ఎంతటిదో నా దేహం
ఎంతటిదో నా జీవం
ఏనాటిదో నా ఆత్మ
ఏనాటిదో నా ధాత్మ
ఎంతటిదో నా రూపం
ఎంతటిదో నా వేదం
ఏనాటిదో నా జ్ఞానం
ఏనాటిదో నా కాలం
ఎంతటిదో నా భావం
ఎంతటిదో నా తత్త్వం
జీవించుటలో కలిగే ఆనంద భాష్పాలు అమర పుష్పాలుగా ఉదయించునా
సాధించుటలో కలిగే అదర కావ్యాలు అనంత పద్యాలుగా ప్రసవించునా || ఎంతటిదో ||
నిత్యం మేధస్సులో మర్మం శ్రమించునా
సర్వం మనస్సులో మంత్రం స్మరించునా
దైవం వయస్సులో శాంతం రక్షించునా
దేహం అహస్సులో కాంతం వీక్షించునా
తత్త్వం ప్రభస్సులో ప్రాయం ప్రకాశించునా
సత్వం శిరస్సులో త్రయం తపసించునా
మౌనం మోహస్సులో వేదం వికసించునా
జ్ఞానం తేజస్సులో భావం విశ్వసించునా || ఎంతటిదో ||
లోకం తపస్సులో ధర్మం గమనించునా
విశ్వం రేతస్సులో శర్మం రమణించునా
కాలం ధనస్సులో వేగం ప్రయాణించునా
పూర్వం ఉషస్సులో రాగం కరుణించునా
పాదం రజస్సులో చూర్ణం సొగసించునా
నాదం శ్రేయస్సులో వర్ణం పులకించునా
సత్యం సరస్సులో గంధం పుష్పించునా
ముత్యం ఆయుస్సులో బంధం అర్పించునా || ఎంతటిదో ||
No comments:
Post a Comment