Showing posts with label అభ్యాసం. Show all posts
Showing posts with label అభ్యాసం. Show all posts

Wednesday, December 14, 2016

అన్వేషణ మొదలైనది మనలో

అన్వేషణ మొదలైనది మనలో
అభ్యాసం సాగినది మనలో
ఆలోచన కలిగింది మనలో
అధ్యాయం కదిలింది మనలో
సాధనతో సంభాషణ కాలంతో సమావేశం మనలో  || అన్వేషణ ||

ఏ గ్రంథాన్ని చదవడం మొదలుపెట్టినా పుట్టుపూర్వోత్తరముల చరిత్ర పురాణాలే
ఏ ప్రణాళిక చూసినా ఆర్ధిక సమాచార విషయ వ్యాస ప్రసంగ ప్రతిపాదన కథనాలే
ఏ వేదాంగ ఉపోద్ఘాతాన్ని చూడడం ఆరంభించినా వేదాంత సిద్ధాంతాల సూత్రాలే
ఏ ప్రస్తావన వింటున్నా సమాచార వ్యవస్థ విధానములో ఎప్పటికి మార్పుచేర్పులే

ఏ నిఘంటువును పదావిష్కరణ చేస్తున్నా ఎన్నేన్నో కొత్త పదాల పరిచయ అర్థాలే
ఏ సంఘటనలను పరిశోధించినా శాస్త్రీయ రహస్యముల బహు సహజ కార్యములే
ఏ రూపాంతర నిర్మాణాన్ని ఆవిష్కరిస్తున్న ధృడమైన పూర్వ పునాదుల ఆకారాలే
ఏ జీవ శాస్త్రీయ పరిశోధన చేసినా భావ స్వభావాల తీరు ప్రాణధార తత్వాల వంశ పోషకాలే
ఏ జనన మరణాన్ని తిలకించినా విశ్వ జగతిలో మానవ మేధస్సుకు అద్భుత ఆశ్చర్యములే  || అన్వేషణ ||

ఏ కార్య క్రమాన్ని ప్రారంభించినా వివిధ పద్ధతుల కట్టుబాట్ల సూచన ప్రస్తావనములే
ఏ సంఘటనను పరిష్కారిస్తున్నా దినచర్య సంగతుల ఉపక్రమణిక మూల వివరణాలే
ఏ అక్షర అభ్యాస శిక్షణ చేసినా వ్యాకరణ ఛందస్సులతో పద పోషణ అవధాన పాఠాలే
ఏ సంతాపాన్ని ముగించినా వ్యక్తిగత అంతర్భావ సందిగ్ద సంక్షోభ సమాప్త సమస్తములే
ఏ ప్రకృతి వనరులను వినియోగించినా తీరని తరగని మానవ జీవ భోగ పర్యాయములే

ఏ వ్యూహంలో ప్రవేశించినా వాజ్ముఖ నమూనాల విజ్ఞాన కేంద్రీకృత వర్ణాంశ చిత్రీకరణాలే
ఏ ప్రదేశాన్ని చేరుకున్నా సంప్రాదయాక అలవాట్ల అనుభవాల జీవన ఉన్నతి విధానాలే
ఏ ఆధ్యాత్మ తత్వ ఉపక్రమ సంచికను పర్యవేక్షించినా సంస్కృత శ్లోకాల కీర్తన ప్రవచనాలే
ఏ సాంకేతిక ప్రజ్ఞానాన్ని సూక్ష్మంగా పరిశోధించినా ఎన్నో యంత్ర తంత్ర రూప భావ నిర్మాణాలే
ఏ లోక విశ్వ జగతిని దర్శించినా అంతరిక్ష గ్రహ నక్షత్ర కూటముల స్థానములు అందని స్థావరాలే   || అన్వేషణ ||