Showing posts with label ప్రాణం. Show all posts
Showing posts with label ప్రాణం. Show all posts

Monday, August 14, 2017

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస
తెలియని తొలి ఉచ్చ్వాస తెలుపని తొలి నిచ్ఛ్వాస
తరతరాలుగా సాగే జీవ భావ దేహ ధ్యాన మంత్రమే   || ఏమిటో ||

వేదమై వచ్చిందో విజ్ఞానమై సాగిందో మర్మమై దాగినది మేధస్సులో
గానమై పలికిందో స్వరమై పిలిచిందో భావమై వచ్చినది దేహములో

ఉచ్చ్వాసగా సాగినా నిచ్చ్వాసగా నిలిపినా శ్వాసగా సాగుతున్నది ప్రతి జీవిలో
ఊపిరిగా ఉంటున్నా స్వధ్యాసగా వస్తున్నా శ్వాసగా ఆడుతున్నది ప్రతి జీవిలో  || ఏమిటో ||

భావమై వచ్చిందో స్వభావమై నిలిచిందో మంత్రమై స్మరిస్తున్నది దేహములో
జీవమై వెలసిందో దైవమై ఒదిగిందో తంత్రమై విస్మరిస్తున్నది హృదయములో

ప్రాణంగా ఎదిగినా కాలంతో ఒదిగినా శ్వాసగా జీవిస్తున్నది ప్రతి అణువులో
ప్రాయంగా సాగినా సమయంతో వచ్చినా శ్వాసగా వరిస్తున్నది ప్రతి అణువులో  || ఏమిటో || 

Friday, June 16, 2017

విశ్వమే శ్వాసగా జగమే జీవముగా

విశ్వమే శ్వాసగా జగమే జీవముగా
ప్రకృతియే ప్రాణంగా ధరణియే ధ్యాసగా
దైవమే దేహంగా ప్రదేశమే పరమాత్మగా
కాలం బ్రంహాండాన్నే సాగించును బాధ్యతగా  || విశ్వమే ||

విశ్వమే శ్వాసతో భావమై జగమే జీవంతో తత్వమై
ప్రకృతియే ప్రాణంతో లీనమై ధరణియే ధ్యాసతో దివ్యమై
దైవమే దేహంతో ఏకమై ప్రదేశమే పరమాత్మతో పరిచయమై
కాలమే బ్రంహాండంతో బంధమై బాధ్యతగా సాగుతున్నది వరమై   || విశ్వమే ||

విశ్వమే మన శ్వాస భావమే మన ధ్యాస జగమే మన ప్రయాసం
ప్రకృతియే మన ప్రాణం ధరణియే మన ఆధారం జీవమే మన లోకం
దైవమే మన దేహం ప్రదేశమే మన రూపం పరమాత్మమే మన ప్రతిబింబం
కాలమే మన గమనం బ్రంహాండమే మన భువనం బాధ్యతయే మన కార్యం   || విశ్వమే || 

Thursday, May 4, 2017

శ్వాసతో జీవమై హృదయంతో ఊపిరివై రూప దేహాన్ని కాలంతో సాగిస్తున్నావా

శ్వాసతో జీవమై హృదయంతో ఊపిరివై రూప దేహాన్ని కాలంతో సాగిస్తున్నావా
ఉచ్చ్వాసతో ఉదయిస్తూ నిచ్చ్వాసతో అస్తమిస్తూ విశ్వ జగతిలా జీవిస్తున్నావా  || శ్వాసతో ||

ప్రతి జీవిలో శ్వాసగా జీవమై ఊపిరితో జీవిస్తున్నావా
ప్రతి జీవిలో ధ్యాసగా జీవమై భావంతో సాగుతున్నావా

భావాలతో సాగే దేహాలను వేద తత్వాలతో సాగిస్తున్నావా
బంధాలతో సాగే రూపాలను అనురాగాలతో నడిపిస్తున్నావా  || శ్వాసతో ||

ప్రతి జీవికి ప్రాణం శ్వాసేనని దేహానికి హృదయం అతికించావా
ప్రతి జీవికి ఆహారం ధ్యాసేనని రూపానికి ఉదరాన్ని చేర్పించావా

శ్వాసలోనే ఉన్నస్పర్శా భావాల దేహ చలనముకై మేధస్సును చేర్చావా  
ఊపిరిలోనే ఉన్న భావ స్వభావాల తత్వాలకై ఆలోచనలనే కల్పించావా  || శ్వాసతో || 

Monday, November 7, 2016

నీవు నడిచిన పాదం ఎవరి పాదం నీవు వెళ్ళిన దేహం ఎవరి దేహం

నీవు నడిచిన పాదం ఎవరి పాదం  నీవు వెళ్ళిన దేహం ఎవరి దేహం
నీవు తాకిన పాదం ఎవరి పాదం నీవు ధరించిన దేహం ఎవరి దేహం

లోకాలకే ఈ పాదం జీవ పాదం ఈ దేహం దైవ దేహం
జగతికే ఈ పాదం విశ్వ పాదం ఈ దేహం శాంతి దేహం

సర్వ లోక నాద పాదం సర్వ జ్ఞాన వేద పాదం
సర్వ పాద పుణ్య స్థానం సర్వ వేద పుణ్య భావం                || నీవు నడిచిన ||

బ్రంహయే మెచ్చిన దివ్య పాదం విష్ణువే తలచిన నాభి పాదం
శివుడే దర్శించిన దైవ పాదం సాయియే కరుణించిన కాల పాదం
కాల జ్ఞాన పూర్వ పాదం కాల విజ్ఞాన అపూర్వ పాదం భక్త పాదం
త్రిమూర్తులకు త్రిగుణ పాదం త్రికోటి జనులకు జన్మ పాదం

నటరాజుని  నాట్య పాదం నలుగురిలో స్నేహ పాదం
శ్లోకాలకే శుభ పాదం వర్ణాలకే సువర్ణ పాదం నంది పాదం

ఎవరి పలుకులకైనా హంస పాదం ఎవరి పిలుపులకైనా రాగ పాదం
ఎవరి ప్రాణానికైనా ప్రాణం పాదం ఎవరి ఊపిరికైనా ఊపిరి దేహం

పాదమే నిలిపిన దేహం అనూహ్యమైన స్నేహ బంధం
పాదమే కదిపిన దేహం అమోఘమైన ప్రేమ బంధం         || నీవు నడిచిన ||

యుగాలే గడిచిన యోగ పాదం శతాబ్దాలే తరిలిన తీర పాదం
వర్షాలకే తడిచిన వర పాదం గాలికే చలించిన స్పర్శ పాదం
నదులే ప్రవహించిన క్షీర పాదం సముద్రాలే ఉప్పొంగిన అలల పాదం
ప్రపంచానికే ప్రాణ పాదం ప్రకృతికే పరమ పాదం ఆత్మకే మహా పాదం

పరమాత్ముడే సృష్టించిన ధర్మ పాదం పరంధామయే పూజించిన సత్య పాదం
అంతర్యామి అధిరోహించిన అనంత పాదం అవధూత సాగించిన అమర పాదం

ధ్యానులకే ధ్యాన పాదం చరిత్రకే చరణ పాదం
పరలోక పవిత్ర పాదం ఇహలోక ఇంద్ర పాదం

స్వయంభువ ప్రకాష పాదం స్వయంకృప సూర్య పాదం
విజయానికే దీక్ష పాదం మరణంతో మహా మోక్ష పాదం

దేహమే మోపిన అడుగు పాదం అనుబంధమైన గుణం
దేహమే నిలిచిన ఇరు పాదం అమరమైన జీవ తత్వం     || నీవు నడిచిన || 

Wednesday, October 19, 2016

ప్రేమా ప్రేమా చెప్పమా నీవైనా ఉన్నావని

ప్రేమా ప్రేమా చెప్పమా నీవైనా ఉన్నావని
ప్రేమా ప్రేమా చెప్పమా నీవైనా ఉంటావని
ప్రేమిస్తూనే ఉంటానమ్మా నీవైనా ఉండాలని  || ప్రేమా ||

ప్రేమైనా సాగాలి లోకంతోనే ఉండిపోవాలి
ప్రేమైనా కలగాలి జగమంతా వ్యాపించాలి
ప్రేమైనా ఎదగాలి విశ్వమంతా సాగిపోవాలి
ప్రేమైనా నిలవాలి సృష్టితోనే జీవించాలి

ప్రేమే మన భావం ప్రేమే మన లోకం
ప్రేమే మన తత్వం ప్రేమే మన జీవం
ప్రేమే మన వేదం ప్రేమే మన గానం
ప్రేమే మన దైవం ప్రేమే మన సత్యం
ప్రేమే మన స్నేహం ప్రేమే మన ప్రాణం  || ప్రేమా ||

ప్రేమే ఒక రూపమై జన్మించేను ప్రతి జీవిలో
ప్రేమే ఒక జీవమై ఉద్భవించేను ప్రతి శ్వాసలో
ప్రేమే ఒక దేహమై ఉదయించేను ప్రతి అణువులో
ప్రేమే ఒక జీవన నాదమై కలిగేను ప్రతి స్వర శృతిలో

ప్రేమే మనలో ఉన్న మహా భావం
ప్రేమే మనలో కలిగే మహా తత్వం
ప్రేమే మనలో ఒదిగే మహా జీవం
ప్రేమే మనలో నిండిన మహా దైవం
ప్రేమే మనలో వచ్చే మహా స్వభావం  || ప్రేమా ||

ప్రేమం ప్రియం సంగీతం సంతోషం

ప్రేమం ప్రియం సంగీతం సంతోషం
ప్రాణం ప్రయాణం జీవితం ఉల్లాసం
ప్రాయం వసంతం జీవనం ఉత్తేజం  || ప్రేమం ||

ప్రేమతో సాగే ప్రయాణమే మన లోకం
ప్రాణంతో కలిగే శ్వాసే మన గమనం
ప్రాయంతో వెలిగే మన ధ్యాసే జీవితం
కాలంతో సాగే మన సంతోషమే ఆనందం

భావం ఓ జీవిత గీతం
తత్వం ఓ జీవన రాగం
వేదం ఓ శరీర స్వరం
గుణం ఓ ఆకార నాదం  || ప్రేమం ||

ప్రేమించే ప్రాణమే ప్రయాణిస్తూ చేరుతున్నది
ప్రాణంతో ప్రాయమే చిగురిస్తూ సాగిపోతున్నది
ప్రాయంతో పద్మమే వికసిస్తూ ఎదుగుతున్నది

భావంతో బంధాలెన్నో ప్రేమంగా సాగుతున్నాయి
వేదంతో గుణాలెన్నో ప్రాణంగా వచ్చేస్తున్నాయి
స్నేహంతో పరిచయాలెన్నో శాంతంగా కలుస్తున్నాయి  || ప్రేమం ||   

ఓ కృష్ణా నీవే పరమాత్మవా

ఓ కృష్ణా నీవే పరమాత్మవా
ఓ బ్రంహా నీవే పరంధామవా
ఓ మహేశ్వరా నీవే పరంజ్యోతివా
పర లోకాలకు మీరే పరస్పర బంధువులా  || ఓ కృష్ణా ||

ప్రతి జీవికి ఒక తత్వాన్ని కలిగించే పరమాత్మవు నీవేలే
ప్రతి జీవికి ఒక భావాన్ని కలిగించే పరంధామవు నీవేలే
ప్రతి జీవికి ఒక గుణాన్ని కలిగించే పరంజ్యోతివి నీవేలే

పర తత్వాలతో మా జీవితం సాగుతున్నది ప్రయాసగా
పర భావాలతో మా జీవనం జరుగుతున్నది భారముగా
పర స్వభావాలతో మా కాలం ప్రయాణిస్తున్నది వేదనగా  || ఓ కృష్ణా ||

నిజంగా నీవే ఉంటే సత్యం తెలిసేను మనకు
నీడగా నీవే ఉంటే స్నేహమే తెలిపేను మనకు
ప్రాణంగా నీవే ఉంటే ప్రేమే తెలియును మనకు

ఏ శ్వాసలో ఉన్నావో ఏ ధ్యాసతో ఉన్నావో తెలిసేదెలా
ఏ జీవిలో ఉన్నావో ఏ దేహంతో ఉన్నావో కనిపించేదెలా
ఏ రూపంలో ఉన్నావో ఏ దైవంతో ఉన్నావో గ్రహించేదెలా  || ఓ కృష్ణా || 

Tuesday, October 11, 2016

ప్రాణం ఉన్నంతవరకే విజయం

ప్రాణం ఉన్నంతవరకే విజయం
జీవం ఉన్నంతలోనే జీవితం
శ్వాస ఉన్నంతలోనే జీవనం
ఊపిరి ఆగేంతవరకే ప్రయాణం
నీవు నేను ఉన్నంతవరకే పరిచయం  || ప్రాణం ||

పరిచయాలతోనే నేస్తం చేసుకుంటేనే బంధం
బంధాలతోనే జీవితం చూసుకుంటూనే ప్రయాణం
ప్రయాణంతోనే జీవనం చెప్పుకుంటూనే అనుభవం
అనుభవాలతో అనురాగం చూపుకుంటూనే విజయం  || ప్రాణం ||

పరిచయాలే పలుకుల కాల గమనం
బంధాలే జీవితాల కార్యక్రమాల గమకం
ప్రయాణమే జీవన విధానాల తరుణం
అనుభవాలే మన ప్రగతి విజయాల చరణం  || ప్రాణం || 

అమ్మ అంటే హృదయం అందించునే ప్రేమామృతం

అమ్మ అంటే హృదయం అందించునే ప్రేమామృతం
శ్వాస అంటే ప్రాణం కలిగించునే మన తల్లి హృదయం || అమ్మ ||

ఎన్నో తరాల బందుత్వాన్నే సాగించును మన అమ్మే
ఎన్నో యుగాల అనుబంధాన్నే తెలిపేను మన అమ్మే

ఏదో తెలియని జీవితం నడిపించేను మన కోసం
ఏది లేని జీవనం సహనంతో సాగించేను మన కోసం

ఎక్కడికో ఎప్పటి వరకో తెలియని ప్రయాణం తపనంతో సాగే తన ప్రాణం
ఎందుకో ఎవరి కొరకో తెలియని కాల ప్రభావం సాహసంతో వెళ్ళే తన జీవం || అమ్మ ||

మన కోసమే జీవిస్తుంది మన కోసమే ఎదురు చూస్తుంది
మనతోనే ఉంటుంది మనందరి కోసమే శ్రమిస్తుంటుంది

మనమే తమకు లోకం ఏ ఐశ్వర్యం భోగ భాగ్యాలు వద్దనుకుంది
మనమే తన ప్రపంచం ఏ ఆశలు అతిశయాలు అనవసరమంది

మనం పలికించే మాటలతోనే జీవితాన్ని నింపుకుంటుంది
మనం తెలిపే అనుభవాలతోనే జీవనాన్ని అల్లుకుంటుంది || అమ్మ || 

Wednesday, July 20, 2016

భావనే నిలిచిపోయేనా రోగమే వదిలిపోయేనా

భావనే నిలిచిపోయేనా రోగమే వదిలిపోయేనా
కాలమే మార్గాన్ని చూపి ఆరోగ్యాన్నే అందించేనా  || భావనే ||

రోగంతో చెలగాటం నిరంతరం పోరాటం
ఆరోగ్యంతో సహవాసం నిత్యం సంక్షోభం

అవకాశమే జీవితం విజ్ఞానమే ప్రయత్నం
సమయమే ఔషధం సమయోచితమే వైద్యం  || భావనే ||

ప్రకృతిలో ఆరోగ్య ప్రాణం ఆనందకర జీవితం
జగతిలో వేదాంత విజ్ఞానం నయగార అనుభవం

నిరాశే లేకుండ కార్య సాధనలో దశబ్దాల సహనం
విజయమే తెలియని ధీక్షలో శతాబ్దాల సహచరం  || భావనే || 

Wednesday, July 13, 2016

నా తల్లికి నేనే హృదయం

నా తల్లికి నేనే హృదయం
నా తల్లికి నేనే నేత్రం
నా తల్లికి నేనే రూపం
నా తల్లికి నేనే ఆకారం   || నా తల్లికి ||

నాలోని శ్వాసే తన జీవం
నాలోని ధ్యాసే తన భావం
నాలోని మనస్సే తన మమకారం
నాలోని ఉచ్చ్వాస నిచ్చ్వాసాలే తనకు ప్రాణం

నాలోని ఆత్మకు నీవే ప్రతి రూపం
నీలోని మహాత్మకు నీవే మహా దైవం

నీవే నాలో దాగిన విశ్వం
నీవే నాలో నిండిన లోకం
నీవే నాలో వెలసిన జగతి
నీవే నాలో విరిసిన ప్రకృతి    || నా తల్లికి ||


నా ఊపిరిలో నీవే ఉత్సాహం
నా ఉష్ణములో నీవే ఉత్తేజం
నా దేహములో నీవే స్పందనం

నాలో ఉన్న బంధమే నీ అనుబంధం
నాలో ఉన్న మమతే నీ అనురాగం

నేను నడచిన మార్గమే నీ ప్రయాణం
నేను నిలిచిన స్థానమే నీ గమ్యం
నేను కొలిచిన వేదమే నీ విజ్ఞానం
నేను తలచిన గౌరవమే నీ సత్కారం   || నా తల్లికి || 

Tuesday, May 3, 2016

జీవా! నీవు ఉన్నంత వరకే దేహం దగ దగమంటూ మండుతుంది

జీవా! నీవు ఉన్నంత వరకే దేహం దగ దగమంటూ మండుతుంది
జీవం ఉన్నంత వరకే ఆత్మ తహ తహలాడుతూ తపిస్తుంది
శ్వాస ఉన్నంత వరకే శరీరం చర చరమంటూ కాలిపోతుంది
ఊపిరి ఉన్నంత వరకే ఉచ్చ్వాస నిచ్చ్వాసతో సాగిపోతుంది
ప్రాణం ఉన్నంత వరకే ప్రేమ కలాపాలు కట కటమంటూ సాగుతాయి