Showing posts with label పరీక్ష. Show all posts
Showing posts with label పరీక్ష. Show all posts

Wednesday, March 15, 2017

ఏదో చూస్తూ ఉన్నా తోచదులే నా మదిలో

ఏదో చూస్తూ ఉన్నా ఏది తోచదులే నా మదిలో
ఏదో చేస్తూ ఉన్నా ఏది కలగదులే నా యదలో
ఏదో వింటూ ఉన్నా ఏది నిలవదులే నా దేహంలో

ఏదేదో చేయాలని ఎంతో నేర్చుకోవాలని అనుకున్నా నేనే నా మేధస్సులో ఎంతో గొప్పగా  || ఏదో చూస్తూ ||

ఎప్పటి దాకా చూస్తానో ఎంత వరకు చేస్తానో ఏదైనా వింటానో తెలియదులే తుది వరకు
చూసింది ఎప్పటిదో చేసింది ఏనాటిదో విన్నది ఏమైనదో తెలియదులే ఏ చివరి వరకు

జ్ఞాపకాల విజ్ఞానంతో మరవలేని జ్ఞానంతో ఏదో తెలియని కార్యాలతో సాగేను నా ప్రయత్నం
అనుభవాల నిర్ణయంతో ఏదో పరిష్కారంతో అధ్యాయాలుగా కార్యాలతో సాగేను నా విజయం  || ఏదో చూస్తూ ||

నా కార్యాలకు ఏ విఘ్నం కలిగినా అభ్యంతరం లేదని నాలో కలిగే భావాలే తెలిపేను పరమార్థం
నా సమస్యలకు ఆటంకం వచ్చినా అనర్థం జరిగినా నాలో నిలిచే ఆలోచనలే తెలిపేను పరమాత్మం

ఏ కాలం ఏ విజ్ఞానాన్ని తెలుపుతుందో మేధస్సుకే పరీక్షగా ఆలోచనలకే సమస్యగా తోచే గమనం
ఏ సమయం ఏ అనుభవాన్ని సూచిస్తుందో మేధస్సుకే దీక్షగా భావాలకే కఠినంగా తోచే తరుణం  || ఏదో చూస్తూ || 

Tuesday, January 3, 2017

ఏ జీవి ఎటువంటి జీవితాన్ని సాగిస్తున్నదో

ఏ జీవి ఎటువంటి జీవితాన్ని సాగిస్తున్నదో
ఏ మనిషి ఏనాటి జీవితాన్ని సాగిస్తున్నాడో
స్వధ్యాస జీవుల జీవితాలకే ఒక మహా పరీక్ష   || ఏ జీవి ||

కొన్ని జీవులు నీటిలో జీవిస్తున్నా పరలోకాన్ని చూడలేవు
కొన్ని జీవులు గాలిలో జీవిస్తున్నా మరోలోకాన్ని తలచలేవు

ఎన్నో జీవరాసులు ఈదుతున్నా నిత్యం నడవలేవు
ఎన్నో జీవరాసులు ఎగురుతున్నా నిత్యం నడవలేవు

ఎన్నో జీవరాసులు ప్రాకుతున్నా ఎప్పటికి ఎగరలేవు
ఎన్నో జీవరాసులు గెంతుతున్నా ఎప్పటికి ఎగరలేవు    || ఏ జీవి ||

మానవ జీవులు తమ భావాల పరిశోధన విజ్ఞానంతో ఎన్నో రకాలుగా ప్రయాణించెదరు
మానవ జీవుల సాంకేతిక ప్రజ్ఞానంతో ఎన్నో రకాల యంత్రాల ద్వారా ప్రయాణించెదరు

ఇతర జీవరాసులన్నీ తమ జీవితాలను ప్రాథమిక ప్రకృతి సహజత్వముతో ప్రతి కార్యాన్ని సాగిస్తాయి
ఎలాంటి ఆహారమైన వసతి ఐనా ప్రయాణమైనా రోగమైనా సహజత్వ జీవన విధానాన్నే సాగిస్తాయి

మానవుని జీవితాలు వైవిధ్యమైన యాంత్రిక విజ్ఞాన విధానాల సమస్యలతో ముడిపడి ఉన్నాయి
జీవరాసుల జీవితాలు ప్రకృతి స్వభావ సహజత్వంతో జీవన విధాన కార్యాలు ముడిపడి ఉన్నాయి  || ఏ జీవి || 

Wednesday, November 23, 2016

ఏకముఖత్వ ద్వినేత్ర త్రిగుణ చతుర్భావ పంచేంద్రియాలతో నీవు రూపాన్ని దాల్చావులే

ఏకముఖత్వ ద్వినేత్ర త్రిగుణ చతుర్భావ పంచేంద్రియాలతో నీవు రూపాన్ని దాల్చావులే
అరిషడ్వార్గాల సప్త తత్వములచే నీకు అష్ట భాగ్యముల నవ చక్రాల దశవిధ పరీక్షములే  || ఏకముఖత్వ ||

సప్త సముద్రాల భావాలు సప్త ఋషుల తత్వాలు నీలో ఒకటయ్యేనా
నవగ్రహాల నవ నోములు నవరాత్రుల నవ వ్రతాలు నీకు ఒకటయ్యేనా

చతుర్వేదాల వేదాంతాలు నాలుగు పాదాలలో ధర్మమై నీకోసం నడిచేనా
అష్టదిక్పాలకుల అనుభవాలు అష్ట దిక్కులలో నీకు పరిస్కారమయ్యేనా

పంచ జ్ఞానేంద్రియాల విజ్ఞానం పంచమ గ్రంధాలలో లిఖించేనా
త్రీలోక మూర్తుల బంధాలు త్రిగుణాల పరిచయాలతో సాగిపోవునా

ద్విగుణములచే అరిషడ్వర్గాలను ఏకధాటిగా నీవు లోకానికై జయించేవా
భిన్నత్వము నుండి ఏకత్వమును అందరిలో సంపూర్ణంగా మార్చెదవా    || ఏకముఖత్వ ||