Showing posts with label సౌభాగ్యవతి. Show all posts
Showing posts with label సౌభాగ్యవతి. Show all posts

Monday, July 25, 2016

శ్రీరస్తు శుభమస్తు శతమానం భవితే కళ్యాణమస్తు

శ్రీరస్తు శుభమస్తు శతమానం భవితే కళ్యాణమస్తు
శతాయుస్సు తో మంగళ సూత్రం దీర్ఘాఆయుస్సు  || శ్రీరస్తు ||

జత కలిసే అమ్మాయి అబ్బాయి ఒకటయ్యే శుభమస్తు
మనస్సులు కలిసిపోయేలా జీవించే తరుణమే శ్రీరస్తు

శతమానం సగర్వమై జగతికి ఒకటై నిలిచే ఏడు అడుగుల బంధం
భవిష్య భవితకు సకాలమై విశ్వానికి విజ్ఞాన జీవనమయ్యే జీవితం

తాళి కట్టు శుభవేళ మంగళ సూత్రంతో సాగే కళ్యాణ వైభోగ శోభనమస్తు
పసుపు కుంకుమల అక్షింతలతో సౌభాగ్యవతిగా దీవించే ముహూర్తమస్తు  || శ్రీరస్తు ||

కన్నులతో కలిసే మంగళం సూత్రంతో సాగే మహా జీవనం
ఆయుస్సును పెంచే ఆనందం అర్థంతో కలిగే సుఖ సంతోషం

సూర్యోదయం నవ దంపతుల జీవితానికి పెళ్ళి తర్వాత సాగే మహా గొప్ప ఆరంభం
ఆకాశ తారా నేత్రం అరుంధతి నక్షత్రం నవ వధువులకు గొప్ప సూచన ప్రారంభం

జీవితంలో ఒక మహా మధుర సమయం కనివిని ఎరుగని సంస్కృతి కళ్యాణం
వధూవరుల జీవన  ప్రయాణం కొత్తగా సాగించే నవ భావాల సంసార జీవితం  || శ్రీరస్తు ||