Monday, March 15, 2021

హృదయం మధురమైన భావ స్పందనం

హృదయం మధురమైన భావ స్పందనం 
హృదయం మాధుర్యమైన తత్త్వ స్పర్శనం 

హృదయం మందారమైన జీవ స్రవణం 
హృదయం మందిరమైన రూప శ్రావణం 

హృదయం మనోహరమైన నాద విశేషణం 
హృదయం మహోన్నతమైన వేద విశ్లేషణం   || హృదయం || 

హృదయం స్పందించినప్పుడే దేహం ఉద్భవించునా  
హృదయం స్పర్శించినప్పుడే ఆత్మం ఉదయించునా 

హృదయం అర్పించినప్పుడే దేహం ఆవిర్భవించునా 
హృదయం పుష్పించినప్పుడే ఆత్మం ఆశ్రయించునా 

హృదయం కరుణించినప్పుడే దేహం ఉత్కృష్టమగునా 
హృదయం అరుణించినప్పుడే ఆత్మం ఉత్పన్నమగునా   || హృదయం || 

హృదయం పరిశుద్ధమైనప్పుడే దేహం అనుగ్రహించునా 
హృదయం పరమాత్మమైనప్పుడే ఆత్మం ఆవిష్కరించునా 

హృదయం పరిరక్షించిన్నప్పుడే దేహం మహొత్సవించునా  
హృదయం పరితపించిన్నప్పుడే ఆత్మం మహోత్కరించునా 

హృదయం అనుభవించినప్పుడే దేహం పురస్కరించునా 
హృదయం అనుమతించినప్పుడే ఆత్మం పరిభ్రమించునా   || హృదయం || 

ఆనందం అలసటగా మారుతున్నదా

ఆనందం అలసటగా మారుతున్నదా 
సంతోషం సహనాన్ని కోల్పోతున్నదా 
ఉల్లాసం ఉద్రిక్తతంగా సాగుతున్నదా 
ఉత్తేజం ఉద్గమనమై వీడుతున్నదా 

Sunday, March 7, 2021

ఉదయించు మేధస్సులో అస్తమించు దేహస్సులో పునః ప్రారంభం నా భావనయేనా

ఉదయించు మేధస్సులో అస్తమించు దేహస్సులో పునః ప్రారంభం నా భావనయేనా 
ఉద్భవించు మనస్సులో అంతరించు వయస్సులో పునః పరిభ్రమణం నా తత్త్వమేనా 

జన్మనించు అహస్సులో అదృశ్యించు ప్రభస్సులో పునః పరిమాణం నా విజ్ఞానమేనా 
ఆవిర్భవించు తేజస్సులో విరమించు తపస్సులో పునః ప్రభావితం నా వేదాంతమేనా 

ప్రస్తావించు నాదస్సులో సమీపించు ఆయుస్సులో పునః ప్రయాణం నా పరిశోధనయేనా 
సంస్కరించు జీవస్సులో తరంగించు జ్యోతిస్సులో పునః ప్రమేయం నా అన్వేషణయేనా 

Saturday, March 6, 2021

ఎంతటిదో నా దేహం

ఎంతటిదో నా దేహం 
ఎంతటిదో నా జీవం 

ఏనాటిదో నా ఆత్మ 
ఏనాటిదో నా ధాత్మ 

ఎంతటిదో నా రూపం 
ఎంతటిదో నా వేదం 

ఏనాటిదో నా జ్ఞానం 
ఏనాటిదో నా కాలం 

ఎంతటిదో నా భావం 
ఎంతటిదో నా తత్త్వం 

జీవించుటలో కలిగే ఆనంద భాష్పాలు అమర పుష్పాలుగా ఉదయించునా 
సాధించుటలో కలిగే అదర కావ్యాలు అనంత పద్యాలుగా ప్రసవించునా      || ఎంతటిదో || 

నిత్యం మేధస్సులో మర్మం శ్రమించునా 
సర్వం మనస్సులో మంత్రం స్మరించునా 

దైవం వయస్సులో శాంతం రక్షించునా 
దేహం అహస్సులో కాంతం వీక్షించునా 

తత్త్వం ప్రభస్సులో ప్రాయం ప్రకాశించునా 
సత్వం శిరస్సులో త్రయం తపసించునా 

మౌనం మోహస్సులో వేదం వికసించునా 
జ్ఞానం తేజస్సులో భావం విశ్వసించునా     || ఎంతటిదో || 

లోకం తపస్సులో ధర్మం గమనించునా 
విశ్వం రేతస్సులో శర్మం రమణించునా 

కాలం ధనస్సులో వేగం ప్రయాణించునా 
పూర్వం ఉషస్సులో రాగం కరుణించునా 

పాదం రజస్సులో చూర్ణం సొగసించునా 
నాదం శ్రేయస్సులో వర్ణం పులకించునా 

సత్యం సరస్సులో గంధం పుష్పించునా 
ముత్యం ఆయుస్సులో బంధం అర్పించునా    || ఎంతటిదో || 

Wednesday, March 3, 2021

ఆలోచనకు లక్ష్యం లేదు

ఆలోచనకు లక్ష్యం లేదు 
ఆలోచనకు సాధ్యం లేదు 
 
ఆలోచనకు భావం లేదు 
ఆలోచనకు లభ్యం లేదు

ఆలోచనకు వేదం లేదు 
ఆలోచనకు తత్త్వం లేదు  

ఆలోచనకు రూపం లేదు 
ఆలోచనకు నాదం లేదు 

ఆలోచనకు జీవం లేదు 
ఆలోచనకు కార్యం లేదు 

ఆలోచనకు కాలం లేదు 
ఆలోచనకు మూలం లేదు

ఆలోచనకు సర్వం లేదు 
ఆలోచనకు నిత్యం లేదు 

ఆలోచనకు బంధం లేదు 
ఆలోచనకు కాంతం లేదు 

ఆలోచనకు లౌక్యం లేదు 
ఆలోచనకు సౌఖ్యం లేదు 

ప్రతి ఆలోచనకు మనమే స్పూర్తినిస్తూ ఎన్నో కార్యాలను ఎన్నో విధాలా మనస్సుతోనే అధిగమించెదమూ  

Tuesday, March 2, 2021

పరిశుద్ధమైన ఆహారమే ఆరోగ్యమేనా

పరిశుద్ధమైన ఆహారమే ఆరోగ్యమేనా 
పర్యావరణమైన ఆరోగ్యమే ఆయుస్సేనా 
పవిత్రమైన ఆయుస్సే అమరత్వమేనా 

మానవ మేధస్సులో ఆలోచనలు విజ్ఞాన కార్యాలలో పరిశుద్ధమేనా 
మానవ మనస్సులో ఆలోచనలు విజ్ఞాన కార్యాలలో పరిపూర్ణమేనా 

మానవ దేహస్సులో ఆలోచనల భావ తత్వాలు అనుభవాల ఆరోగ్యమేనా   || పరిశుద్ధమైన || 

ఆలోచనకు ఆహారం భావనయేనా

ఆలోచనకు ఆహారం భావనయేనా 
ఆలోచనకు ఆరోగ్యం తత్వనయేనా 

ఆలోచనకు ఆనందం ఆదరణయేనా  
ఆలోచనకు ఆదర్శం ఆయస్సేయేనా 

ఆలోచనకు అనుబంధం అనుమతియేనా 
ఆలోచనకు అనుభవం అహంకారణమేనా 

శ్రీరామ రాజస్వ పద్మజాలం

శ్రీరామ రాజస్వ పద్మజాలం 
సీతాపతి నేత్రస్య కమలాకరం 

శ్రీరాఘవ విస్మయ చరణం 
రఘుపతి స్మరణ భరితం 

శ్రీరాజక నగర ప్రబోధకం 
విశ్వపతి ప్రమేయ పరిపూర్ణం 

శ్రీరామనాథ శ్రీమంత శ్రీకారం
పరపతి శ్రీకరం శ్రీకార్యం 

మహానుభావ మహాత్మ పరమాత్మం 
మహోదయ మహత్వ మహనీయం 

నమో శ్రీరామ చంద్ర తేజం 
నమో శ్రీరామ కాంత రూపం 

నమో శ్రీరామ విశిష్ట ధ్యానం 
నమో శ్రీరామ వైవిద్య భావం 

నమో శ్రీరామ రామ రమణ రమ్యం రమణీయం