శివాయ కరుణ రూపాయా ఓంకార కర్త కర్మ క్రియ రూపాయా