Showing posts with label చైతన్యం. Show all posts
Showing posts with label చైతన్యం. Show all posts

Wednesday, May 3, 2017

ఏది నీ దేశం ఏది మన దేశం

ఏది నీ దేశం ఏది మన దేశం
ఏది మన భావం ఏది మన తత్వం
మనలోనే విశ్వ గీతం మనలోనే జగతి పతాకం
మనమే చైతన్యం మనమే ఐక్యత చిహ్నం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

మనిషిగా జీవించు మనస్సుతో జగతినే నడిపించు
మహర్షిగా దీవించు మనస్సుతో విశ్వాన్నే సాగించు

మనలోనే మాధవుడు మనలోనే మహాత్ముడు ఉదయిస్తున్నాడు
మనలోనే పరమాత్మ మనలోనే పరంధామ ఎదుగుతున్నాడు ఓ మానవా!  || ఏది నీ దేశం ||

దేశ దేశాలు తిరిగినా ప్రపంచమంతా విజ్ఞాన అన్వేషణయే
ఎన్ని రోజులు గడిచినా విశ్వమంతా విజ్ఞాన పరిశోధనయే

మనిషిలోనే సద్భావం మనలోనే మానవత్వం
మనిషిలోనే విజ్ఞానం మనలోనే పరిశుద్ధాత్మం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

Friday, September 16, 2016

పరిచయం చేసుకో స్నేహమే తెలుసుకో

పరిచయం చేసుకో స్నేహమే తెలుసుకో
స్నేహమే బంధాలై సంబంధాలుగా మారిపోవునే
బంధాలతో కొత్త పరిచయాల స్నేహం పెరిగిపోవునే  || పరిచయం ||

కుటుంబాల బంధాలలో స్నేహమే జీవమై జీవించునే
సంబంధాల స్నేహాలతో కొత్త జీవితాలు పరిచయమవునే

స్నేహంలో స్వార్థం లేనట్లు సహాయాన్ని తిరిగి పంచేసుకో
స్నేహమే అనర్థం కానట్లు స్వార్థాన్ని వదిలి అర్థం చేసుకో
అందరితో కలిసిపోయి పరమార్థాన్నే సహాయంతో చాటుకో  || పరిచయం ||

స్నేహంతో జీవితం ఆనందమై సాగిపోతూ మాటలతో కాలం హాయిగా గడిచిపోవునే
కార్యాలెన్నో ఒకరికి ఒకరై సులువుగా చేసుకుంటే సమస్యలే లేనట్లుగా తీరిపోవునే

మనలో మనకు మనస్పర్ధాలు వద్దని హెచ్చు తగ్గులు చూసుకోవద్దు
మనలో మనకు మహా చైతన్యం ఉందని గొప్పలు అతిగా చెప్పుకోవద్దు
మనలో మనకు కష్టాలైనా నష్టాలైనా దుఃఖాలైనా పదే పదే తలుచుకోవద్దు

మనలో మనమే స్నేహమై బంధాలుగా పరిచయాల పలకరింపులతో సాగేదమా || పరిచయం || 

Wednesday, September 14, 2016

స్వాతంత్య్రం వచ్చిందా స్వరాజ్యం ఇచ్చిందా

స్వాతంత్య్రం వచ్చిందా స్వరాజ్యం ఇచ్చిందా
సామ్రాజ్యం ఏర్పడిందా సంతోషం కలిగిందా
సమరం ఆగిందా సత్యం ధర్మం నడిచిందా
శతాబ్దాల పరిపాలన ప్రభుత్వం మారిపోయిందా  || స్వాతంత్య్రం ||

జయమే మనదై దేశమే సగర్వమై నిలిచిందా
ధైర్యమే గర్వించేలా మన దేహమే పోరాడిందా
రణ రంగం ముగిసేలా ఆక్రమణ ఆగిపోయిందా
శత్రుత్వం నశించేలా మిత్ర భావం కలిసిందా

హితమేదో తెలిసిందా స్థానిక బలమెంతో గుర్తించిందా || స్వాతంత్య్రం ||

ఎవరికి వారు స్వేఛ్ఛా జీవితాన్ని ఆరంభించారా
ఎవరికి ఎవరో మనకు బంధాన్ని కలిగించారా
ఎవరున్నా లేకున్నా మన జీవనాన్ని సాగించారా
ఎవరో వచ్చి పోయినా మన కుటుంబాన్నే మిగిలించారా

మనదే దేశం మనదే లోకం మనమే ముందుకు సాగేదం
మనలో చైతన్యం మనమే సమూహం మనతోనే సాహసం || స్వాతంత్య్రం ||