ఉదయించు మేధస్సులో అస్తమించు దేహస్సులో పునః ప్రారంభం నా భావనయేనా
ఉద్భవించు మనస్సులో అంతరించు వయస్సులో పునః పరిభ్రమణం నా తత్త్వమేనా
జన్మనించు అహస్సులో అదృశ్యించు ప్రభస్సులో పునః పరిమాణం నా విజ్ఞానమేనా
ఆవిర్భవించు తేజస్సులో విరమించు తపస్సులో పునః ప్రభావితం నా వేదాంతమేనా
ప్రస్తావించు నాదస్సులో సమీపించు ఆయుస్సులో పునః ప్రయాణం నా పరిశోధనయేనా
సంస్కరించు జీవస్సులో తరంగించు జ్యోతిస్సులో పునః ప్రమేయం నా అన్వేషణయేనా
No comments:
Post a Comment