Showing posts with label జీవి. Show all posts
Showing posts with label జీవి. Show all posts

Thursday, September 8, 2016

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రేమతో జగతికి ప్రణామం

ప్రణామం ప్రణామం ప్రణామం ప్రేమతో జగతికి ప్రణామం
ప్రమేయం ప్రమేయం ప్రమేయం ప్రేమతో విశ్వానికి ప్రమేయం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం ప్రేమతో ప్రతి జీవికి ప్రమోదం || ప్రణామం ||

ప్రేమను పంచేందుకే ప్రతి రూపాన్ని ఇచ్చారు
ప్రేమను చూపేందుకే ప్రతి భావాన్ని నింపారు
ప్రేమను ఇచ్చేందుకే ప్రతి బంధాన్ని కలిపారు
ప్రేమను కలిపేందుకు ప్రతి ధర్మాన్ని తెలిపారు

ప్రేమతో జీవించేందుకు జగమంతా స్వేచ్ఛను చాటారు || ప్రణామం ||

ప్రేమించే తత్వమే ప్రకృతిలో మొలిచింది
ప్రేమించే స్వభావమే ప్రకృతిలో వెలిసింది
ప్రేమించే విధానమే పకృతిలో నిలిచింది
ప్రేమించే ధర్మమే ప్రకృతిలో నాటుకుంది

ప్రేమించే గుణగణాలే ప్రకృతిని రక్షించే స్వభావ తత్వాలు || ప్రణామం ||

Monday, August 15, 2016

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే
దేశంలో ప్రతి జీవికి ప్రశాంతమైన స్వేచ్ఛను కలిగించేను
దేశానికి ప్రతి దేశం గౌరవంతమైన గుర్తింపులెన్నో ఇచ్చేను
దేశంతో ప్రతి దేశం స్నేహాన్ని సమకూర్చేను ఎందరికోసమో
దేశానికి శాంతియుత భావాలు అవసరమయ్యేను ఎప్పటికైనా
దేశం విదేశానికి విశ్వమే రక్షణ ఇచ్చేను శాంతంగా ఉన్నప్పుడే
దేశం ఒక విజ్ఞాన ప్రగతిగా మార్గదర్శకమయ్యేను ఎన్నో దేశాలకు

Friday, August 5, 2016

పూజకు వేళాయేను ప్రార్ధన మొదలయ్యేను

పూజకు వేళాయేను ప్రార్థన మొదలయ్యేను
సూర్యోదయముతో మేధస్సే ఉత్తేజమయ్యేను   || పూజకు ||

పుష్పాలన్నీ వికసించేను నా కోసమే
సుమ గంధాలన్నీ వీచేను నా కోసమే
మెరిసే సువర్ణాలన్నీ వెలిగేను నా కోసమే
సువర్ణ కాంతుల వెన్నెల వేచేను నా కోసమే  || పూజకు ||

ప్రతి జీవిలో భావన కలిగేను నా కోసమే
ప్రతి అణువులో తత్వం దాగేను నా కోసమే
ప్రతి ఆత్మలో జీవమే నిండేను నా కోసమే
ప్రతి రూపంలో స్పందన ఒదిగేను నా కోసమే  || పూజకు ||