Friday, April 30, 2010

ఎవరికి ఏదో ముందే

ఎవరికి ఏదో ముందే వ్రాసిపెడితో ప్రయత్నించే వారెందుకో
కొన్ని రకాలుగా అజ్ఞానమే మరో రకంగా విజ్ఞాన పోరాటమే
ఉన్నవాడికి నిరుత్సాహం కలిగినా పేదవాడికి నష్టం కలిగించవద్దు
లాభాలకై మంచిదారులెన్నో కృషించే వారికి మంచి లాభాలే
ప్రయత్నించుటలో అజ్ఞాన్ని కూడా విజ్ఞానంగా మారవచ్చేమో
ఏదీ తెలియని వాడు కూడా ప్రయత్నిస్తే కొన్నింటిలో ఒక్కటైనా
ఒక్కటి కోసం ఎన్నింటినో నేర్చుకోవటమే ప్రయత్నం పట్టుదల
ఒకరి కోసం ఎదురు చూడు ఇంకొకరి కోసం తీసి పెట్టవద్దు
సమర్ధవంతుడే కావాలనుకుంటే వారే నిర్ణయించుకుంటారు

రాబోయే ప్రళయాలకు

రాబోయే ప్రళయాలకు మన వాళ్ళను వదిలి పెట్టి పోతున్నామే
ప్రళయాలలో వారు పడే ఇబ్బందులకు మనకు సంబంధం లేదా
మనం జీవించి వెళ్లాం ఇక వారే ఎలాంటి ఇబ్భందులైనా మరణమైనా
ఆకలి చావులకు చీకటి భయాలకు ఎన్నో రోజులైనా చిన్నా పెద్దలైనా
మనం వెళ్ళిపోయాం హాయిగా వారు వెళ్ళిపోతారు దిక్కు లేక
కాళ్ళు చేతులు లేకున్నా వారి భాద వారిదే మనం స్వర్గస్తులైనాం
వారి భాధలు ఏడ్పులు మనం వినకూడదు చూడరాదు మనకు తెలియదు
వారెవరో మనమెవరిమో ఆత్మజ్ఞానంతో మనం : సరైన జ్ఞానం లేక వారు
మనం ధ్యానించి వచ్చాం వారు ఇంకా జీవిస్తూనే ఉన్నారు ఎందుకో
జనాభా తగ్గే వరకు ప్రళయాలకు మంచి సమయమే వికృతాలకై
ప్రతి మనిషి యోగిగా మారేంత వరకు ఏ ప్రళాయాన్ని ఎవరు ఆపలేరు

అక్షరం తెలియక ముందే

అక్షరం తెలియక ముందే శిలలో శిల్పాలు చెక్కుతున్న ఆ యోగి అక్షర నామం ఎక్కడ -
సూదిలో దారాన్ని ఎక్కించినట్లు శిల్పాలలో సూత్రాన్ని చూపించగల అతని తత్వం ఏది -
రాతిలో రత్న భావాలను దాచగలమని ఎన్ని భావాలను తెలుపుతున్నాడో గోపురాలుగా -
చెక్కిన చేతులు చెక్కు చెదిరినా శిల్పాలలో ఏ ముక్కు పోకుండా ఆలయాలే చెక్కినాడే -
చెక్కిన శిల్పాలు చిత్రమే కాక ఆలయాలుగా అమర్చిన అతని రాతి మనస్సు విగ్రహమైనదా -

యోగి కాని యోగి

యోగి కాని యోగి అమర శిల్పి ఆనాటి శిలలో ఎక్కడ దాగి ఉన్నాడు
అతని రూపం ఏది బహు చక్కని రూపమా చూడలేని విచిత్ర రూపమా
చెయ్యి మాత్రమే చరిత్రకు చూడ చక్కని చిత్ర రూపాల అనంత భావమా
అక్షరమే లేని అమర శిల్పి రూపము చిత్రములో నేత్ర ముగ్ధుడై ఉన్నాడే

తెలుసుకోలేని జీవితం

తెలుసుకోలేని జీవితం తెలియకపోతే ఏనాటికి తెలియనివిధంగానే
తెలియకపోయినా తెలుసుకోలేని స్థితిలో ఉన్నా జీవించడం తెలియకపోతే
జీవితం ఎటు వెళ్ళిపోతుందో జీవించుటలో ఏదీ తెలియనివిధంగానే
తెలియని జీవితం విజ్ఞానం లేని మేధస్సు తెలుసుకోలేకపోతే ఆలోచన కలగలేదా

విశ్వం విజ్ఞానముకేనని

విశ్వం విజ్ఞానముకేనని మేధస్సులో ఒక ఆలోచన నీకు తెలుపలేదా
గ్రహించని ఆలోచన మేధస్సున ఎన్నాళ్ళుగా తెలుసుకోలేనంతగా
మరణం సంభవించేటప్పుడు గ్రహించినా సూక్ష్మమైనా తెలుసుకోగలవా
అనంత విశ్వ విజ్ఞానములో నీ మేధస్సున ఏ మర్మ రహస్యము లేదే

Tuesday, April 27, 2010

పక్షిలా ఎగురలేకున్నా

పక్షిలా ఎగురలేకున్నా నా భావం దానితో ఎగురుతూనే
చేపలా ఈదలేకున్నా నా భావం దానితో స్నేహంగా ఈదుతూ
సింహంలా జీవించలేకున్నా నా భావం ఎప్పుడూ దానితోనే
ఏ జీవి లక్షణం ఎలా ఉన్నా నా భావాలు ఎప్పుడూ వాటితోనే

Sunday, April 25, 2010

గాలిలో ఎన్నో గాలులు

గాలిలో ఎన్నో గాలులు ఉన్నాయని మంత్రాలు చెబుతున్నాయా
మనలోని శ్వాసే గాలి ఐనా ప్రాణ వాయువుగా మరో గాలి అవసరమే
మరో గాలి లానే ఎన్నో గాలులు విశ్వమున ఉన్నాయని తెలుసులే
ఏ గాలి ఐనా మనకు ప్రాణ వాయువుగా సహకరిస్తుందనే నేను
నివసించే ప్రాంతాన్ని బట్టి గాలులలో తేడాలు ఉంటాయనేగా
చెట్ల దగ్గర వేచే గాలి ఆ చెట్ల స్వభావాన్ని తెలుపుతుంది కదా
వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా గాలులు వీస్తుంటాయిలే
ప్రాంతాలు మురికిగా అశుభ్రతతో ఉంటే చెడు వాసనలతో వీస్తుంటాయి
దుమ్ము చెత్తను లేపే విధంగా కూడా గాలులు వీస్తుంటాయి
ఇలాంటి గాలులే కాక మనిషికి హాని కలిగేంచే గాలులు కూడా ఉంటాయా
మనిషి పరివర్తనలో మార్పు కలిగించే గాలులు ఎన్నో ఉన్నాయా
మనిషిని పీడించే గాలులు ఆత్మతో ఆడుకునేలా ఉంటాయా
మనిషికి మతి పోయేలా పిచ్చి కలిగించే గాలులు కూడా ఉంటాయా
ఏ వైద్యులు నయం చేయలేనంతగా వివిధ రకాల గాలులు ఉంటాయా
ఏ ఆలయాలను మసీదులను దర్శించినా నయంకాని విధంగా ఉంటాయా
మంత్రాలతోనే గాలులను వదిలించేలా ఉంటాయని తెలుస్తున్నాయా
మనిషిలోని శ్వాసనే భ్రమ పెట్టె గాలులు ఉంటాయని తెలుస్తున్నదా
మరోధ్యాసను కలిగించే పిచ్చి గాలులు కూడా ఉంటాయా ఆలోచించండి
కొన్ని సంవత్సరాలుగా పీడించే గాలులు కూడా ఉంటాయా
ఆర్థికంగా అనారోగ్యంగా ప్రాణాలను తోడేసే గాలులు కూడా ఉంటాయే
మనిషి జీవితాలను శక్తి సామర్థ్యాలను మార్చే గాలులు కూడా ఉంటాయేమో
గాలిలో విచిత్ర గాలులు ఎన్ని రకాలుగా ఉంటాయో అర్థం కాదే
మనిషికి మేలు చేసే గాలులు కూడా ఎన్నో ఉంటాయని మరవకండి
ఏ గాలైనా మనలోని గాలియే ముక్తికి దారి అని ధ్యానమున విశ్వాసం
అన్ని దుష్ట గాలులను వదిలించేలా మనమంతా ధ్యానం చేద్దాం
శ్వాస మీద ధ్యాస - ధ్యాసే ధ్యానం - ధ్యానమే ఆత్మజ్ఞానం - ఆధ్యాత్మకం

విజ్ఞాన భావాలకన్నా

విజ్ఞాన భావాలకన్నా అజ్ఞాన భావాలు శరీరత్వాన్ని త్వరగా చలింపజేస్తాయి
విజ్ఞాన భావాలకు దీర్ఘ కాల సాధన విధేయత వివేకం అనుభవం కావాలి
అజ్ఞాన భావాలకు ఏదారి లేదు ఏ సమయమో ఏమనో తెలియదు
విజ్ఞాన భావాలు కొందరికే అజ్ఞాన భావాలు ఎందరికో ఎన్నో విధాల
అజ్ఞాన భావాలను కూడా విజ్ఞాన భావాలుగా మార్చుకున్న వాడే తత్వవేత్త
విజ్ఞానికి కూడా కాల పరిస్థితులలో అజ్ఞాన భావాలు కలిగి జీవితం అధోగతి
జీవిత కాలమంతా విజ్ఞానిగా ఉండడం ఒక విశిష్టత విధేయత సంస్కారమే
జీవితంలో ఏ భావము కలిగినా ఆలోచనగా కొన్ని క్షణాలు ఆలోచించే సాగాలి
ఆలోచించే విధానం ఎప్పటికి విజ్ఞానంగానే ఉండాలి క్షణమైనా యుగాలైనా
మనస్సులో కలిగింది మాయ మేధస్సులో కలిగింది మర్మం విజ్ఞానమే జీవితం

ఏ అనుభవాన్ని తెలపాలి

ఏ అనుభవాన్ని తెలపాలి ఎవరికి ఏ విజ్ఞానం కావాలి
ఏ విజ్ఞాన అనుభవమైనా భావనగా తెలుపగలను
భావనగా తెలుపుటలో విశ్వ విజ్ఞానమే నా మేధస్సున
మీ ఆలోచన భావాలతో విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకోండి

ఏనాడో భావం చెందితే

ఏనాడో భావం చెందితే ఈనాడు నిజమైనదా
నిజానికి ఆ భావం ఆనాడు సరైనదేనా
అనుభవానికి తెలియుటకు సరైనదేమో
భావాలు కూడా విజ్ఞానానికి సరేనని నేను

ఆనాటి విజ్ఞానం మేధస్సులోనేనా

ఆనాటి విజ్ఞానం మేధస్సులోనేనా చేతలతో సాధించేది లేదా
ఎందరినో ఆదుకొనే విజ్ఞాన సహాయం శరీరనానికి చలనం కలిగించదా
ఎన్నో రకాలుగా వెనుక బడిన వారే అజ్ఞాన అవస్థల సమస్యలతోనే
విజ్ఞానం ఉన్నా పేదరికానికి గీత గీసినట్లు దాటలేని ఆర్ధిక వ్యవస్థ
వెనుకబడి వెనుకడుగులో అడుగులు వేసే దారిలేక అట్టడుగుననే
శక్తి ఉన్నప్పుడే యుగానికి యువశక్తిని చాటవోయ్ చరిత్రలో సాగవోయ్
శక్తి ఉన్నవాడికి వృత్తిని కలిపించు వినయం ఉన్నవాడికి విద్యను అందించు
మంచి వాడికి ఆర్ధిక సహాయం లేనివాడికి వస్త్ర దానం ఐనవాడికి సలహా నేస్తం
అధికారం అందరిలో ఇక్యమత్యంగా యువతరానికి చైతన్యమే ప్రగతి
గ్రామంలోనే మార్పు రావాలోయ్ నగరానికి వెన్నముక్క కావాలోయ్
గొప్పవారు గ్రామాన్నే తిలకించి ప్రగతి పతాకాన్ని ఎగరవేసి జేజేలు పలకాలోయ్
ముఖ్యంగా ఏ చెడు అలవాట్లు ఉండకూడదోయ్ చెడు సామాగ్రి తెలియకూడదోయ్
వచ్చేవారిలో మార్పు కలగాలోయ్ వెళ్లి పోయేలోగా మన మనిషేనోయ్
నీతి గలవాడే మన మనిషోయ్ న్యాయమే మనకు తెలుసునోయ్
విశ్వ ప్రకృతికి ఆధ్యాత్మక ధ్యానమే మన జీవిత రహస్యమని తెలుసుకోండి

Saturday, April 24, 2010

భావాలు ఆగిపోతుంటే

భావాలు ఆగిపోతుంటే దిక్కులు లేని వాడిగా నాలోనే నేనే
ఏ దిక్కు లేకపోతే నాలో ఏ భావము చేరలేక విశ్వముననే
తత్వముగా వేచి వేచి భావాలు దహనమయ్యేలా ఏదీ తోచదే
భావము లేక శరీరం చలించక ఆత్మ వెళ్ళిపోయేలా మౌనమే
భావము లేని శరీరం జీవము లేని ఆత్మ తత్వమేనని నేను

సరిగమ - సరి చేయుటలో

సరిగమ - సరి చేయుటలో గమనము
స్వరాన్ని సరి చేయుటలో గమనమైతే
సరి గమ లు సంగీతముగా అలా సాగగా
పదనిస - పదం పలుకుటలో నిశ్శబ్దమైతే
పాడుటలో పదం పలికినా నిస ధ్వని తత్వంతో
పద నిస లుగా సంగీతంతో స్వరాలుగా
స్వరంలో కలిసి సప్త స్వరాలుగా సంగీతమై
పాటలతో పల్లవి చరణాలతో సాగిపోతూనే

నీవేనని ఎన్ని రకాలుగా

నీవేనని ఎన్ని రకాలుగా తెలుపవలె
నేనేనని తెలుపుటలో నీవేనని నేను
నేను అనే భావన నీవు అనే భావనయే
నీ భావనయే నేను నేనని నేనేనని
నీవు నేనేనని భావించుటయే విజ్ఞానం

నీవే ఆనాటి నుండి

నీవే ఆనాటి నుండి నేను తెలుపునది నీవేనని
విజ్ఞానముగా ఎదుగుటలో నీవే గొప్పవాడివని
నేనే నని తెలుపుటలో నీవే నని గ్రహించవలె
నీవే నని విజ్ఞానముగా భావించుటయే అర్థము

గాలి కూడా లేని రోజులు

గాలి కూడా లేని రోజులు వస్తాయని నా మేధస్సులో మొదలైనది
ప్రాణ వాయువును కూడా కొనవలెనని ఆలోచనలు కలుగుతున్నాయి
ఎందరో చనిపోయారని మనం చనిపోతున్నామా భయం కలుగుతుంది
గాలికి దుమ్ము చెదిరినట్టు భయానికి ప్రాణాలు ఎగిరినట్టే తెలుస్తున్నది
నేటి దేశ పరిస్థితులు విధి వైపరిత్యాలతో ఎన్నో రకాలుగా మొదలైనాయి
జీవితాలను ఆధ్యాత్మకం వైపు మళ్ళించి విశ్వాన్ని ప్రశాంత పరచండి

ప్రపంచమంతా ఒకే దేశంలో

ప్రపంచమంతా ఒకే దేశంలో నివసించే రోజులు వస్తాయా కలగానైనా చూస్తారా -
ప్రళయాలు అనంతమైతే జన సంఖ్య తగ్గిపోతే మరో సృష్టికి ఒకే దేశమేనన్నట్లు -
యుగాలు చీకటయ్యేలా మరో యుగానికి ఏది ఉదయిస్తుందో ఎవరు ఉదయిస్తారో -
ఉదయించే జీవితాలు ఎప్పటికైనా అస్తమించే జీవితాలే ఎక్కడైనా ఎవరైనా ఎలాగైనా -
అధిక జనాభాతో ప్రపంచం నలుమూలల నుంచి ఒకే దేశానికి ధూళి వలె తరలి వస్తే -
అందరు ఒకే దేశంలో నివసించే పరిస్థితి అల్లకల్లోలాలతో ఎవరికి వారు దిక్కులేక -
ఏ విధంగానైనా మహా సమస్యలే భాష ఆహారం నీరు గాలి శుభ్రత అనారోగ్యం చికిత్స -
అలాగే స్థలం నీడ నిద్ర నీతి ఆలోచన జ్ఞానం సంస్కారం విధానం పవిత్రత వృత్తి ఎన్నో -
ఇతర జీవులతో కూడా భయం అలుపు విసుగు మతి ఆవేదన అర్థంకాని జీవితాలుగా -
ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో దిక్కులేని వారిగా ఎదురు చూస్తున్నట్లు తెలియని తత్వమే -
జన సంఖ్యను తగ్గించండి ఆధ్యాతమకంగా ఎవరికి వారు మహాత్మాగా ఎదగండి -
సుఖంగా ఉన్నప్పుడు ఏది అర్థం కాదు సమస్యలు వచ్చినప్పుడే మేధస్సుకు పరీక్ష -
శరీర శక్తి లేనప్పుడు కూడా మహా సమస్యలు వస్తే ఆలోచన ఉన్నా ఇన వారు బలైపోయారు -
మన వారు లేని జీవితం రక్షణ కల్పించని శక్తి విజ్ఞానం ఎందుకో ఆలోచించండి మేధస్సులో -

మాటలతో చెప్పలేను

మాటలతో చెప్పలేను మౌనంగా ఉండలేను భావనతోనే తెలుపగలను -
భావాలుగా ఎన్నో ఎన్నెన్నో విశ్వ వైపరిత్యాలను వివరించగలను -
ఏనాడు కని విని ఎరుగని రీతిలో ఎన్నో ప్రపంచం నలుమూలల సంభవిస్తున్నాయి -
ఆనాడు నేను తెలిపిన పంచభూతాలు ఏర్పడిన సృష్టి విధానంలోనే అన్నీ ఉన్నాయి -
మానవ మేధస్సులో లేని విశ్వ ప్రళయాలు నేడు సంభవిస్తున్న ప్రకృతి ప్రభావాలే -
పాతాళము నుండి ఆకాశానికి ఎగిరే అగ్ని జల వాయు ప్రళయాలు భయంకరంగానే -
జ్వాలలుగా లావాలుగా ఎన్నో అగ్ని రాళ్ళు ఆకాశానికి ఎగురుతుంటే ఆశ్చర్యమా -
పొగలు ఆకాశాన్ని కప్పినట్టు విరజిమ్ముతుంటే శిరస్సుకు సెగలు రేగేలా -
అగ్నికి మంచుయే ఇంధనంగా పాతాళమున మంటలు రేగగా ఎరుపు మితిమీరినట్లు మెరుపులతో -
ప్రాణ నష్టమో దేశ నష్టమో ప్రపంచానికి ప్రగతి లేక ఆధ్యాత్మక జీవితాన్ని తెలుసుకోలేక -
మానవ మేధస్సులో ఎంత విజ్ఞానం ఉన్నా జీవితమంతా సమస్యల తోరణంలా -
సుఖాలు అనుభవించే వారికి కూడా హటాత్తుగా కొత్త సమస్యలు తలెత్తుతాయి -
ఎన్ని సమస్యలను ఎన్ని రకాలుగా వివరించినను అర్థం చేసుకోవాలిగా -
జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు మనలో ఆత్మలు చెల్లా చెదురవుతాయి -
జన సంఖ్యను తగ్గించండి ఇదే ప్రథమ సమస్య ఎప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా -

వందలలో పదుల మేధావులున్నా

వందలలో పదుల మేధావులున్నా సరైన ప్రణాళిక లేదు
వేలలో వందల మేధావులున్నా సరైన ప్రణాళిక లేదే
లక్షలలో వేల మేధావులున్నా సరైన ప్రణాళిక లేనేలేదు
కోట్లలో లక్షల మేధావులున్నా సరైన ప్రణాళిక లేదనే
వంద కోట్లలో ఎన్ని లక్షల మేధావులున్నా సరైన ప్రణాళిక రాదనే
జన సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే సరైన ప్రణాళిక ఉండాలి
అధికారులయందే సరైన ప్రణాళిక లేకపోతే ఎన్నైనా తాత్కాళికమే
ప్రణాళికలు కూడా క్రమమైనా విధానాన్ని కలిగి ఉండాలి
నా యందు ఓ క్రమమైన ప్రణాళిక ఉందనే ప్రపంచ మార్పుకై ఎదురు చూస్తున్నా
జన సంఖ్య పెరిగే కొద్ది ప్రణాళికలు అర్థంకాని స్థితిలో మేధావులు లేరనే
విశ్వం నుండి ఆలోచించండి మేధస్సు నుండి ఆలోచించకండి

విశ్వమున నీవు

విశ్వమున నీవు నన్ను వదలి వెళ్ళకు
విశ్వముననే నేనున్నానని మరవకు
విశ్వమున మనమిద్దరమే కాలంతో
ఏనాటికి విడిపోని బంధముగా సాగుతున్నాం

మరణ భావాన్ని

మరణ భావాన్ని గాలిని అడిగి తెలుసుకోనా జీవముగా ఎలా వెల్లిపోతావని
నా తల్లి ఆత్మను అడగనా మరణ భావన ఎలా ఉంటుందో ఎలా కలుగుతుందో
నా ఆత్మనే అడగనా గత జన్మ మరణ భావన ఎలా ఒంటరిగా పొందగలిగావని
ఆత్మ తెలుపుటలో నాలో మరో భావం కలుగుతుందే గాని మరణ భావన లేదే

విశ్వ పర్యవేక్షణలో

విశ్వ పర్యవేక్షణలో ఉప గ్రహాల కక్ష్యలో అన్వేషణ మొదలైనది
విశ్వంలో ఉపగ్రహాల తీరు కక్ష్యలో ఎంతవరకు సమంజసము
గ్రహాలకు ఆటంకము కలగనంతవరకు ఉపగ్రహాలు కక్ష్యలోనే
ఆటంకము కలిగితే కక్ష్యలు తారుమారై కక్షగా ప్రమాదమే
మానవ మేధస్సు విశ్వ ప్రణాళికకు ఆటంకము కలగకూడదనే
నా భావాలు రక్షణకై విశ్వమున దివ్య కక్ష్యలో విజ్ఞాన అన్వేషణగా

Friday, April 23, 2010

శరీరత్వ భావాలను

శరీరత్వ భావాలను వీడకుండానే నిత్యానందము ఎలా కలుగునో
శరీర ఆలోచనలే వీడకపోతే భావానికి అర్థమేమో తెలుసుకోగలవా
భావము ఆత్మ తత్వమున కలిగే ఆలోచన విధానమని విజ్ఞానము
ఆత్మ తత్వములో శరీర తత్వాలు లేక సత్యాన్వేషణలో విశ్వ విధాతగా
నిత్యం ఆధ్యాత్మిక భావాలతో దివ్యత్వాన్ని కలిగిన వారే నిత్యానంద స్వరూపులు

ఆత్మ తత్వము లేకుండా

ఆత్మ తత్వము లేకుండా నిత్యానందము కలగనే కలగదు
పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న వారికే ఆత్మ తత్వము
వేదాలు మేధస్సున జీర్ణించుకున్న వారికే సత్యానందము
సత్యమున కలిగే ఆత్మ భావాలే నిత్య జీవిత విజ్ఞానందము
నిత్య విజ్ఞాన సత్య భావాలతో జీవించుటయే ఆత్మ తత్వము
ఆత్మ తత్వమున అన్వేషణగా పరమాత్మ తత్వమే నిత్యానందము
క్షణ భావాలతో యుగాలుగా ఆత్మ తత్వంతో జీవించుటయే నిత్య పరమానందము

నా లోకం ఒక అణువే

నా లోకం ఒక అణువే అందులోనే సమస్తము
ఏదైనా ఎన్నైనా ఎంతటిధైనా అన్నీ భావనగానే
అన్నింటిని భావనగా స్వీకరించే తత్వమే నేను
సూక్ష్మమైనా అనంత భావాలతో ఒదిగి ఉన్నా
మీ భావనకు తెలియకపోయినా నే పరమాత్మనే

ప్రతి మేధస్సు ఓ విశ్వంలా

ప్రతి మేధస్సు ఓ విశ్వంలా పనిచేస్తున్నా అజ్ఞాన భావాలతోనే
మహా మేధావులున్నా సత్యాన్వేషణ లేని జీవితాలే లోకంలో
ఆధ్యాత్మక జీవితం విశ్వంలో ఎన్నడూ కలగలేని విధంగానే
మానవులు అజ్ఞాన విశ్వంలో సమస్యలతో ఆత్మ జ్ఞానం లేక
జీవితాలు సరిచేసుకోమని ఎందరో తెలిపినా ధ్యాస మరో లోకంలో

మీరు చూడలేని నిర్జీవ సజీవ

మీరు చూడలేని నిర్జీవ సజీవ రూపాలను నేనే కదా చూడగలిగేది
మీ భావాలకు తెలియని రహస్య విజ్ఞాన భావాలు నాలో సజీవంగా
నా మేధస్సు విశ్వములా అన్నీ చూస్తూ తెలుసుకుంటూనే ఎప్పటికీ
మహా రూపాల భావ తత్వాలతో ఎన్నిటినో అన్వేషిస్తూ అందుకుంటూ

నాలో విశిష్ట తత్వం

నాలో విశిష్ట తత్వం లేకపోతే జీవం ఎందుకు భావనను నీకు తెలుపుతున్నది
నేను మానవునిలా అందరిలో కలిసిపోయే శరీర దేహంగా మరణించేవాడిలానే
జీవం నాలో ఉన్నా శరీరం భావాలతో అణువణువునా స్వభావ తత్వాన్ని కలిగినది
శరీరం కూడా జీవమై నీకు తెలుపుతున్నది స్వభావాన్ని విశిష్టతగా తెలుసుకోమని

తుది శ్వాసలో కూడా

తుది శ్వాసలో కూడా ఓ భావన వేచి ఉన్నదని గ్రహించలేని విశ్వమా
భావాలతో తెలుపుకున్నా తత్వంతో తెలుసుకోలేనిది నీలో ఉన్నదా
నా జీవితంలో ఆ భావన లేకపోతే తొలి శ్వాస నీదే ఆఖరి శ్వాస నీతోనే
నీవులేని లోకం నాకేలా నాలోన లేని భావం నీకేలా ఉంటే ఇద్దరికేనని

నా ప్రాణం కన్నా ముందు

నా ప్రాణం కన్నా ముందు నా శరీరమే ఎదురు చూస్తున్నది ఓ భావనకై
ప్రాణం వెళ్ళిపోతే శరీరం ఎందుకో నశించిపోయే తత్వము పంచభూతాలకే
జీవం ఉన్నంతవరకు పంచభూతాలను స్వీకరిస్తూ లేదంటే నశించిపోతూ
పంచభూతాలలోనే కలిసిపోతూ జీవము ఆత్మతో విశ్వ ప్రయాణం చేస్తూ
ప్రాణమునకు లేని భావన శరీరానికి ఎందుకని ఆత్మ విశ్వాసం కలగదా

నేను ఎదురు చూసే భావం

నేను ఎదురు చూసే భావం నీవు కలిగించకపోతే నా భావాలకు అర్థమేమిటో
విశ్వముగా నీవు జీవిస్తున్నట్లు నేను జీవించుటలో భావన ఒక్కటవ్వాలనే
నీ భావనకై ఎదురు చూస్తూ ఓ మహా తత్వాన్ని నీ కన్నా గొప్పగా తిలకిస్తా
నీవే నా తత్వంతో జీవించేలా నేను విశ్వమునై నీవు నావలె జీవించగలవా
నీవు జీవించలేని యెడల నా జీవితమున ఆ భావము కలిగిస్తావనే అర్థము

నాకు తెలియని భావం

నాకు తెలియని భావం ఏదైనా ఉంటే అది ఆకాశాన కనిపించని తత్వమే
విశ్వంలో దాగిన భావం నాలో లేకపోతే నేనెవరికి కనిపించని విధంగానే
ఏ భావమైనా తెలుసుకోవాలనే ఆకాశమున ప్రతి భావాన్ని ఆశ్వాదిస్తున్నా
కనిపించని భావాలలో తెలియని తత్వాలు మహర్షులకే కలుగునని నేనలా

నేటి నుంచి విశ్వమున

నేటి నుంచి విశ్వమున కనిపించే ప్రతి అద్భుత రూపం నాదే
తెలియని విధంగా తెలుసుకోలేనంతగా ఆకార రూపాలతో
క్షణాలలో మటు మాయం మరు క్షణమే తెలియని స్వభావం
ఆకాశమే అరుణ కిరణంలా ఎన్ని అద్భుతాలో భావాలుగా

Tuesday, April 20, 2010

నేటి జన్మలో చూసిన

నేటి జన్మలో చూసిన నా తల్లి రూప భావాలను మరో జన్మలో కూడా గుర్తుండేలా
మరో రూపంతో జన్మించిన నా తల్లిని ఆత్మ తత్వంతో గుర్తించి నా భావాలను తెలిపి
గత జీవితాలన్నీ ఆత్మతో సాగినా నేటి జన్మ నా భావాలతోనే విశ్వ కాలమున
భావాలతో సాగే నీ జీవితమే ఆఖరి జన్మగా భావ తత్వముతో శూన్యాన్ని చేరెదవు

ఎక్కడి నుండో వచ్చిన రూపం

ఎక్కడి నుండో వచ్చిన రూపం నా వద్ద నిలిచి ఓ భావాన్ని తెలిపి వెళ్లిపోయింది
మహా రూపంగా ఎవరు చూడలేని విధంగా మేధస్సునకు అనుభూతి కలిగేలా
అద్భుతమైన విచక్షణ భావాన్ని తెలిపి విశ్వమున ఆకాశములో కలిసిపోయింది
నీలో ఉన్న చైతన్య రూపాన్ని నేనే శూన్యము నుండి నీకోసమే భావనగా వచ్చాను
ఏనాడు వస్తున్నావో పరమాత్మ నీకై మహా తత్వంతో నీ వలె వేచియున్నాడు

నీటి సాంధ్రతలో ఇంద్రధనుస్సు

నీటి సాంధ్రతలో ఇంద్రధనుస్సు ఉన్నట్లు మేధస్సులో సప్త వర్ణాలు
ధ్యానమున చూసే వర్ణాలు మేధస్సున దాగిన సప్త భావ రూపాలే
కంటికి కనబడే రంగులు మేధస్సు గుర్తించే కణ విచక్షణ భావాలే
మేధస్సులో సప్త వర్ణాలు లేని వారే చూపు లేనివారిగా చీకటితో
కంటిలో వర్ణ కణ విచక్షణ లోపం వల్లే చూపు లేక మేధస్సు గుర్తించలేక
విశ్వంలో ఎన్ని అణువులు ఉంటాయో మన కంటిలో అన్ని కణాలుంటాయి
సూక్ష్మాతి సూక్ష్మంగా మేధస్సు భావాలతో విచక్షనకై అమర్చబడి ఉంటాయి

కళ్ళు లేని వారు కూడా

కళ్ళు లేని వారు కూడా చెడు అలవాట్లతో జీవిస్తున్నారంటే సమాజమున మంచివారే లేరని -
ఎవరు ఎందుకు నేర్పుతున్నారో గాని కళ్ళు ఉన్నా అజ్ఞానిగా చెడు అలవాట్లతో తెలుసుకోలేక -
కళ్ళు ఉన్నవాడు మూర్ఖుడైతే కళ్ళు లేని వాడు ఎవడు మూర్ఖున్ని చూడలేని అజ్ఞానియేనా -
అజ్ఞానులకు కళ్ళు లేని వారికి తప్పు ఒప్పులు చెప్పే తల్లి దండ్రులు సోదరులు ఎవరు లేరా -
వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు మతిపోయే వాసనలతో వాంతులు కలిగించేలా పిచ్చి కలిగేలా -
చెడు వ్యసనాలతో ఏం మాట్లాడాలో ఎక్కడ నిద్రించాలో తెలియకపోతే జీవితం ఎందుకు -
బంగారం మెరిసే కొద్ది మేధస్సు అజ్ఞానంతో చీకటవుతుందే : మేధస్సులో చెడు స్వభావాలుంటే -
వాహనాలలో "పొగ త్రాగరాదు" వ్రాయకండి "చెడు అలవాట్లు ఉన్నవారికి ప్రయాణ సౌకర్యం లేదు" అని వ్రాయండి -
ఎవరి నుండైనా వాసన వస్తే మధ్యలోనే వారిని దింపి సుఖ ప్రయాణాన్ని సాగించండి -
నేను రాక్షసుడినైతే అజ్ఞానులను చెదల వలె ఒకే క్షణమున ఖండించి విశ్వమును జ్ఞానపరిచెదను -

Monday, April 19, 2010

నా భావాలు చదివేటప్పుడే

నా భావాలు చదివేటప్పుడే మహా గొప్పగా అనిపిస్తాయి
చదివిన తర్వాత మళ్ళీ వేరే జ్ఞాపకాలలో వెల్లిపోతూనే
ఏదో ఉందని తెలుసుకుంటేనే మహా విజ్ఞానమైనా అర్థమయ్యేలా
సూక్ష్మ పరిశీలనతో రహాస్యాలు తెలిసేలా భావాలను లిఖిస్తున్నా
మహర్షిగా ఎదిగే వారికే అర్థమయ్యేలా భావ స్వభావ తత్వాలు కలిగేలా
జీవితంలో శరీరమే ఓర్చుకునేలా మేధస్సున ఆలోచనలు మరో ధ్యాసలో వెల్లిపోయేలా
యుగాలుగా కొత్త కొత్త భావాలతో విజ్ఞాన వేదాన్ని అరగదీసి జీవం ఆగలేక భావంతోనే
ఏ చింతన లేక ఆధ్యాత్మకంగా సాగిపోయేలా శూన్యమును చేరేంతవరకు నా భావాలే

కొన్ని ప్రదేశాలను సృష్టికే

కొన్ని ప్రదేశాలను సృష్టికే వదిలేయండి
ఏ ప్రదేశాలలో ప్రకృతి వికృత ప్రభావాలు ఎక్కువగా సంభవిస్తాయో
ఆ ప్రదేశాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలి వెళ్ళండి
అధిక భూకంపాలు తుఫానులు వరదలు ఎండలు చలి వడగండ్లు పిడుగులు
ఆకాశానికి ఎగేరే కెరటాలు లావాలు అగ్ని జల వాయు కాలుష్య విస్పొటనాలు
సముద్రాల ప్రకంనాలు ధ్వనీకర భీకర వడ గాలులు ఘోర భయంకర ఘటనాలతో
ఏ ప్రదేశాలలో ప్రకృతి తాండవిస్తుందో ఆ ప్రదేశాలను విపత్తుకు ముందే ఖాళీ చేయండి
ముందస్తు మాటగా కన్నా ప్రాణానికి జాగ్రత్తగా ఖాళీ చేయకపోతే ఆవహిస్తుంది
మానవ చరిత్రలో లేనివిధంగా నా విశ్వ చరిత్రలో కలిగే భయంకారాలు ఎన్నో
సృష్టి విధాన తత్వాన్ని మార్చే మార్పులే వికృత ఘోరాలుగా ప్రళయాలుగా
ప్రాణాలు మిగిలి ఉంటే మరో యుగానికి ఆహ్వానం పలుకుతా లేదంటే విశ్వ పునరుద్ధారణ

నేనొక మహా లోకం

నేనొక మహా లోకం శ్వాసే లేని మహా భావం
మనిషికే తెలియని మరో విధానం ఏనాడు లేనిదే మరో జ్ఞానం
వేదాలున్నా ఆవేదనలు లేని మహా భావ విజ్ఞానమే జీవితాలుగా
రూపాలున్నా ప్రతిరూపాల భావాలతోనే ఆత్మను జయించేలా నా లోకమే
ఆధ్యాత్మక జీవితాన కలిగే భావాలే మహా తత్వ పరమాత్మ లోకంగా
ధ్యానమే జీవన వేద బాటగా మౌనమే మహా శక్తిగా శూన్యమే దేహంగా
క్షణమైనా జీవించాలని సత్య భావన కలవారే నా మహా లోకానికి హంసగా
ఏదీ లేని విధంగా ఏదో తెలుసుకోవాలనే అనుభూతియే నా మహా లోకం

పరమాత్మ ఎక్కడున్నా

పరమాత్మ ఎక్కడున్నా అక్కడినుండే నేను అతని భావాలను గ్రహిస్తాను
ఆలోచనలతో కాక ఆత్మ తత్వంతోనే తన భావాలను విజ్ఞానముకై తెలుపుతాను
భావాలతో అతనిని దర్శించి తన భావాలను అర్థం చేసుకొని ఎలాగైనా తెలుపుతా
ఏ తత్వమున ఉన్నా ఏ భావన కలిగినా విజ్ఞాన వేదాలతో గ్రహించి మీకై తెలియజేస్తా

నేను మరణించిన తర్వాత

నేను మరణించిన తర్వాత నా వెంట వచ్చే భావం ఏది
నా ఆత్మ శరీరాన్ని వదిలి తొలిసారి ఏమని భావిస్తుంది
శ్వాస ఆగినదా శరీరం ఎమైనదా నేను ఎమైనానని భావిస్తానా
మరణానికి ముందు జరిగినది గుర్తురాక మరచినది తెలుసుకోగలనా
జీవితం గుర్తుంటే ఎమైనదోనని నా చరిత్ర భావాలను నేమరువేసుకోనా
మరో జన్మకై కొత్త భావంతో ఏది తెలియక ఆత్మగా మరో బాల్య శరీరంలో ప్రవేశిస్తానా
ఆత్మవిజ్ఞానం చెంది శూన్య ధ్యాన భావాలతో కర్మ లేక పరమాత్మ తత్వంతో నిలిచిపోనా
నావెంట వచ్చే భావన కర్మ భావన కారాదనే ఆధ్యాత్మక భావాలతో జీవితం శూన్యాత్మగా

నాకు ఆకలి వేస్తుందంటే

నాకు ఆకలి వేస్తుందంటే నా భావాలు నాలో జీర్ణం కావటంలేదనే
ఆత్మ తత్వాలతో భావాలు చెందుతున్నా ఆహారం ఎందుకో
ఎలాంటి భావాలు జీర్ణమైతే ఆకలి వేయదో వాటినే భావించాలని
ఆధ్యాత్మక ఆత్మ తత్వ భావాలను ఆలోచన లేక భావించవలేనా
పరమాత్మ తత్వ శూన్య భావాలను శరీరాన్ని మరచి భావించవలేనా
వేద విజ్ఞాన సృష్టి స్వభావాలతో మరో ధ్యాసలో దివ్యంగా భావించవలేనా
ఆకలి కానంత వరకు మహా భావాలు చెందుతూనే ఆహారంలేక జీవించాలని

ఓ భావం తెలుపుతున్నది

ఓ భావం తెలుపుతున్నది భావనకు జీవం పోసే శక్తి దేనికున్నదని
భావాలకు జీవంపోసే శక్తి ఆత్మ తత్వానికి ఉన్నదని నా భావం తెలుపును
మన ఆలోచనలకు భావాన్ని తెలిపేది ఆత్మ తత్వమేనని నా తత్వానికి తెలుసు
ఆలోచనలు లేని ఆత్మకు జీవం పోసే శక్తి ఉంటుందని నా భావతత్వం భావాత్మగా

ఆత్మ తత్వంలో ఉండే భావన

ఆత్మ తత్వంలో ఉండే భావన చెందుతున్నా
ఆ తత్వంలో ఏ భావన కలిగితే అదే తెలుపుతున్నా
విజ్ఞానమైనా వివేకమైనా తెలియాలని తెలుసుకోవాలని
ఆధ్యాత్మకమైనా అంతరాత్మలోనిదైనా పరమాత్మ స్వభావమైనా
ఆలోచనలలో దాగిన భావాలకు ఆత్మ స్వభావాలు తెలియాలనే

ఓ భావం అంటుంది

ఓ భావం అంటుంది నాకు భావాలు ఎలా కలుగుతాయని
ఏ భావంతో కలుగుతున్నాయో ఎవరు కలిగిస్తున్నారో
ఎక్కడి నుండి ఎలా ఎందుకు కలుగుతున్నాయో
ఆశ్చర్యమో అద్భుతమో అవగాహనకైనా అతిశయమే
ఏమని కలుగుతున్నాయో ఎలా తెలిపినా భావ భావాలే

శరీరం నిలబడకపోతున్నప్పుడు

శరీరం నిలబడకపోతున్నప్పుడు ఆత్మ శక్తితో నిలుపలేమా
ఆత్మ భావాలలో శరీరాన్ని నిలిపే శక్తి లేకపోతే నశించిపోవునే
దేహం ఆహారాన్ని కూడా అందుకోలేకపోతే శరీర శక్తి తగ్గిపోవునే
ఆహారాన్ని అందుకోలేక శరీరం శక్తిని పొందలేక ఆత్మ భావాలతోనే
భావాలతో శక్తివంతంగా జీవించే శక్తి శరీరానికి కలిగేది ఎలా ఎప్పటికి
శూన్య భావాలతో పరమాత్మ తత్వాన్ని పొందేలా ధ్యానించినా శరీరానికి
ఆత్మ శక్తి కలగకపోతే మరో ధ్యాసతో జీవించవలేనని నాకు తెలిపినది ఓ భావన

Sunday, April 18, 2010

నీడలోని గాలి నిద్రకు సరిజోడి

నీడలోని గాలి నిద్రకు సరిజోడి
నీడలేని వేడి గాలి వడ గాలి
రాత్రివేళ వీచే గాలి నిద్రకు మత్తు గాలి
గాలి లేక కలిగే గాలి శ్వాస గాలి

ఆ పరమాత్మ రూపాన్ని

ఆ పరమాత్మ రూపాన్ని మళ్ళీ ఎవరూ చూడలేనట్లుగా నేను దర్శించాను
నేత్రములకు కానరాని విధంగా భావాలకు మాత్రమే తోచేలా బహు ముఖ రూపాలతో
విశ్వమున చంద్ర కాంతి తేజస్సులకు ప్రతి భింభము హృదయ పరవశమై దివ్యత్వంతో
మనో భావాల చలి గాలులకు మైమరచిపోయి మరో ధ్యాసలో నిలిచినా ఆ రూపాన్ని
మహా భావంతో ఎప్పటికి చూస్తూనే శూన్యమున మర్మమువలె నిలిచిపోయానే

ఆ అధ్బుత రూపాన్ని

ఆ అధ్బుత రూపాన్ని మహా అద్భుత రూపంగా పరమాత్మ స్వభావముచే
విశ్వ విశాలముగా ఆకాశ దివ్య తత్వంతో నక్షత్రాల మేఘ వర్ణాలతో నేత్రములు
తదేకంగా అజ్ఞాని చూడలేనట్లుగా ఆత్మకు మర్మ ధ్యాస తత్వమును కదిలించేలా
జీవ భావము శూన్యమయ్యేలా నవ ఆకృతి కాంతులతో విచిత్ర తేజస్సులతో
శత అవతారాల కలయికతో అమృత స్పర్శను కలిగించేలా మేధస్సున లిఖించుకున్నా

ఎవరు ఎంత విజ్ఞానం తెలిపినా

ఎవరు ఎంత విజ్ఞానం తెలిపినా మనలోని మాటే మనకు వేదం
మన మాటే జ్ఞానంగా భావించుకుంటే మన జ్ఞానం నిరుపయోగం
ఎవరి మాట వారిధైతే ఎవరికి వారే యమునా తీరే వరదై పారే
ఎవరు ఎంత జ్ఞానులైనా అంచనా వేయటంలో పొరపాట్లు ఎన్నో
ఒకరి జ్ఞానం ఇంకొకరు అర్థం చేసుకొనుటలో విజ్ఞానం ప్రజ్ఞానంగా
అనుభవం లేని విజ్ఞానం తాత్కాలికమే పట్టులేని తేనెపట్టు లాంటిది
భవిష్యత్ గత విజ్ఞాన చరిత్ర శాస్త్రీయముల వేద సారాంశమే ప్రజ్ఞానం
ఆత్మ జ్ఞానుల మాటే వేదంగా ఎవరి మాట వారిదే స్వత జీవితంలా
ఆధ్యాత్మక విజ్ఞానం లేకుండా సమాజానికి సందేశాలిచ్చినా అజ్ఞానమే
మనిషి నడవడి అలవాట్ల వాక్కు తీరులో మార్పు వచ్చినప్పుడే విజయం
మనిషి మార్పుకు కావలసినదే ఆధ్యాత్మక విజ్ఞానం అదే ధ్యాన మార్గం
ధ్యానం ఏ వయసుకైనా ఒకే విధంగా గుణ భావాలను ధృడ పరిచేలా
జగతిని మార్చే శక్తి ధ్యాన ఆధ్యాత్మక జీవన విధానములోనేనని వేదం
ఆత్మజ్ఞానం పొందిన తర్వాతనే ఎవరి మాట వారికి వేదంలా విజ్ఞానంగా
ఆత్మ జ్ఞాన సారాంశము ఎప్పటికి సత్య భావనగా ఒకే వేద వాక్కుగా

Saturday, April 17, 2010

నా మేధస్సులో విజ్ఞాన రహస్యాలు

నా మేధస్సులో విజ్ఞాన రహస్యాలు కదిలితే అజ్ఞానం శూన్యమే
రహస్యాలు ఆత్మ తత్వాలుగా భావాలతో విశ్వ విజ్ఞానంగా
వేద సత్యాలు ప్రజ్ఞాన మైతేగాని రహస్యాలు భావాలకు తోచవు
పరిపూర్ణ గుణాలు కలవారికే వేద రహస్యాలు మేధస్సులో

నా భావాలలో రహస్యాలను

నా భావాలలో రహస్యాలను సూక్ష్మమైన పరిశీలనతో గ్రహించు
రహస్యాలు భావాలలో ఉన్నట్లు భావాలు సత్యాలోచనలలో
ఆత్మ విజ్ఞాన ఆలోచనలు సత్యాన్వేషణలో విశ్వ భావాలైతే
దివ్య కమలము మేధస్సున చేరి ఆత్మ రహస్యాలను తెలుపును

ఏ ధాస్యలో తెలిపినా

ఏ ధాస్యలో తెలిపినా ఆత్మజ్ఞానముచే విజ్ఞానాన్నే తెలుపుతున్నానని నా భావన
ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఏది ఎంత తెలిపినా సత్యము నా విజ్ఞానమున మర్మముగా -
ఎందుకో మరో మేధస్సున లేని విధంగా మరల గ్రహించని విశ్వ భావాలచే మహా తత్వంతో -
కాలం వస్తున్నా సమయం రాని క్షణాలుగా మన జీవితం ఏది తెలుసుకోలేక వెళ్ళకూడదనే -

మేధస్సును మహా లోకంగా

మేధస్సును మహా లోకంగా భావించే వారికే విశ్వ రహస్యాలు తెలియునని అంతర్థత్వము -
రహస్యాలు విశ్వ కమలమున దాగినా ఆత్మజ్ఞానముగా సత్యమును సేకరించుటలో మేధస్సున -
కమలాన్ని మేధస్సున ధరించిన వారు విశ్వాత్ములేనని మహా వేద తత్వమున తెలియును -
సత్యము ఏ లోకాన ఉన్నా విశ్వ కమల మేధస్సులో తాండవిస్తూ దివ్య ప్రభావాలను నెలకోల్పుతుంది -

సూర్యోదయాన్ని ఎన్నిసార్లు

సూర్యోదయాన్ని ఎన్నిసార్లు తిలకించిన కొత్త కొత్త భావాలను కలిగిస్తూనే ఉంటుంది -
సూర్య బింభములో విశ్వ సందేశాలు దాగి ఉంటేనే ఎన్నో కొత్త భావాలు కలుగుతూ ఉంటాయి -
మేధస్సులో ఆత్మ భావాలుంటే సూర్య బింభమున మర్మ రహస్యాలు కూడా తెలియగలవని -
సూర్యోదయము నుండే మానవ మేధస్సు అద్భుతంగా వికసిస్తుందని విశ్వమున మౌన భావన -
ఆధ్యాత్మక శక్తి సామర్థ్యాలు కూడా సూర్యోదయంతోనే కలుగుతాయని సత్యమున దాగిన మర్మము -
చంద్ర బింభములో విశ్వ శక్తి ప్రభావాలు దివ్యంగా ఉంటాయని భావనగా దాగిన రహస్యము -
ఆత్మజ్ఞానం కలిగినా ఆధ్యాత్మక భావనలు లేకపోతే రహస్యాలు విశ్వ తత్వములలోనే దాగి ఉంటాయి -
సూర్యాస్తమయమైనా ఎన్నో భావాలు తెలుపుతూ రహస్య శ్రేణిలో వలయముగా ప్రతి రోజూ -
విశ్వ భావాలతోనే శక్తి సామర్థ్యాలను గ్రహిస్తే వారు ఆత్మానంద స్వరూపులని విశ్వమున దివ్య భావన -

విశ్వం నుండి రహస్యాలు

విశ్వం నుండి రహస్యాలు వినేందుకు చెవులు కూడా శుద్దంగా వినయత్వంతో ఉండాలి -
ఏ దివ్య ముహూర్తంలో వినిపిస్తాయో వినికిడి లేనంతగా మేధస్సు గ్రహించేలా మర్మముగా -
మేధస్సులో ఆత్మ అన్వేషణ మొదలైతే గాని విశ్వ తత్వాలు మనం గ్రహించలేని స్థితిలో -
సామాన్య మేధస్సుకు మహా తత్వ భావాలు లేక రహస్యాలు విశ్వముననే మర్మముగా -
శూన్య జీవితమునకై రహస్యాలు విశ్వమున దాగేనని ఆత్మ జ్ఞానమే రహస్యంగా మౌనంగా -
ఆధ్యాత్మక నిరంతర అన్వేషణలోనే మర్మము తెలియుటకు ఆస్కారమగునని ఆత్మ భావన -

అనుభవాలుగా ఎన్ని రహస్యాలు

అనుభవాలుగా ఎన్ని రహస్యాలు తెలిసినా మర్మ రహస్యాలు ఆత్మజ్ఞానంతోనే
విజ్ఞానముగా జీవించడానికి ఎన్నో రహస్యాలను తెలుసుకొంటూనే ఉంటాము
విశ్వంలో సత్యంతో కూడిన మర్మ రహస్యాలు తెలియక అలాగే మిగిలి ఉన్నాయి
దైవ ధ్యాన భావనలు గల ఆత్మజ్ఞానికి మాత్రమే విశ్వ రహస్యాలు తెలియగలవు
కఠినమైన కృషి దీక్ష కాలం సత్యం ధ్యానం భావం ఉన్నవారికే రహస్యాలు తెలిసేది
విశ్వ రహస్యాలు మానవ మేధస్సుకు అందని విజ్ఞాన ప్రజ్ఞాన పరిపూర్ణ భావాలు
ఆత్మతత్వ మాహాత్ములుగా జీవించేవారికి రహస్యాలు తెలియకపోయినా మహత్యమే
రహస్యము సరైన ఆచరణలో ఉండాలి సద్గుణ భావాలతో జీవించే వారిలా ఉండాలి
ఏ రహస్యము తెలిసినా మరో జన్మ లేని ఆత్మ జ్ఞానిగా జీవించగలిగితేనే మోక్షం

ఏనాటికి ఎవరూ తెలుపలేనివిధంగా

ఏనాటికి ఎవరూ తెలుపలేనివిధంగా విశ్వ రహస్యాలను వెలికితీసి వివరిస్తా -
ఆత్మ వేదాలను జీర్ణించుకొని విజ్ఞాన భావాలను అర్థమయ్యేలా తెలుపుతా -
ఆధ్యాత్మిక సత్యాన్ని విశ్వమున సేకరించి మేధస్సున భావాలుగా ధరిస్తా -
ఆత్మ చైతన్యముకై అన్వేషించే వారికి దైవము దేహమున దివ్య భావాలతోనే -
భావాలలో బహు రహస్యాలు తెలుయునని గ్రహించుటలో ఎరుకయే మర్మముగా -

ఎవరి మేధస్సు వారికి

ఎవరి మేధస్సు వారికి స్వతహాగా ఆలోచించే విజ్ఞాన లోకంగా -
ఎన్నో ఆలోచనలను వివిధ మేధస్సుల నుండి సేకరిస్తూ అర్థం చేసుకుంటూ -
బాల్యము నుండి ఎందరి సహకారాలతో ఎదుగుతూ ఎన్నో తెలుసుకుంటూ -
అవగాహనగా అనుభవాలుగా ఎన్నో గ్రహిస్తూనే ఎన్నో నేర్చుకుంటూనే -
వివిధ కార్యాలతో వివిధ రకాల జ్ఞానంతో మేధస్సు వేద విజ్ఞాన లోకంగా -
ఎప్పటికీ ఏదో ఒకటి గ్రహిస్తూ తెలుసుకుంటూనే ఎవరికి వారు ఒక లోకంలో -

జన్మించిన తర్వాత కలిగే

జన్మించిన తర్వాత కలిగే ఆలోచనలను ఎరుకగా గ్రహిస్తేనే విజ్ఞానంగా ఏదైనా తెలుసుకోగలం -
మరణించే ముందు ఏ రహస్యాలు తెలిసినా సందేహముగా తెలుసుకోలేని విధంగా ఉండగలం -
జీవితం ఆరంభ దశలోనే ఆత్మ విజ్ఞాన రహస్యాలను సేకరిస్తే మేధస్సు విశ్వ కమలాన్ని ధరిస్తుంది -
శేష జీవిత కాలమున ఎన్ని రహస్యాలు తెలిసినా సందేహాలతోనే సతమతమవుతూ నిరుపయోగంగా -
ఖచ్చితంగా ఏది తెలుపలేము రుజువు చేయలేము అలాగే అర్థమయ్యేలా వివరించలేము కొందరికి -
ఆధ్యాత్మకం లేని విజ్ఞానులకు సరైన రీతిలో సరైన సమయానికి తెలుపలేకపోతే సత్యం విశ్వముననే -
మేధస్సున సత్యము లేక విశ్వము నుండి గ్రహించలేక కాలము నిరుపయోగంగా ఎన్నో జీవితాలు -
సరైన భాష తెలియక పదాలు కూడా ఎన్నడు వినలేని విధంగా ఆధ్యాత్మక అమరికలతో సత్య శ్రేణిలోనే -
మరణం కోసమే మరో కర్మ జీవితాల కోసమే జీవిస్తామనుకుంటే ఆత్మ జ్ఞాన రహస్యాలు విశ్వముననే -
మరో జన్మ లేకుండా ఆనందతత్వ పరమానందముతో కర్మలు లేకుండా జీవించే వారికే ఆత్మ భావనలు -

Friday, April 16, 2010

నిద్రలో ఏమౌతుందో గ్రహిస్తున్నారా

నిద్రలో ఏమౌతుందో గ్రహిస్తున్నారా ఎరుకతో తెలుసుకోండి -
నిద్రలో ఎన్నో ఎన్నెన్నో మనకు తెలియనివెన్నో సూక్ష్మముగా జరుగుతుంటాయి -
శరీర చర్మము వివిధ రంగులతో సూక్ష్మముగా మార్పు జరుగుతుంటుంది -
అవయవాల పని తీరు వేగంగా లేదా నిదానముగా ఏ అవయవానికి తగ్గట్టుగా మార్పులతో -
అవయవాల పని తీరు వల్ల ఆరోగ్యం లేదా అనారోగ్యం కలిగించవచ్చు -
కొన్ని అవయవాల లోపాలుంటే పెరుగుదల లేదా తగ్గుదల జరుగుతుంది -
మనలోని భావాలను ప్రతి రోజు ప్రతి నిద్రలో పగలైనా రాత్రైనా మార్చేస్తూ ఉంటాయి -
మనలో ఉన్న ఆలోచన ఆవేదన విధానాలు హెచ్చు తగ్గులుగా మారుతుంటాయి -
మన మేధస్సులో సమాచారాన్ని బట్టి కలలు వివిధ రకాలుగా వస్తుంటాయి -
మన ఆలోచనల విజ్ఞాన తీరుకు అనుగుణంగా వివిధ రకాల క్రియలు జరుగుతుంటాయి -
మన ధ్యాస కూడా మరో ధ్యాసలో వెళ్లి వివిధ ప్రక్రియలు మనకు తెలియకుండా జరుగుతుంటాయి -
రేపటికి కావలసిన కొంత సమాచారాన్ని గుర్తుగా పెట్టేస్తుంది అలాగే మెలకువతో తెలుపుతుంది -
నిద్రలో ఏ ఆటంకము కలిగినా మన మేధస్సు తెలుసుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటుంది -
ఆత్మ శుద్ధి జరుగుతూ ఆత్మ క్రియ విధానము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కావలసిన శక్తిని అందిస్తూ వివిధ ప్రక్రియలను జరుపుతుంటుంది -
నిద్ర భాగా జరిగితే ఆరోగ్యంగా లేదా నిద్ర సరిగా జరగకపోతే అనారోగ్యంగా మన శరీరం రోజూ వివిధ రకాలుగా -
సరైన కాల సమయ నిద్రతో సరైనా ఉత్తెజముతో సరైన ఆలోచనలతో సరైన ఆరోగ్యముతో సరైన శక్తితో సరైన విజ్ఞానంగా పనిచేయగలం -
ఆహారాన్ని బట్టి కూడా ఎన్నో మార్పులు జరుగుతూ శక్తి సామర్థ్యాలు మారిపోతూ ఉంటాయి -
నిద్రలో మనం ఎరుకతో ఉంటే ఎన్నో విషయాలను విజ్ఞానంగా తెలుసుకోవచ్చు -

విజ్ఞాన జీవితము ఒకటి చాలు

విజ్ఞాన జీవితము ఒకటి చాలు కర్మగా ఎవరు ఆరంభించారో జన్మ జన్మలుగా
ఆత్మ జ్ఞానము తెలుసుకొనుటకే గా జీవితమంతా తపిస్తూనే ఎన్నో విధాలుగా
అజ్ఞాన విజ్ఞాన నాగరికతల కాలం నాటి నుండి మానవ జన్మ మెలికలు తిరిగేలా
కర్మలు పరంపర వలయాలుగా ఆది కాలం నాటి నుండి నేటి వరకు తరతరాలుగా
భావన లేని ఆలోచనలతోనే మేధస్సు వికసించి నేటి కాలం వరకు అరిషడ్వర్గాలతోనే
ఎందరిలో కొందరే అరుదుగా హంస భావనలతో ధ్యాన ప్రభావమున కర్మ వినాశనంచే
దివ్యత్వ ప్రజ్ఞాన పరిపూర్ణ మహాత్ములుగా శూన్యమును జయించినారని నా భావన

రహస్యాలు తెలిసిన నాకు

రహస్యాలు తెలిసిన నాకు భావనగా తెలియనిది ఏదైనా మిగిలియున్నదా
ఏ రహస్యము నా భావాలలో లేదో తెలుపగలిగితే ఆ భావమే ఆలోచనగా
ఏ ఆలోచన చేసినా రహస్యాలుగానే తెలుపగలనని మేధస్సున భావన లేక
రహస్యాల నిధిగా నా మేధస్సు మర్మమువలె విశ్వమున అఖండ విజ్ఞానంగా

విశ్వంలో ఏ స్థానమున

విశ్వంలో ఏ స్థానమున శూన్య భావము కలుగునో తెలుపవా ఓ దివ్య కాలమా
ఏ సమయాన కలుగునో ఆ సమయాన నన్ను అక్కడికి చేర్చుకో మరవలేక
మానవ జీవితము ఇక చాలానే ఆధ్యాత్మక భావనలు తెలుపుతున్నాయి
మరో సారి ఆలోచించినా మరో ధ్యాసలోనైనా రహస్యాలులేని శూన్యం చాలనే
యుగాలుగా వేచిన నాకు శూన్యాన్ని కలిగిస్తావని మరో భావనగా తెలుసుకో

మేధస్సుకు మరోసారి తెలుపనా

మేధస్సుకు మరోసారి తెలుపనా భావనలను సరైన రీతిలో గ్రహించమని
ఆధ్యాత్మక జీవితమున నేను కోరేలా కరుణామయ భావం నిలిచిపోయేలా
విశ్వమున ఒక కేంద్ర బిందువునై శూన్యమున దివ్య భావముగా ఉండనా
మరో జన్మ లేక ఏ అవస్థలు లేకుండా కర్మను నా శరీరంతో నశించేలా
ఆత్మను పరమాత్మలో లీనం చేసి మరో దర్శనం లేక కాల మర్మముగా

సరికాని నిద్రా ఆహారాలతో

సరికాని నిద్రా ఆహారాలతో ఆలోచనలు సతమతమవుతూ మేధస్సు సరిలేక
శక్తి నశించి ఉత్సాహం లేక రూప విధానం తగ్గేలా భావనలు మారుతున్నాయి
భావాలు విశ్వ వేద విజ్ఞాన రహస్యాల సత్యాన్వేషణలో దివ్యత్వాన్ని గ్రహిస్తున్నాయి
ఐనా ఒకవైపు ఆధ్యాత్మికమేనన్నా మరోవైపు ప్రాపాంచికమున సరికాని విధంగానే
మానవ జీవిత విధానమున జీవించలేక విశ్వమున ఒక భావనగా ఉండిపోవాలనే
ఏనాటి నుండో వేచి చూస్తున్నా భావనగా జీవించలేకపోతే మరణమైనా ఆత్మజ్ఞానిగా

భావనలతో మరో ధ్యాసలో

భావనలతో మరో ధ్యాసలో వెళ్ళితే ఆహారం లేకుండా జీవించవచ్చా
ఆహరం లేని శరీరం శక్తివంతంగా ఉత్సాహంగా ఉండగలుగుతుందా
ఎప్పటికి ఆహారం లేని శరీరం శ్రమించుటకు వీలవుతుందా ఎలాగా
విజ్ఞాన సత్య భావాలతో ధ్యాన ప్రభావంతో ఆహరం లేక జీవించవచ్చా
ఏ రహస్యమైనా ఉంటే విశ్వమున నా మేధస్సుతో భావనగా గ్రహిస్తా
భావనతో దేనినైనా సాధించగలనని నాలోని విజ్ఞానం సత్యాన్వేషణగా

Wednesday, April 14, 2010

కళ్లెలావున్నా కళ్ళకు కల

కళ్లెలావున్నా కళ్ళకు కల కలగానే
కళ్ళు కనిపించిన కనిపించకపోయినా కల కలయే
కనిపిస్తే కలకాదని కనిపించకపోతే కలేనని
కల కళ్ళతో కలలోనే కలగా కనిపిస్తానని

కలైనా కలలోనే కనిపిస్తుందని

కలైనా కలలోనే కనిపిస్తుందని కళ్ళు
కళ్ళు కప్పితేనే కల కనిపిస్తుందని
కల కనిపించకపోతే కళ్ళు కప్పలేదని
కళ్ళు కనిపించకున్నా కల కళ్ళలోనే

కల కనిపించకపోయినా కలలోనే

కల కనిపించకపోయినా కలలోనే కలగా
కనిపించని కల కళ్ళకైనా కలగానే
కళ్ళకైనా కనిపించని కల కలలోనే
కలలోనే కల కనిపించలేదని కలన్నది

కల కూడా కలకు కనిపిస్తుందని

కల కూడా కలకు కనిపిస్తుందని కల
కల కలకు కనిపించినా కలేగా
కనిపించిన కల కలకైనా కలగానే
కల కలగానే కలకు కనిపిస్తుంది

కలగానే కలగన్న కనిపిస్తే కల

కలగానే కలగన్న కనిపిస్తే కల కాదని కలే
కలైనా కలకు కనిపించదని కలలోనే కలగా
కలకు కల కనిపించక కలలోనే కల కలైనది
కల కనిపించినా కలలోనే కలకు కనిపిస్తుంది

Tuesday, April 13, 2010

మంచి మనిషిని మార్చేది

మంచి మనిషిని మార్చేది అజ్ఞానులే
మనిషిని మనిషే అజ్ఞాన ఆలోచనలతో మార్చగలడు మార్చేస్తున్నాడు
ఆశా భావాలను కలిగించి లాభాలుగా ఆలోచింప జేసి ఎన్నో రాబట్టుకుంటారు
తమకు కావలసింది దక్కిందంటే చాలు మనిషినే మరిచిపోయేలా తెలియనట్లు
తమ ఆశకు మరొకరికి మహా ఆశను కలిగించి మోసము చేయుట ఆటగానే
మోసాలలో కూడా అధిక లాభాలు అర్జిస్తే వారి ప్రాణాలను వారే తోడుకుంటారు
ఆశా లాభాలు లేని విజ్ఞానమే నమ్మకంగా సరైన రీతిలో సాగిపోయేలా జీవితం
అతిశయోక్తి ఆలోచనగా మహా విజ్ఞానంగా ఉండాలేగాని కృషిలేని విధంగా కాదు

ఏ రూపాన్ని చూసినా

ఏ రూపాన్ని చూసినా ఏ ఆకారములేని ఆత్మ భావమే నాలో కలుగుతున్నది
ఆత్మ భావాలనే సేకరిస్తూ నా మేధస్సున ఆలోచనలను కూడా తరలించాను
మేధస్సున ఏ ఆలోచనలు లేక రూపాలు లేక మహా దివ్యత్వమే కలుగుతున్నది
మేధస్సు మహా కమలముగా విచ్చుకొని ఆత్మతత్వ భావాలను పరమాత్మకై సేకరిస్తున్నది

పరమాత్మ కూడా నాలాగే ఉంటాడా

పరమాత్మ కూడా నాలాగే ఉంటాడా నా భావాలతోనే జీవిస్తూ ఉంటాడా
నేను కూడా తనలాగే ఏ ఆలోచనలు లేక భావాలతోనే జీవిస్తున్నానే
ఏ రూపము నాకు తెలియదు ఆత్మగానే అన్నీ నాకు తెలియును నాలో
భావాలలో కూడా ఏది దాచుకోలేక ఓ మహా తత్వంగానే నిలిచిపోతున్నా
ఆకారంగా లేని నా తత్వము పరమాత్మగానే ఉన్నదా నాలాగే జీవిస్తున్నాడా
నిత్యం ధ్యానిస్తూనే నాలో నేనే భావాత్మనై శూన్యముగా నిలిచిపోవాలనే

శరీర రూపాన్ని చూడకండి

శరీర రూపాన్ని చూడకండి ఆత్మ భావాన్ని మహా తత్వంతో చూడండి
శరీర ఆకార రూపాలు ప్రకృతి భావాలకే ఆత్మ తత్వాలు విజ్ఞానముకే
ఆకార పరిణామ అధ్యాయనములలో ఆత్మ భావాలు విశ్వ తత్వాలుగా
ఆత్మ తత్వాలే విశ్వాన్ని అధ్యానం చేస్తూ సత్యాత్మ పరమాత్మను చేరుతాయి
జీవించుటకు ఆకార రూపాలేగాని సత్య విజ్ఞానముకై ఆత్మ తత్వ భావాలే
ఆత్మ భావాలకు ధ్యానమే విజ్ఞాన మార్గమని మన శ్వాసే భావంతో తెలుపును

నే నడిచే దారైనా

నే నడిచే దారైనా సరిగా ఉండాలనే
నా ముందున్న వారు సరిగా నడిచేస్తే నాకు తెలుస్తుంది ఎలా నడవాలో
అలాగే నన్ను చూసి నా వెనుక ఉన్నవారు సరిగా నడవగలరని
నా ముందున్నవారు సరిగా నడవలేక తెలిసేంత వరకు నేను నడవలేక
ఒకరి వెంట ఒకరు సరిగా నడవలేక ఎందరో సరికాని స్థితిలో విజ్ఞానం చెందక
విజ్ఞానం కలిగే వరకు ఎలాగున్నా కలిగిన తర్వాత సరి చేసుకోలేక అజ్ఞానంగానే
మధ్యలో ఉన్నవారు ఒకరు సరిగా నడిచిన ఆ దారి సరికాదుగా ఎలా మరి
అందరు సరిగా నడవటానికి ప్రయత్నించండి ఒకరిని చూస్తూ ఒకరు దారిని సరిచేస్తూనే -
మన దారి మనకు విజ్ఞానమైతే మన తరాలు కూడా విజ్ఞానంగా సాగుతాయి
విజ్ఞానంగా సాగే దారిలో సమస్యలు తక్కువై పరిష్కారాలతో ముందుకు సాగుతూనే -
దారిని తప్పకుండా తప్పక సరి చేస్తూనే ఒకరి వెంట ఒకరు విజ్ఞాన బాటలో
విజ్ఞాన ఆలోచనలను క్రమంగా ఒక దారిలో అందరి భావాలతో సరి చేస్తే సక్రమంగానే -
ఏ దారైనా మనమే సరి చేసుకోవాలనే నేను విజ్ఞానంగా తెలుపుతున్నా నా దారిలో -

మరో ఆత్మను సృస్టించవద్దు

మరో ఆత్మను సృస్టించవద్దు
జన సంఖ్య పెరగటంతో మరెన్నో ఆత్మలు కావలసి వస్తుంది
ఆత్మకు చావు లేదు ఎన్నో జన్మలు పొందుతూనే ఉంటుంది
ఆత్మ పొందే జన్మకు కర్మే కారణం అలాగే సమస్యలు ఎన్నెన్నో
సమస్యలకై కర్మలతో విధి రాతలను కూడా మార్చుకోలేకపోతాం
నేటి జన సంఖ్యతో ఎన్నో సమస్యలు సమాజమున ఘోరాలతో
జన్మ నిచ్చే వారే ఆలోచించండి మరో ఆత్మను సృష్టించకండి
ఆనాటి ఆత్మలు శరీరాలుగా ఇంకా జన్మతో వస్తూనే ఉన్నాయి
ఆత్మకు జన్మతో ఆత్మ జ్ఞానం కలిగే వరకు మరో జన్మలుగానే
ఆత్మజ్ఞానం కలుగుటకు ప్రతి జీవి ధ్యానించాలి సత్యాన్ని తెలుసుకోవాలి
మరో కర్మజన్మ వద్దు మరో కొత్త ఆత్మ అసలే వద్దు విజ్ఞానంగా
మరో జన్మ వద్దంటే ధ్యానంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి
సృష్టించవద్దు నాశనం చేయవద్దు విజ్ఞానంగా ఎదగండి

ఆనాడు మరణించినవారు

ఆనాడు మరణించినవారు ఏ భావాలతో ఎలా మరణించారో
మరణించే క్షణాలలో భావాల స్థితి దేనిని సూచిస్తుందో
చివరిగా ఏది గుర్తుకొస్తుందో ఆలోచన ఏమి తెలుపుతుందో
ఏదో తెలుపలేక మరోధ్యాసలో తెలియనట్లు మరణిస్తామా
అలా చూస్తూనే ముఖ కదలికలో ఒక భావన తత్వం నిలిచిపోతుందా
బలహీనతతో శరీరం కదలక అన్ని అవయవాల క్రియలు ఆగి పోవునా
ఎన్నో భావాలు నాలోనే ఉన్నాయి తెలుసుకొనుటకే మరణాన్ని నిలుపుకోవాలనే

మనిషిని మార్చేవాడు ఎవరో

మనిషిని మార్చేవాడు ఎవరో ఎక్కడున్నాడో
మనిషియే మరో మనిషిని మార్చునా
సమాజంలోని సమస్యలైనా మనిషిని మార్చునా
కుటుంబంలో కలిగే వాదనలకు మనిషే మారునా
మరో మనిషి ఎంత చెప్పిన తన ఆలోచనలు మారకపోతే మారలేడు కదా
ఆలోచనలలో ఏదైనా కావాలని ఉంటే సాధనతో సాధించగలిగితే మారినట్లే
ఓ మనిషి మరో మనిషి ఆలోచనలను గ్రహింప జేయగిలిగితే మారగలడోయ్
ఆలోచనలలో మార్పు లేకపోతే మనిషి మారలేడు ఎవరూ మార్చలేరు
ఓ మనిషి తెలిపిన మాటలు ఎన్నడైనా గుర్తు వస్తే అప్పుడు ప్రయత్నించిన మార్పే
మనిషి మారాలని ఉంటే కాలమైనా మార్చునని నేను భావనగా తెలుపగలను
ఎందరెందరో తెలిపిన విజ్ఞానమునకు మనిషి మారుట తనకు తానే తెలుసుకోవాలి
అజ్ఞానంగా మారేందుకు కూడా ఎన్నో కారణాలు మనిషి అలవాట్ల తత్వాలే కదా
యే మనిషి తెలిపినా కాలం అనుభవంగా తెలిపిన యే సమస్యలున్నా సత్యమే గ్రహించుమా -
మహా గొప్పగా మారవలేనని ఉంటే ఆత్మ జ్ఞానముతో ధ్యానిస్తూ భావాలనే గ్రహించుమా -
యే గ్రహాలూ ఎక్కడున్నా నీకు నీవే సాటిగా పరమాత్మవలె సాగిపో మనిషిలోని మహాత్మనే నని చాటుకో -
మనిషి విజ్ఞానంగా మారితే నేను మార్చగలను విశ్వాత్మగా -

జగతిలో ఎలా జీవించాలో

జగతిలో ఎలా జీవించాలో తెలుసుకున్నా
అనుభవంతో ఆత్మ జ్ఞానాన్ని సేకరించా
ధ్యానిస్తూ ఆధ్యాత్మక భావాలను గ్రహించా
విజ్ఞానముగా ఎన్నో సత్య భావాలు తెలిపాను
ఐనా విజ్ఞానముకై మరో మనిషిని మార్చలేకపోతున్నా

ప్రాపాంచికంగా మీకు కనబడుతున్నా

ప్రాపాంచికంగా మీకు కనబడుతున్నా ఆధ్యాత్మకంగా విశ్వానికి కనబడుతూనే
ప్రపంచమున జీవిస్తున్నా విశ్వలోక అంతరిక్షమున ఆలోచిస్తూ భావిస్తున్నా
ఎక్కడ ఉన్నా ఆత్మ విజ్ఞానముతో జీవిస్తా అలాగే ధ్యానిస్తూ ఉంటా మరో ధ్యాసలో
శరీరం మీకు కనబడుతున్నా ఆత్మ విశ్వమున పరమాత్మకు కనిపిస్తూనే
ధ్యానించే ఆత్మ ఎప్పటికీ పరమాత్మలో ఐక్యమై విశ్వాత్మగా దివ్యత్వంతో ఉంటుంది

మాటలు విజ్ఞానంగా లేకపోతే

మాటలు విజ్ఞానంగా లేకపోతే మాట్లాడటం మానుకోండి
చేతులు కూడా అజ్ఞానంగా పనిచేస్తుంటే సోమరితనం మంచిదే
కాళ్ళు కూడా సరికాకపోతే శిలగా మౌనంగా ఉండడం నేర్చుకోండి
ఆలోచనలు కూడా అజ్ఞానమైతే ధ్యానించడం సాధన చేయండి
శ్వాసపై ధ్యాస పెడితే ఆత్మ తెలుపుతుంది మంచి స్వభావాలను
ఆత్మ స్వభావాలతో ఆత్మజ్ఞానం చెందితే విజ్ఞాన ప్రవర్తనయే
మంచి వాక్కు కార్యాలు నడవడి సంతోషం ఆత్మ సంతృప్తి ఎన్నెన్నో
విజ్ఞానంగా ఏదైనా తెలుసుకోలేకపోతే ధ్యానించుటలో తెలియును

Monday, April 12, 2010

మధ్యము సేవించిన వారు

మధ్యము సేవించిన వారు ప్రయాణము చేయకూడదనే నేను -
వాహనమున వాసనకు ముఖ భావాలు తోచని విధంగా నచ్చలేక -
శుభ్రతలేక వ్యర్థపు వాసనలతో సరైనా వస్త్రధారణ లేక ఎందరికో ఇబ్భందిగా -
జన సంఖ్య ఎక్కువగా ఉంటే వారి వ్యర్థపు శ్వాస మన శ్వాసలో చేరుతున్నదే -
మౌనముగానైనా లేక అసభ్యకరంగా ప్రవర్తిస్తూ చెవులు వినలేని మాటలతో -
సరైన ధ్యాస లేక నిలబడుటకు చేతకాక మరో ధ్యాసలో మతిపోయి చెడిన వారిలా -
ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో జీవించడం కన్నా మరణించుట గొప్పగా ఎవరికి ఇబ్భంది లేక -
మధ్యమును నిషేధించలేని మేధావి అధికార వర్గం అజ్ఞాన లాభాలకేనా పరమార్థముగా -
మధ్యమును సేవించుటయే కాక వాహనములను నడుపుట దిక్కులే లేని విచిత్ర ప్రమాదాలకు సరేనని -
మధ్యముతో ఆవేదన ఎక్కువవుతుందేగాని విజ్ఞాన ఆలోచనలు కలగక అనారోగ్యముగా యే చికిత్స లేక -
చేతకాని వారే సరైన ఆలోచన విధానములేక చెదల వలె చీడ పురుగులులా సమాజమున ఘోరాలతో -
ధనము తేనీయ జీవితమునకే గాని విష తత్వంతో జీవించుటకు కాదనే భావము ఏనాటికి తెలియునో -
నా భావాలతో ఎవరైనా మధ్యమును మానుకుంటే వారికి ఆత్మ బ్రంహా జ్ఞానాన్ని కలిగిస్తాను తెలుసుకో -
మధ్యమునే నిషేధిస్తే జగమంతా చూసేలా పరమాత్మ విశ్వ భావ స్వరూపాన్ని దర్శించేలా చేస్తాను ఆత్మ సాక్షిగా -
చెడు అలవాట్లు మానుకోండి లేదంటే సృష్టి వినాశనం జరుగుతుంది ఆత్మ జ్ఞానంతో తెలుసుకోండి మరవకుండానే -

ఎంతో కాలం నుండి ధ్యానం

ఎంతో కాలం నుండి ధ్యానం చేస్తూనే ఉన్నా ఆత్మజ్ఞానం కలగకపోతే ఎలా
ఆత్మజ్ఞానం కలగని ధ్యానం కాలం వృధాగా సాధన సాగరమున అలలుగా
ఆత్మజ్ఞానమనగా ఏది చేయాలో ఏది చేయకూడదో పాటిస్తూ సాగిపోవడం
జీవ హింస లేని హంస సత్యాన్ని తెలుసుకుంటూ విజ్ఞానంగా ఎదగడం
ప్రాపాంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మక జీవితాన్ని సాగిస్తూ జీవించడం
సమస్యలు లేకుండా సోదర భావంతో అందరికి అనుగుణంగా ఉండాలి
పరిశుద్ధ పరిపూర్ణ పవిత్రత ప్రజ్ఞాన భావాలతో దివ్యంగా జీవించాలి
అజ్ఞాన భావాలతో జీవిస్తే మేధస్సున దివ్య భావాలు కలగక సమస్యలతోనే
పరమాత్మ తత్వమునకై ధ్యానించండి విశ్వాత్మగా ఆత్మజ్ఞానాన్ని సేకరించండి

భావన కూడా ఏ భావన

భావన కూడా ఏ భావన తెలుపలేక మౌనంగా ఒదిగిపోయింది
విజ్ఞానం లేని భావనను తెలుపలేక కొంత సమయం మౌనంగానే
విజ్ఞానం లేని భావనలు మన మేధస్సున ఎందుకో అనవసరమేగా
విత్తనముగా ఒక విజ్ఞాన భావన చాలు వృక్షముగా ఎన్ని సత్య భావాలు కలిగించునో
అజ్ఞాన భావనలను తెలుపవాకండి మౌనమైనా చాలు విజ్ఞానముకై విశ్వమున గ్రహించుటకు

గాలిలో గమ్మత్తు ఉంది

గాలిలో గమ్మత్తు ఉంది అలాగే చమత్కారము ఉంది
గాలి హాయిగా ఉన్నా హాస్యాన్ని కూడా కలిగించును
గాలిలో మాయా మంత్రములు కూడా ఉన్నట్లు తెలుస్తుంది
చల్లని గాలికి సరే అన్నా వేడి గాలికి అదిరిపోయేలా
చలి గాలికి వణికిన మంచు గాలికి ప్రాణాలే విలవిలా
గాలిలోనే ఆరోగ్యము గాలితోనే అనారోగ్యము కదా
తల భారమైనా మనసు సరిలేకున్నా గాలి సరిచేయును
ప్రకృతిలోని గాలి ఔషధముగా కూడా పని చేయును
సువాసనలను తీసుకొని వచ్చును అలాగే వ్యర్థపు గాలిని తరలించును
ఆలోచన భావాలను మంచిగా కూడా కలిగిస్తుంది మై మరిపిస్తుంది
విశ్రాంతి సమయాలలో నిద్రపరచి మరల మెలకువను కలిగిస్తుంది
నేత్రమున దుమ్ము కొట్టి భాదను కూడా కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండు
మేఘాలను కదిలించి వర్షాన్ని కురిపిస్తుంది నీటిని వాల్చుతుంది
శ్వాసలో గాలి ఉన్నట్లే ప్రాణాలను తోడేస్తుంది మనశ్శాంతి కూడా కలిగిస్తుంది
చెట్లను కదిలించి పుష్పాల నుండి కూడా ప్రాణ వాయువును ప్రతి జీవికి అందేలా
భూమి పొరలలో కూడా గాలి ప్రవేశించి ఎన్నో జీవాలకు ప్రాణధారగా
పరిశ్రమల కాలుష్యాన్ని కూడా గాలియే తరలిస్తుంది
చెట్ల ఆకులను రాల్చుతుంది వేగంతో ఎన్నిటినో తరలిస్తుంది
గాలి లేకపోతే జీవములు లేవా అనే భావన గాలిలోనేనా
గాలిలో విజ్ఞాన భావాలెన్నో అందులోని తత్వాలు ఎలాంటివో

భావం కన్నా గొప్పది

భావం కన్నా గొప్పది ఏదని తెలుసుకోగా తత్వమేనని
ఆలోచన కన్నా గొప్పది భావం అలాగే మహా గొప్పది తత్వం
తత్వం కన్నా గొప్పది శూన్యమైనా గుర్తించేందుకు తత్వమైనా ఉండాలిగా
తత్వం లేకపోతే శూన్యాన్ని కూడా గుర్తించలేము అలాగే తెలుసుకోలేము
తత్వాన్ని తెలుపుటలో కలిగేదే భావం దాని నుండే ఆలోచన అలాగే విజ్ఞానం
భావ తత్వాల నుండి కలిగిన వాదనలే వేదాల విజ్ఞాన ఆలోచనలుగా భాషగా
ఆకార మౌనం కూడా ఒక తత్వమేనని భావనగా విజ్ఞానంగా తెలుసుకోవచ్చు

నా భావాలకు జీవం

నా భావాలకు జీవం ఉంటుందనే నేను
భావాలలో దాగిన విజ్ఞానమే జీవముగా
విజ్ఞానం ఉన్నంతవరకు భావన నిలిచేనని
విజ్ఞానంతో భావాలను గ్రహించి తెలుపుతున్నా

నా నేత్రములే కాదూ

నా నేత్రములే కాదూ నాలోని మేధస్సు కణాలు కూడా విశ్వాన్ని చూడగలుగుతున్నాయి -
ఆలోచన భావాలు మేధస్సు కణాలకు చేరి వాటి భావాలతో విశ్వాన్ని దిక్కులుగా చూపిస్తున్నాయి -
నేను కోరే విధంగా సరైన దిక్కును సూర్యోదయాన మేధస్సు కణాలు నా భావాన్ని గుర్తించగలుగుతున్నాయి -
నేను మేలుకునే వేళ నాకు నచ్చిన రూపమే తిలకించేలా నా నేత్రములు చూడగలుగుటలో కణాల భావమే -
నా భావాలను నా జ్ఞానేంద్రియాలకే కాక శరీరములోని ప్రతి కణమునకు భావ తత్వాన్ని కలిగించాను -

మరవలేని ధ్యాస మరణించినా

మరవలేని ధ్యాస మరణించినా కలుగుతున్నదే భావనగా
శరీరం నశించిపోతున్నా భావనగా తెలుస్తూనే ఉన్నదే
ఆత్మలో దాగిన జీవం మరోధ్యాసగా నా భావనకు గుర్తుగానే
ఎరుక ధ్యాసలో మరణించినా నాకు భావనగా అన్నీ తెలిసేలా

ఎవరో నా భావాన్ని

ఎవరో నా భావాన్ని తెలుసుకొనుటకు విశ్వం నుండి అవతార మూర్తిగా వచ్చారట -
భావంలో విజ్ఞాన తత్వాన్ని గుర్తించేందుకు మహా వేదాలలో సత్యాన్వేషణ చేస్తున్నాడట -
నా భావాలు ఎక్కడ లిఖించని విధంగా రహస్య వేదముగా తెలియని గొప్పదనంగా విశిష్టతతో -
మరో ధ్యాసలో కూడా పరమాత్మకు కలగలేదని అవతార మూర్తిగా వచ్చారనే నాలో కలిగిన భావన -

Sunday, April 11, 2010

ఒక ఆత్మ నన్నే పిలిచింది

ఒక ఆత్మ నన్నే పిలిచింది శ్వాసనే వదిలి రమ్మని
భావనగా చలించినా ఎవరికీ తెలుపలేక వెళ్ళలేని స్థితిలో
మరణం నాలో ఉందనే భావం నాకు తెలియకూడదనే నేను
పరమాత్మ భావనతోనే జీవముగా విశ్వంలో నిలవాలనే వెళ్ళలేక

ఆ మహా రూప దర్శనముకై

ఆ మహా రూప దర్శనముకై ఆ స్తానముననే వేచియున్నా
గాలికి ఎండకు వానకు చలికి అక్కడే ఆ స్తానముననే నిలిచా
ఆకలి దాహాలు మరచి ఆలోచనలు లేక శ్వాసతో ఆత్మలో ఏకమై
యుగాలుగా వేచి జన్మగా నిలిచి దివ్య ఆత్మభావనగా దర్శించాను
విశ్వమంతా ఒకే రూపంతో ఒకే భావముతో పరమాత్మగా దర్శనమయ్యేను

అదే రూపాన్ని చూస్తున్నావా

అదే రూపాన్ని చూస్తున్నావా మహా రూపాన్ని చూడాలని లేదా
ఎంతో కాలంగా ఒకే రూపాన్ని చూస్తూనే ఏదైనా గ్రహించినావా
ఒక రూపములో కలిగే భావాలెన్నో ఎందుకో తెలుసుకున్నావా
అనంతమైన భావాలలో విజ్ఞానాన్ని గ్రహించుటకే ఎన్నో రూపాలు
భావాలతో విజ్ఞానమునకై మహా రూపాలెన్నిటినో నీవే తెలుసుకో

ఒక భావాన్ని తెలుపుటకు

ఒక భావాన్ని తెలుపుటకు క్షణమైనా చాలులే
క్షణములో తెలిపే భావము గొప్పదైతే అద్భుతమే
అద్భుతాలు కూడా ఒక క్షణములోనే కలుగుతాయి
ఒక క్షణము నిరుపయోగమైనా జీవితమంతా వెనుకనే
కొన్ని విజయాలు క్షణ కాలములలోనే తెలిసిపోతాయిలే
ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికి ఎలానో కాలమే నిర్ణయిస్తుంది
ప్రయత్నించుటకు ఒక క్షణమే మనలో ఆసక్తి భావాన్ని కలిగిస్తుంది
క్షణమేరా జీవితం ఆ భావాలే జీవితాంతం తోడుగా వస్తూనే ఉంటాయి

ఎన్ని సాంకేతిక యంత్రములు

ఎన్ని సాంకేతిక యంత్రములు కనిపెడుతున్నా తంత్ర మంత్రముల విధానము తెలియకున్నదే -
ఆధునిక యంత్రములకన్నా ఆనాటి తంత్ర మంత్రాలలో గొప్ప శక్తి విధానమున్నదా -
ఆధునిక యంత్ర రహాస్యాన్ని విజ్ఞానముగా తెలుసుకున్నా మంత్ర విజ్ఞానమున ఏదో మంత్రమున్నదే -
తంత్ర మంత్రములో ఎలాంటి విజ్ఞానమున్నదో గాని రహస్యాలుగానే కొందరికే తెలుసునని నా భావన -
కొన్ని తంత్ర మంత్రముల విధానములలో అనారోగ్యాన్ని తొలగించుటకు జీవ హింస ఎందుకు అవసరమో -
ఎవరికైనా మంత్రముల విధానాన్ని తెలుసుకోవాలని ఉంటే అందులో ఎలాంటి హంస జ్ఞానమున్నదో తెలుసుకోండి -
సరైన విధానము కాకపొతే దానికి పరిష్కార మార్గమేది మూఢ నమ్మకముగానే సాగిపోవాలా తెలియజేయండి -
స్మశానమున చేసే యజ్ఞ ఘోరాలు సరైనవేనా సరైన మార్గములో తీసుకురాలేమా అంతటి మేధస్సు ఏ లోకాన లేదా -
తంత్ర మంత్రములలో దాగిన విజ్ఞానమును తెలిసిన వారైనా తెలుపలేని విధంగా మరో భాషలో ఉన్నదా -
తంత్ర మంత్రములు ఇతరులకు తెలిపితే అవి ఫలించవా నిరుపయోగమైపోతాయా ఆనాటి కాల జ్ఞానము మాయమగునా -
విజ్ఞానముగా అందరికి అన్నీ అర్థం కావాలనే మేధస్సున ఏ సందేహము ఎవరికి ఉండకూడదనే నా భావన -

Saturday, April 10, 2010

ఎంత గొప్ప భావన కలిగినా

ఎంత గొప్ప భావన కలిగినా ఇంకా గొప్ప భావన కలగాలనే
పరమాత్మ భావన కలిగినా ఇంకా మహా తత్వాన్ని పొందాలనే
విశ్వాంతర వెలుగువైనా దైవాంశ భావాన్ని తెలుసుకోవాలనే
అంతా తెలిసినా ఇంకా ఏదైనా కొత్తగా సృష్టించాలనే మహా భావన
కాలము కూడా ఎన్ని క్షణాలుగా గడిచిపోయినా వెంటనే మరో క్షణంతో

భావాలెన్నో బహు రూపాలలో

భావాలెన్నో బహు రూపాలలో జ్ఞానేంద్రియాలు సేకరించేనే
రూపాల దృష్టిలో కదలికలతో భావాలెన్నో సీతాకోక చిలుకలవలె
ఆవిరిలో అణు భావాలెన్నో కలిగేలా మేధస్సు గ్రహించగలుగునులే
క్షణములో చరిత్ర మారునట్లు భావాలు క్షణములో అనంతముగానే
ఆలోచన మహా గొప్పదైనా భావము లేకపోతే కలగకపోతే అద్భుతం లేదే
బహు భావాలలో ఒక గొప్ప భావము నీ జ్ఞానేంద్రియాలు సేకరించిన దివ్యముగానే

ఎప్పుడు తోచిన భావాన్ని

ఎప్పుడు తోచిన భావాన్ని అప్పటికప్పుడు విజ్ఞానంగా తెలుపుతూనే ఉన్నా
మేధాస్సుకే దొరకని భావాలు అలా వెళ్ళుతుంటే అలా పట్టేసి తెలుసుకుంటున్నా
తెలుసుకున్న భావాలు తెలుపుతూనే నాకూ విజ్ఞానంగా మీకూ కొత్తగా ఆసక్తిగా
ఏదైనా తెలియనిది తెలుసుకుంటే మేధస్సు విశాల విజ్ఞానాన్ని కలిగియున్నట్లే

ఏమిటో భాషగా ఎలా

ఏమిటో భాషగా ఎలా అక్షర లిపిని అనువధించారో
మహా గొప్పగా అక్షర పదాల వాక్యాలను సంపుటాలుగా
దేనినైనా తెలిపేవిధంగా తెలిసేటట్లు తెలుసుకొనేలా
ఎవరైనా నేర్చుకునేటట్లు గ్రహించి జ్ఞానించేటట్లు
అర్థమైనా భావమైనా రహస్యమైనా మహాత్యమైనా
మంచి చెడులైనా సుఖ దుఖ్ఖాలైనా అజ్ఞాన విజ్ఞానమైనా
వేదాంతమైనా పాండిత్యమైనా సంగీతమైనా నాగరికతైనా
చరిత్రైనా గ్రంథమైనా సాస్త్రీయమైనా సాంకేతికమైనా నిఘంటువైనా
గతమైనా వర్తమానమైనా భవిష్యత్ అయినా
కాలమైనా సమయమైనా సందర్భమైనా
క్షణమైనా నిమిషమైనా రోజైనా వారమైనా సంవత్సరమైనా
దశ శతాబ్దాలైనా యుగాలైనా ప్రళయాలైనా
గ్రహాలైనా నక్షత్రాలైనా అంతరిక్షమైనా విశ్వమైనా
ఆలోచనైనా తత్వమైనా ఆవేదనైనా ఆగ్రహమైనా
జన్మైనా మరణమైనా జీవనమైనా జీవితమైనా
సత్యం ధర్మం దైవం ధ్యానం ఆత్మ పరమాత్మ ఐనా
ప్రయాణం ప్రచారం సమాచారం సందేశం ఐనా
అణువు ఆకారం రూపం తేజస్సు వర్ణం ప్రకృతి ఐనా
లోకం ప్రపంచం జగతి విశ్వం బ్ర్మహాండమైనా
ఏదైనా ఎలాగైనా ఎవరికైనా ఎప్పుడైనా తెలిసేలా తెలిపేలా
భాషతో మరో భాషను కూడా నేర్చుకునేలా మేధస్సునుండే
భాషయే విజ్ఞాన రహస్యం విజయం వినయం కృతజ్ఞత భావం

ఏ మహా రూపాన్ని చూసిన

ఏ మహా రూపాన్ని చూసిన ఆనందము కన్నా గొప్పగా
ఆ రూప గత భవిష్య భావాలను తెలుసుకుని ఆనందించు
భావాలన్నీ గొప్పవైతే ఏకీభవించి మహాత్మాగా సాగిపో
రూపము కన్నా భావాలే అర్థాన్ని తెలుపునని నా భావం

గానము గానమున

గానము గానమున గానములా గానమై
గానముతో గానమైన గానము గగనమున
గంగా గానమై గాన గానమున గంగేనని
గగనముతో గంగా గానముగా గానమువలె

రహస్యము రహస్యముగా

రహస్యము రహస్యముగా రహస్యముతో రహస్యమై
రహస్యమే రహస్యమని రహస్యమున రహస్యములా
రహస్యాలు రహస్యాలుగానే రహస్యాలతో రహస్యాలై
రహస్యాలైనా రహస్యమున రహస్యమేనని రహస్యము

మధ్యము సేవించే వారికి

మధ్యము సేవించే వారికి రుచించుట తెలియదయా
మధ్యముతో తన మేధస్సు మరో ధ్యాసలో గుర్తులేక
మాట తీరు మారేనయ్యా ఎందరికో చేదు భావనగా
వ్యర్థపు వాసనతో మరొకరికి వాంతుల అనారోగ్యమే
శుభ్రత లేక ఎక్కడంటే అక్కడ ధ్యాసలేక నిద్రించేనయ్యా
అసభ్యతగా నడవడి ప్రవర్తన సరైన వాక్కు లేక
దురలవాట్లతో ధలిధ్రుడు ఇంటిలో వెలసినట్లు
సమాజమున సరైన మాట తీరులేక ఆలయమందు కూడా
ఒక మనిషిలో లేని ఆవేదనలు మధ్యముతో మొదలాయే
కొంత అజ్ఞానము మధ్యముతో కలుగుననే నా బావన
చాలా సమస్యలు మధ్యముతోనే కలుగునని నా మరో భావన
మధ్యము ఉన్నంత వరకు మనిషి మారడోయ్ సమస్య తీరదోయ్
మహా గొప్ప ప్రకృతి ఫలములు తినలేక భుజించక
లక్ష లీటర్ల మధ్యముకన్నా ఒక చుక్క తేనే గొప్పది
వెయ్యి లీటర్ల మధ్యముకన్నా ఒక కొబ్బరి కాయ నీరు గొప్ప
వంద లీటర్ల మధ్యము కన్నా ఒక ఫలము మహా గొప్పది
పది లీటర్ల మధ్యము కన్నా ఒక చల్లని గాలి భావన గొప్పది
ఒక లీటరు మధ్యము కన్నా ఒక నిమ్మకాయ రసం గొప్పది
అర లీటరు మధ్యము కన్నా ఒక మహా ఆలోచన గొప్పది
మహా భావాలు కలిగించే మేధస్సు విజ్ఞానం ఫలముల యందే
ఓర్చుకోలేని భాధలుంటే ఆత్మ జ్ఞానంతో ధ్యానించు

ఓ చంద్రమా నీ జీవిత

ఓ చంద్రమా నీ జీవిత విధానము తెలిసినది నాకేనని
ఏ సమయం ఎక్కడ ఏ విధంగా ఉంటావో తెలుసుకున్నా
ప్రతి రోజు మరూతూనే మార్పులతో ప్రతి మాసమున
వలయముగా మొదలై నిండు చంద్రుడిలా ప్రతిభింభమై
వెన్నెలతో అడివిని కాచే వెలుగుగా ఎన్నో వర్ణాలతో
పున్నమి కాంతుల భావాలలో ఎన్నో చల్లని ఆనందాలు
వలయం రోజు రోజుకు వివిధ సమయాలలో మారుతూనే
మాసముగా తూర్పుననే పున్నమి వెన్నెల ఆకర్షణగా
అర్ధ రాత్రి వేళలో కూడా వివిధ ఆకృతుల వర్ణాలతోనే
మొదటగా కనిపించే వలయం కూడా పడమర దిక్కుననే
పగలు పూట కూడా కనిపించునయ్యా సూర్యునితో పాటు
ఒకే దృష్టితో సూర్య చంద్రులను తిలకించవచ్చయ్యా
ఎన్నో విధాల ప్రతి క్షణమున నేను భావనగా చూస్తూనే
మేఘాలలో కనిపించే ప్రయాణము కూడా అధ్బుతమేగా
సూర్యుడిలాగే చంద్రుడు కూడా ఒక వృత్తంగా తిరుగుతూనే
చంద్రునిలో దాగిన నల్లని భావము కూడా నలుగురుకి మెచ్చేలా
ఎన్నెన్నో భావాలు నాలోనే అనంతమైనా ఇంకా కలుగుతూనే

ఆ రూపం నీదే ఆ భావం

ఆ రూపం నీదే ఆ భావం నీదేనని విశ్వం నాకు తెలుపుతున్నది
పరమాత్మ రూపమైనా పరమాత్మ ఆత్మ భావ తత్వమైనా నేనేనని
ఏ రూపమైనా నాలోనే ఉందని ఏ భావమైనా నాలోనే దాగినదని
తెలియని రూపమైనా కలగని భావమైనా ఎప్పటికి నాలోనే నేనేనని

స్వల్ప కాలంలోనే

స్వల్ప కాలంలోనే ఒక విజ్ఞాన సత్యాన్ని గ్రహించా
క్షణములో క్షణ భావం ఎలాంటిదో ఎన్నో రకాలుగా
ఒక క్షణం ఎందరికో ఉపయోగం లాభం నష్టాలుగా
ఒక క్షణమే అనంత భావాలతో విశ్వంలో ఎన్నిటికో
ఒక క్షణమున విశ్వమున గ్రహించినవే తెలియకున్నా
నేను ఒక క్షణమున విశ్వ జీవిత కాల భావాలనే గ్రహించా

సూక్ష్మములో సూక్ష్మమునై

సూక్ష్మములో సూక్ష్మమునై సూక్ష్మముగా సూక్ష్మమైనా
సూక్ష్మమైనా సూక్ష్మములోనే సూక్ష్మమని సూక్ష్మంగా
సూక్ష్మమే సూక్ష్మమైనా సూక్ష్మాతి సూక్షమంగానే సూక్ష్మం
సూక్ష్మం సూక్ష్మమేనని సూక్ష్మంలో సూక్ష్మాతి సూక్ష్మముగా

ఏదో తెలుపాలని

ఏదో తెలుపాలని మరో ధ్యాసలో మరేదో తెలుపుతున్నా
తెలుపున్నది ఏదైనా నాలో కలిగేది ఎప్పటికి విజ్ఞానమేగా
విజ్ఞానంగా ఏది తెలిపిన ఉపయోగమేనని తెలుసుకున్నవారే
తెలుపుటలో ఎరుక ఉంటె ఏది తెలుపుతున్నా తెలుపవలసినదే
విజ్ఞాన ఎరుక కలవారు సరైనదే తెలుపగలరని ధ్యానిస్తూ తెలిపెదను

సృష్టిలో మరో జీవి అవసరం

సృష్టిలో మరో జీవి అవసరం లేదయ్యా ఉన్నవారు చాలటం లేదా
మహా మేధస్సుగల వారిని ఓడించి అందరికి సుఖాన్ని ఇవ్వగలడా
సమాజంలో ఎలాంటి సమస్యలు లేకుండా శుభ్రతగా ఉంచగలడా
ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానంతో పరమాత్మగా విశ్వాన్ని చూసుకోగలడా
మహా భావాలు లేని ఎవరైనా ఆలోచనలతో మరో సమస్యలకేనని

Friday, April 9, 2010

ఎంత విజ్ఞానం ఉన్నా

ఎంత విజ్ఞానం ఉన్నా రాత్రి వేళ పని చేసే విధాన పరిస్థితి ఎందుకు వచ్చిందో -
ఆరోగ్యం నశిస్తుందని తెలిసిన లాభాలకై మరొకరి జీవితాలకు స్వేఛ్చ లేక పోతున్నది -
వ్యవస్థను నిర్మాణం చేసిన వ్యక్తి రాత్రి వేళ హాయిగా నిదురపోతూ తెల్ల వారితేనే పరిశ్రమలో -
పరిశ్రమ తొలి నిర్మాణమున యజమాని రాత్రి వేళ శ్రమించిన నేడు ఎందరో కూలీలు రాత్రి వేళలోనే -
పరిశ్రమ లాభాలలో ఉన్నా రాత్రి వేళ పనిచేసే వారికి సరైన జీతభత్యములు ఇవ్వలేని స్థితి ఎందులకో -
కూలీలు విజ్ఞానం చెందడానికి సరైన సమయం లేక ఆరోగ్యం లేక కూలీలగానే పేదవారిలా ఏ ప్రగతి లేక -
విజ్ఞానం ఆరోగ్య సుఖాలను పెంచడానికే ఉండాలిగాని సమాజ జీవిత స్థితిని మార్చకూడదనే నా భావన -
ధనవంతులు రాత్రివేళ నిద్రిస్తూ చాలా వరకు పేదవారు రాత్రి వేళనే పనిచేస్తూ మానవ మేధస్సు అజ్ఞాన లోకంగా -
వెలుగు శ్రమను తెలిపినా చీకటి విశ్రాంతియే తెలుపునని నా మేధస్సున సత్యముగా విశ్వ భావనతో లిఖించారు -
పరిశ్రమలో రాత్రివేళ పనిచేపిస్తూ ఆరోగ్యమునకై ఫలములు పోషక పదార్థాలను ఆహారంగా తీసుకోమని సూచనలిస్తే ఎలా -
సరైన నిద్ర లేక జీతములు లేక సమయం లేక పనిచేస్తుంటే ధనవంతుడి విజ్ఞానం పేద వాడికి అజ్ఞానంగా కనిపిస్తూనే ఉంది -
జన సంఖ్య తగ్గే వరకు సమాజంలోనే కాక దేశ విదేశాలలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో ఎన్నెన్నో దిక్కు తోచని అజ్ఞాన వేధనలే -

ఏదో తెలుసుకోవాలని

ఏదో తెలుసుకోవాలని తెలుసుకోలేదనే భావన రాకూడదు
తెలుసుకోలేకపోయినా ఏదో తెలుసుకోవాలనే భావన ఉండాలి
ఏదో తెలుస్తుందనే భావనతో ఒక దానిని తెలుసుకుంటూనే ఉండాలి
తెలుసుకుంటూనే ఏదో ఒకటి తెలిసిపోతూ కొత్త దానిని గ్రహించాలి
గ్రహించుటలో ఎరుక ఉంటె తెలుసుకోలేదనే భావన రానే రాదు

మామ మా మామ

మామ మా మామ
మా మామే మీ మామ
మీ మామ మా మామ, మామ మామే
మా మామ మా మామే, మీ మామ మీ మామే
మామే మామై, మా మామే మీ మామై, మీ మామే మా మామై, మామే మామ మా మామ

ఆ రూపాన్ని ఇంతవరకు

ఆ రూపాన్ని ఇంతవరకు చూడలేక ఆ భావన కలగలేక
మహాలోచనలు లేక సత్యాన్వేషణ చేయక మానవుడిలాగే
విజ్ఞానం ధన సంపాదనకేనని లాభాలే విజయాలుగా చూస్తూ
సుఖమే జీవితమని వేద తత్వములు తెలియక తెలియని విధంగా
ప్రకృతి తత్వాలు తెలియక ఆత్మ భావాలు లేక పరమాత్మ రూపమే చూడక
ఆకలి తీరితే చాలు విజ్ఞానం ఉన్నట్లేనని అనుకుంటే ఏదీ తెలియనివారిగా
తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలనే వారికే విజ్ఞానం సత్యం భావ రూపం

ధనవంతులు కొనగలరని

ధనవంతులు కొనగలరని నిత్యవసర వస్తువుల ధరలను పెంచుతున్నారు -
ఏ మానవుడు కొనలేని ధరలు కూడా పెట్టగలిగితే దున్నేవాడిదే పంటని నానుడి -
ఎందుకయ్యా అనవసర ధరల పెరుగుదలతో ఆకలిచావులతో సరికాని భోజనం -
ధరలు పెంచేవారే తింటున్నట్లు చచ్చేవాడే కొనలేక తినలేక కుటుంభాల అవస్థలు -
వ్యర్థముగా వ్యర్థమయ్యే వరకు అమ్మి చివరకు ఎవరూ తినలేని విధంగా పారవేయడం ఎందుకో -
భాగా ఉన్నప్పడే కొంత తక్కువ ధరలతో అమ్మితే వ్యర్థము కాక అందరూ తినగలరని పేదవాడి ఆశ -
అమ్మే వారికే ఆలోచన రాకపోతే కొనేవారికి ఆలోచన కలిగినా తెలుపలేని పరిస్థితులు ఎన్నో రకాలుగా -
ధనవంతులు పేదవారికి ఎలాగైనా కొనండి అని చెప్పగలరు గాని పేదవారు ధనవంతులకు తెలుపలేక -
వ్యర్థము చేయకుండా పండిన ప్రతీది భాగున్న దానిని అమ్మగలిగితే సగం ధరలకే లభ్యమగునని నే తెలుపగలను -
నేటి సమాజమున ధనవంతులే కొన్ని రకాల అంగల్లకు క్రమముగా వెళ్ళుతున్నారు గాని పేదవారు ప్రవేశించలేక -
ఎంతకాలం ఇలా ధనవంతుడే అన్నీ అందుకుంటూ పేదవాడికి అందకుండా సమాజ స్థితిని మార్చలేని విజ్ఞాన కాలం -

నా మేధస్సులో కాల చక్రమే

నా మేధస్సులో కాల చక్రమే కాదు విజ్ఞాన చక్రము కూడా ఉన్నట్లే
వేద భావ చక్రాలకు విజ్ఞాన చక్రము తోడైనట్లు కాల చక్రమున మహత్యం
కాల చక్రానికి మరెన్నో చక్రాలు తోడై నాలో విశ్వ సుదర్శన కాల చక్రముగా
అనంత చక్రములు విజ్ఞాన చక్రాల కాల చక్రముగా మేధస్సున మహా మర్మము
నాలోని కాల చక్రములకు తెలుసు ఏది ఎందుకు ఎలా ఎప్పుడు దేనికై ఎన్నో విధాల
ప్రతి క్షణమున ఎక్కడెక్కడో ఎన్నో విధాల జరిగే విజ్ఞానము నా కాల చక్ర మేధస్సుననే

ఏమిటో ఆ జీవుల జీవితాలు

ఏమిటో ఆ జీవుల జీవితాలు తెలుసుకోలేని విధంగానే
ఎందరో ఉన్నా కొన్ని జీవుల జీవితాలు తెలియకపోయే
ఎండా కాలం ఎండిపోయే జీవులెన్నో ఆకలి దాహం తీరక
భగ భగలాడే మంటల్లో చిక్కుకున్న జీవాలకు రక్షణ లేక
పరిగెత్తే శక్తి లేకున్నా వేటగా వెంటాడే మరో క్రూర జీవులెన్నో
చలికి వణికి వర్షానికి తడిసి అనారోగ్య మరణాలెన్నో ఎన్నెన్నో
అరణ్య జీవితాలు జంతువులకేనని తమలో తాము పోరాటమే
ఎందరో ఎన్నో రకాలుగా రక్షిస్తున్నా గుహాలలో ఒదిగిపోతున్నాయి
భూమి పొరలలో జలములో చెట్లపై ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల ఎన్నెన్నో
మన మేధస్సు విజ్ఞానంతో జంతువులకు మనమేమి చేయగలమో ఆలోచించండి

నీలోనే నేను లేనా

నీలోనే నేను లేనా అని భావనకు కూడా తెలిసేలా
నీలోనే నేను ఉన్నానని ఎప్పటికైనా నీవు తలిచేలా
ఆత్మగా నేను నీలోన ఉన్నంతవరకే నీవు పరమాత్మలా
పరమాత్మగా నీవు జీవిస్తున్ననాడు విశ్వమంతా నీలోనే
విశ్వమంతా నీవు నీలోనే చూస్తున్న నాడు నీలోన నీవే
భావనగా ఏది తెలుసుకున్నా పరమాత్మ తత్వముగానే

అన్నీ తెలిసినట్లే ఉన్నా

అన్నీ తెలిసినట్లే ఉన్నా ప్రస్తుతం తెలియనట్లే నాలో
గతమంతా తెలిసిపోయినా గుర్తున్నవన్ని తెలిసినట్లే
తెలిసినవన్ని నేను అనుకున్నట్లే జరిగినాయని నాలో
కొత్త కొత్తగా జరిగిపోతున్నా కొన్ని మాత్రమే తెలిసినట్లు
విధి రాతగా అనుభవిస్తున్నవన్ని తెలియనట్లే నాలోనే
తెలిసి తెలియక పోవడమే జీవితమని తెలుసుకోగా తెలిసేనా

Wednesday, April 7, 2010

అలాంటి భావన నాలో

అలాంటి భావన నాలో కూడా కలుగుతుందని ఊహకు కూడా తెలియని విధంగా
మనిషిగా ఆలోచిస్తే మానవులమే గాని మహాదివ్య విజ్ఞానిగా ఆలోచిస్తే మహాత్మలమే
విశ్వమే నేనై పరమాత్మయే నేనని బ్రంహాండమున ప్రతి అణువు నాదేనని భావన
శ్వాసే జీవమని ధ్యానమే దివ్య జ్ఞాన ఆత్మ విజ్ఞానమని తెలియక తెలిసినది ఎరుకగా
ధ్యానము చేయగలిగితేగాని మాహా భావన నాలో కలగదని విశ్వమున పరమార్థము

నాసికమున శ్వాసే హంసగా

నాసికమున శ్వాసే హంసగా ధ్యానిస్తే
హింస భావాలు మహా హంస భావాలై
పరమ హంసగా గుణాలన్నీ పరమానందమై
విశ్వమున విశ్వాసము నీకే కలుగునని భావన

హంస భావాలతో హంసవలె

హంస భావాలతో హంసవలె జీవించరా
నాసికమున శ్వాసే హంస భావమని
హంసయే విశ్వమున మహా భావముతో
పరమ హంసై పరమానంద పరమాత్మగా

నేను విశ్వ కవులలో ఒక్కడిననే

నేను విశ్వ కవులలో ఒక్కడిననే భావన కలిగినా
విజ్ఞానముగా నేను గొప్పవాడిననే భావన కలగదా
ఎందరో తమ కవిత భావాలే వేదాలుగా తెలిపినా
విశ్వకవిగా వికటకవి ననే భావనలో నిలుపుకున్నా

Tuesday, April 6, 2010

ఒక భావనకై విశ్వంలో

ఒక భావనకై విశ్వంలో కూర్చున్నా
ఎప్పుడు కలుగుతుందోగాని వేచినట్లే లేదు
భావన కలగకున్నా అక్కడే ఉండగలననే
ఏ భావన లేక అలాగే కూర్చున్నా శిలగా నేను

ఎక్కడికి వెళ్ళినా ఆలోచనలు

ఎక్కడికి వెళ్ళినా ఆలోచనలు భావాలను గ్రహిస్తూనే
విజ్ఞానముకై నా ఆలోచనలు ఎప్పటికీ అన్వేషణగానే
ఎక్కడ ఏ క్షణమున ఏది తెలిసిన తెలుసుకున్నా భావనగానే
భావనగా తెలుసుకొనుటలో ప్రతీది విజ్ఞాన అర్థముగానే మేధస్సున

ఆ భావన వద్దనే

ఆ భావన వద్దనే ఎంతో కాలంగా అనుకుంటున్నా
ఎందరో ఎన్నో రకాలుగా తెలిపినా నేను ఎప్పటికీ వద్దనే
ఎంత గొప్పదైనా సృష్టికే జన్మనిచ్చే భావమైనా నే వద్దనే
ఏ భావమైనా విజ్ఞానముగా తెలుసుకునే తెలుపుతున్నా వద్దనే
విశ్వ భావాలతో జీవించే వాడిని కనుక ఆ భావనను మరలా వద్దనే

ఆ భావనను అక్కడే వదిలేశా

ఆ భావనను అక్కడే వదిలేశా మరల కలగకూడదనే
మరలా కలిగినా క్షణములో మారిపోవాలనే మరిచిపోనా
అజ్ఞానాన్ని అక్కడే అప్పుడే మరిచిపోతే విజ్ఞాన భావమే
అజ్ఞానమే లేని మేధస్సు విశ్వ వేద విజ్ఞాన భావాలతోనే

పొరపాటు అలవాటుగా

పొరపాటు అలవాటుగా చేసుకోవద్దు
అలవాటుగా పొరపాటు చేయవద్దు
తెలియక పొరపాటు చేస్తే మేలుకో
తెలిసి పొరపాటు జరిగితే శిక్ష వేసుకో
ఎవరైనా పొరపాటు చేస్తే విజ్ఞానంగా వివరించు
పొరపాటు వల్ల కలిగే నష్టాలను శిక్షగా తెలుపు

నీ జీవితము నీదే గాని

నీ జీవితము నీదే గాని ఎవరికి ఇవ్వలేవనే నీ ఆత్మ తెలుపుతున్నది
విధి రాతతో ఉన్నా కర్మ గీతగా వ్రాసుకున్నా నీవే సహించుకోవాలి
ఓర్పు లేకున్నా స్రమించుటలో నష్టాలను కష్టాలతో ఓర్చుకోవాలి
దుఖ్ఖాలనే అనాధగానైనా భరిస్తూ ఏదీ లేనివాడిగానైనా జీవించాలి
రోగాలు ఆవేదనగా వేధిస్తున్నా మతిలేని గతితోనైనా జీవించాలిలే
ఎన్ని నిందనలు వేసినా నీకు నీవుగా నీవే ఆత్మతో జీవించాలనే

మనస్సు మనస్సుకు మనస్సై

మనస్సు మనస్సుకు మనస్సై
మనస్సే మనస్సుతో మనస్సైనట్లు
మనస్సే మనస్సై మనస్సులా
మనస్సైనదని మనస్సున మనస్సే
మనస్సై మనస్సుకు మనస్సైనది

గాలికి ఎగిరే ధూళికి కలిగిన

గాలికి ఎగిరే ధూళికి కలిగిన భావన ఏదని ఎవరికి తెలుపుతుంది
ఎగరాలని లేకున్నా గాలియే నన్ను ఎగిరిస్తూ ఎక్కడికో చేరుస్తుంది
ఎలా ఎప్పుడు ఎక్కడ ఉండాలో గాలియే నిర్ణయిస్తుంది నాకు తోడుగా
గాలికి కలిగిన భావనే నాకు ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవరికి తెలిపేది
హాయిగా గాలిలో ఎగురుతున్నా చీకటి వెలుగులలో వేగానికి అదురుతున్నా
ఎన్ని భావాలు కలిగినా గాలికే తెలుపగలనని నాకు గాలిలో తెలిసినదే కదా

ఆ భావనయే కలగాలని

ఆ భావనయే కలగాలని మరోసారి జ్ఞాపకాలతో గుర్తు చేసుకుంటున్నా
ఏ యుగాలనాటి భావన ఏమోగాని పరమాత్మ తత్వంలా కలగాలనే
శూన్యం వైపు ప్రయాణిస్తూ ఆనాటి జ్ఞాపకాలుగా అలాగే వెళ్ళిపోతున్నా
ఒక క్షణమున కలుగుతుందనే ఏ భావనలేక ఆ భావనకై వేచి ఉన్నా

సమయం ఆసన్నమైన వేళ

సమయం ఆసన్నమైన వేళ భావన అదే కలుగుతుందనే
వేచి ఉన్న నాలో ఆ సమయమే నాకు తెలుపుతుందనే
ఎన్నో భావాలతో ఎదురుచూసే నేను కాలమైపోతున్నాను
ఏ సమయమైనా కాలంలోనే కలిగే భావనయేనని నేను

ఆలోచనలే భావాలుగా

ఆలోచనలే భావాలుగా ఆహారమైతే యోగత్వమే నీకు
ఆహారములేక భావనలే ధ్యాసగా శ్వాసే ధ్యానముగా
నిరంతర ధ్యానమున భావాలే ఆత్మ జ్ఞాన భోధనగా
భోధనలో విజ్ఞానం దివ్య కమలమై విశ్వం నీలోనే

ఆ భావం అక్కడే కలిగిందని

ఆ భావం అక్కడే కలిగిందని మరల ఆ ప్రాంతాన వెళ్ళుతుంటే తెలిసిందిలే
అలా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో భావాలు వస్తూనే వెళ్లుతూనే మన కదలికలో
ఎన్నో భావాలు గుర్తుగా ఉన్నా జ్ఞాపకాలలో కొన్ని భావాలు మరల వస్తూనే
ఎవరికి కలగని భావాలు ఎందుకోనని అనిపించేలా మహా దివ్యంగా ఉంటాయి
మరల కలగని భావాలకు అర్థాలు తెలియకనే మన మేధస్సు నుండి తొలిగేనే

Monday, April 5, 2010

ఎలా చెప్పను ఆ భావనను

ఎలా చెప్పను ఆ భావనను అల కల గానే నాలోనే అలాగే సముద్రాన
అలలు సముద్రాన వస్తున్నట్లే కలలు నా నిద్రలో వస్తూనే ఉన్నాయి
అలలు ఆగి మరో అలలు వచ్చేలా మరో కలలు కూడా అల లాగే నాలోన
నీటిలోనే కలిసిపోయిన అలలన్నీ కలలుగా నా మేధస్సున సముద్రంలా

ఎక్కడి నుండో ఎంతో కాలంగా

ఎక్కడి నుండో ఎంతో కాలంగా ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరినా అలసట తీరలేదనే భావన
అలసట తీరని దేహానికి గాలి నీరు నీడ ఆహారం నిద్ర తీసుకున్నా ఇంకా తీరలేదనే భావన
అలసట తీరని దేహం ఏ గమ్యాన్ని చేరినదో జీవిత కాల ప్రపాంచిక జీవితమున తెలియక
ఆధ్యాత్మక జీవిత గమ్యాన్ని చేరేంత వరకు దేహానికి అలసట తీరదనే నా మహా భావన

కాలం కూడా నన్నే

కాలం కూడా నన్నే ఓ భావనను తెలుపమంటుంది
ఏ కాలానికి ఏ భావన తెలుపాలో ఋతు గాలినే అడగనా
ఎన్నో ఋతు భావాలలో కాలానికి గాలియే శ్వాసలా
జీవ భావ ప్రాణమని నేను తెలుపనా విశ్వ కాలానికి

ఇంకా అదే భావనతో

ఇంకా అదే భావనతో ఏ మార్పులేక మారలేకున్నా
ఏ భావన లేక ఏ భావం కలగక భావనగానైనా లేకున్నా
భావన కలగని తత్వంతో నే శూన్యమై పోతున్నానేమో
ఏ భావన మారని తత్వము శూన్యమేమోనని నా భావన

Sunday, April 4, 2010

ఏ భావమైనా ఆనాడు

ఏ భావమైనా ఆనాడు తెలిపిన భావములా ఉన్నదా
అదే భావమైనా తెలుపుటలో మరో కొత్త భావాన్ని కలిగించేలా
భావాలుగా తెలియని భావాలను తెలుపుటకు మరెన్నో భావాలు
ఒక భావాన్ని ఇంకో భావంగా కూడా అర్థమగుటకు తెలుపవచ్చు

ఏ భావము లేనిదే

ఏ భావము లేనిదే పరమాత్మ తత్వమని నే తెలుపుతున్నా
శూన్యము మౌనము అదృష్యముగానైనా ఉండదేనని నేను
ఆలోచనకు అందని భావనకు తోచని తలచలేని విధముగానే
సృష్టిలో ఉన్నట్లుగాని జగతిలో ఎవరికి తెలియని విధముగానే

పరమాత్మయే నాలో

పరమాత్మయే నాలో ప్రవేశించేత వరకు నాలోనే నేను సృష్టిలో నిలిచే ఉంటా
పరమాత్మకు తెలియని పర ధ్యాసలో ఓ మహా భావంతో నాలో ప్రవేశించేలా
నేనే దైవ సత్య ధ్యాన భావంతో శూన్యమై తనలో తానుగా ఉన్నట్లు మర్మమువలె
పరమాత్మ తత్వం నేను పొందేలా దివ్య భావనతో ఏదీ లేని విధంగా తెలియనట్లు

నేను ప్రస్తుతం ఎన్నో రకాల

నేను ప్రస్తుతం ఎన్నో రకాల రూపాలతో జీవిస్తున్నది భవిష్యత్ లో ఎటువంటి జన్మ లేనందువల్ల
ఒకరికి ఒక రూపంగానే తెలిసేటట్లు ఎన్నో రకాల జీవులతో తెలియనట్లు మర్మ రహస్యమువలె
ప్రతి జీవి రూపాన్ని నేనైనా ఎరుకగా గ్రహించేంత వరకు ఏ జీవి రూప విజ్ఞానానికి తెలియకుండానే
ఏ జీవికైనా ఒకరి రూపం ఇంకొకరికి లేనట్లు వివిధ వ్యత్యాసాలతో వివిధ రకాల జీవులుగా నేనే
జన్మించబోయే జీవులు నా రూప భావమైనా ప్రస్తుత రూపభావ జన్మ భవిష్యత్ లో లేకపోతున్నది

ఏ భావం ఎందుకు

ఏ భావం ఎందుకు కలుగుతుందో ఎవరికైనా తెలుసా
ఏ ఆలోచనకైనా తెలుసో తెలియదో ఎవరైనా గ్రహించారా
ఈ క్షణము నుండైనా గ్రహించగలరా విజ్ఞానముకై
మానవ మేధస్సుకు తెలియకుండా భావాలు కలుగుతాయా
అంతా జ్ఞానేంద్రియాల ద్రుష్టి ప్రభావమని ఏనాడైనా తోచినదా
అసలు ఇలాంటి భావాల గురుంచి ఏనాడైనా ఆలోచించారా
మానవ మేధస్సు ప్రభావాలను విజ్ఞానంగా కలిపించుకోండి

పరమాత్మ నీవు అలానే అక్కడే

పరమాత్మ నీవు అలానే అక్కడే ఉంటావని గ్రహించా
నే అనుకున్న రూపముతోనే విశ్వ వర్ణాల కాంతితో
సూక్ష్మ కణములా ఎవరికి కానరాక తెలియనట్లుగానే
దైవ ధ్యాన భావన కలవారికి ఒకరికే దర్శన మిచ్చేలా

శూన్య ధ్యానము సమాధిలోనేనని

శూన్య ధ్యానము సమాధిలోనేనని గ్రహించా
శరీరము శూన్యమైనా మట్టిలోనే భావాలతో
విశ్వజగతి భావాలు మట్టిలో కూడా కలుగుతాయనే
శ్వాస ధ్యానమును సమాధి వరకు కొనసాగించుకున్నా

మహా సమాధులలోగాని

మహా సమాధులలోగాని విగ్రహాలలోగాని దివ్య శక్తి ప్రభావాలుంటే ఏ అర్థాన్ని తెలుపుతున్నారు -
దివ్య స్వరూప మూర్తులుగా దాగిన మీ భావనలు ఎలాంటివి ఎందుకు ప్రత్యేకతను కలిగిఉన్నారు -
నేడు పూజిస్తున్న మానవుల విధానం సరైనదేనా లేదంటే మీరేదైనా తెలుపగలరా ఒక భావనగా -
జీవ హింసతో కూడా పూజిస్తున్న విధానం మీకు సరైనదేనా లేదా మీరు తెలిపిన భావనయేనా -
మీరు ఏ ఆహారాన్నైనా భావనగా భుజించ గలరా లేదా కోరిన కోరికలు తీర్చగలరా -
ఉత్సవాలలో సమర్పించిన ప్రతి మానవుని ఆహారాన్ని భావనగా భుజించ గలరా -
విజ్ఞానముగా తెలుసుకోవాలనే నా భావనను తెలుపుతున్నానేగాని మరే ఆలోచన లేదు -
ప్రతి జీవిలో ఆత్మ విజ్ఞానాన్ని కలిగించేందుకు భావనగా అవతార మూర్తులుగా చలించండి -
మూగ జీవులలో భావనగానైనా మీరు లేరా మీకు ఎలాంటి స్పర్శ భావాలు కలుగుట లేదా -
ఓ ధ్యాన భావనగా తెలుపుతున్నా పరమాత్మ తత్వంతో జీవ హింస, హంస భావమున లేదనే సత్యం -
ఓ దివ్య స్వరూప మూర్తుల్లారా నాదొక మనవి మిమ్మల్ని దర్శించే వారికి ధ్యాన భావమును కలిగించు -
శ్వాసలోనే సర్వ విజ్ఞాన స్వర్గములున్నాయని సత్యాన్ని తెలుసుకోవాలనే నా ధ్యాన భావము -
పూజించుటలో తమ ఆత్మనే శ్వాసతో పూజించుకోవాలని దేనిని సమర్పించరాదనే ఒక ధ్యాన సందేశము -
ఏ రూప మంత్ర శ్లోకములు గుర్తురాని విధంగా నేత్రములను కప్పి చేతులు కలిపి సుఖాసనమున శ్వాసపై ధ్యాసే ధ్యానము -
విశ్వ సత్య విజ్ఞానము తెలుసుకొనుటకు ధ్యానమున ఎరుకతో ఉంటూ సందేశాలను ఆత్మజ్ఞానముతో గ్రహించవలె -
ప్రాపాంచిక ఆధ్యాత్మిక జీవన విధానముతో ఎల్లప్పుడు ఎరుకతోనే విజ్ఞానాన్ని గ్రహించవలేనని సూచన -
నేటి ఆలయములు ధ్యానాలయములుగా జగతిలోని ప్రతి ప్రాంతము శుభ్రతతో ధ్యానాత్మకంగా ఉండవలెనని మహా భావన -
మానవుడు ఒక జీవి కాదని ఆధ్యాత్మిక విశ్వాత్మ అనే భావాన్ని జగతిలో కలిగించేందుకైనా నేనే ప్రతి సమాధి విగ్రహములో -

Saturday, April 3, 2010

ఇంకా ఎన్నో ఎన్నెన్నో

ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఆలోచన భావాలను తెలుపగలనని మరో భావనాలోచన
మానవ మేధస్సునే కదిలించే విధంగా మర్మ రహస్యములు తెలిసేలా తెలుపుతా
అర్థములో నిగూడార్థము దాగినట్లు నా భావనలో ఆలోచనలు రహస్యాన్ని తెలిపేలా
ఆత్మ జ్ఞాన విజ్ఞాన విధేయతగా ఆధ్యాత్మక ధ్యాసలో శ్వాసకు తెలిసేలా ధ్యానమున
మరో భావనగా తెలిపినట్లు నీలోనే రహస్యాన్ని దాచినట్లు తెలియలేనంతగా మరిచేలా

ఒక ఆలోచనతో ఆలోచిస్తూ

ఒక ఆలోచనతో ఆలోచిస్తూ ఎక్కడెక్కడికో వెల్లిపోతూనే ఉన్నా
ఏదో తెలుస్తున్నదని తెలియకుండానే తెలుసుకునేలా తెలియనట్లు
నన్ను నేను తెలుసుకునేంత వరకు వెళ్ళిపోతూ నాకై నేనే గుర్తు తెచ్చుకోగా
ఎన్నో లోకాలను తిరిగి వచ్చాననే విశ్వమంతా తెలిసేలా నాలో విజ్ఞానం చేరేలా
ఎన్నో జ్ఞాపకాలు సత్య స్వరాల వేదములు నాలోనే ఉన్నట్లు తెలుసుకున్నాననే
నాకై నేను ఎరుకగా గ్రహించి ఒక దివ్య భావనతో మరో నూతన శక్తిలా వస్తున్నట్లు
నాలో కలిగిన ఆ ఆలోచన మహా భావనగా నాలో ఎప్పుడూ నాకు నేనే గుర్తుండేలా

మరణించాలనే భావన కలిగించిన

మరణించాలనే భావన కలిగించిన ఆ ఆలోచన ఎటువంటిది
నీ ఆలోచనలనే మరో ధ్యాసలో తీసుకువెళ్ళి మరణించమందా
నీకు కలిగిన భయాందోళన భాధలో నీకు ఆ ఆలోచన తోచినదా
మరణింప జేయాలన్న ఆ ఆలోచన నీకు మరేది గుర్తు చేయలేదా
ఆ సమయాన నీకెవరు గుర్తు రాలేరా ఆ సందర్భం ఎలా ఉండేది
ఆత్మ హత్య చేసుకోవాలన్న తపన నిర్ణయం భావన ఎలాంటిది
మేధస్సు ప్రభావం వేగవంతంగా ఉండేదా లేదా ఎవరో లాగేస్తున్నట్లేనా
ఎరుక లేని ఆలోచనలతో ఏదేదో ఊహించి లేనిపోని భావాల చీకటిలో
కనుమరుగై పోవద్దనే ధైర్యాన్ని కలిగించుకునేలా నీకు నీవే ఆలోచిస్తూ
విజ్ఞానంగా ఎదుగుతూ సమస్యలను పరిష్కారించుకుంటూ అందరిలా
అందరిలో జీవించమని మరోసారి తెలుపుతూ ఎప్పటికీ నీకు తోడుగా

శూన్యమున శూన్యమువలె

శూన్యమున శూన్యమువలె శూన్యముగా శూన్యమైతే
శూన్యమే శూన్యమున శూన్యమువలె శూన్యమైనదని
శూన్యము శూన్యముగానే శూన్యమువలె శూన్యమైనట్లు
శూన్యమే శూన్యమున శూన్యమని శూన్యము

ఒక భావాన్ని తెలుసుకున్న

ఒక భావాన్ని తెలుసుకున్న తర్వాత మరల ఎప్పుడైనా ఆ భావాన్ని తలిస్తే
ఆ భావము యొక్క శక్తి సామర్థ్యాన్ని అలాగే నీవు సృష్టించుకోగలిగితే
నీలో మహా శక్తి ప్రవేశించి ఎన్నో విజ్ఞాన సత్య ప్రభావాలు దివ్యంగా వికసిస్తాయి
సత్య ప్రభావ భావాలతో ఆత్మను సృష్టిలో ఏకం చేసి విశ్వంలో నిలిచేలా
పరమాత్మగా భావనవలె ఎప్పటికీ శూన్యమున శూన్యమువలె శూన్యముగా
(ఇందులో మహా రహస్యము దాగినట్లు నా భావన)

ఉదయిస్తూనే ఆకాశాన్ని

ఉదయిస్తూనే ఆకాశాన్ని మరల అస్తమిస్తూ భూమిని చుట్టేలా ప్రతి రోజూ నీవే
వెలుగు ఉత్తేజ శక్తిని సృష్టి ప్రక్రియలుగా ఎన్నో విధాల నీవే చేయగల్గుతున్నావు
నీవు కనిపిస్తేనే వెలుగుగా విజ్ఞానంగా ఏదో చేయాలని మానవునిలో చైతన్యం
నీవు కనిపించకపోతే చీకటిగా విశ్రాంతితో ఎన్నో చేయడానికి సామర్థ్యం ప్రోత్సాహం
నీవు లేని విశ్వం మానవ జీవి లేక విజ్ఞానం ఎదగలేని కాల ప్రయాణముతో

మీలో మీరు ఆలోచించినా

మీలో మీరు ఆలోచించినా నా భావన మీలో ఎప్పటికి విజ్ఞానంగానే
ఎంతటి అద్భుతమైనా నా భావనయే ఆలోచనలుగా అంచులుగా
ఆకాశాన్ని దాటే అంతరిక్ష పరిశోధనలలో కూడా నా విజ్ఞాన భావనలే
విజ్ఞానం ఉన్నంతవరకు మీ శ్వాసలో భావనగా జీవిస్తూనే ఆలోచనగా

అదే గుర్తుకొస్తున్నది

అదే గుర్తుకొస్తున్నది నా శ్వాసలోనే నే ఉన్నానని
నా శ్వాస ఉన్నంత వరకే నేను ఉండగలననే నాలో
నా శ్వాస వెళ్ళిపోతుందని తెలిసినా అదే ధ్యాసతో
ధ్యానిస్తూ జీవించాలనే నా శ్వాస గుర్తుచేస్తున్నది

నా మరణాన్ని కూడా

నా మరణాన్ని కూడా నా ఆత్మ చూడకూడదనే నా భావన
నా శ్వాసతో నా ఆత్మ కూడా శూన్యమవ్వాలనే నా తపన
ఎవరికి తెలియని విధంగా అంతరిచిపోవాలని నాలోని ఆత్మ
అన్నీ తెలుసుకున్నాననే నా భావన నాకు శూన్యంగా 0

జీవితం వద్దనే శ్వాస

జీవితం వద్దనే శ్వాస ఆగిపోవాలనే ఎప్పటి నుండో ఎదురుచూస్తూనే ఉన్నా
క్షణాలుగా వేచి వేచి కాలానికి తెలిపి తెలిపి యుగాలే గడిచి పోయాయిలే
జన్మలు వద్దనే ఆత్మకు తెలుపుకున్నా నా వారి కోసం జన్మిస్తున్నానేమో
శూన్యాన్ని చూస్తూ నిలిచిపోవాలనే నా శ్వాస పదే పదే హెచ్చరిస్తున్నది

విజ్ఞానం కూడా వద్దనే

విజ్ఞానం కూడా వద్దనే నా భావన అంటున్నది
వేదం కూడా ఇక చాలనే ఏదో తెలుపుతున్నది
ఆశ కోరికలు వదులుకున్నాననే మౌనమైపోయా
ఏనాటికైనా భావనగానే ఉండిపోవాలనే నా భావన
భావన కూడా శూన్యమైపోవాలనే నాకు నేనే తెలియక

పరమాత్మా నాలో నీ భావన

పరమాత్మా నాలో నీ భావన కలగలేదని ఆలోచించకు
నీ భావన నాలో కలిగే వరకు న శ్వాసను వదులుకోను
భావనగానైనా జీవిస్తూ నీలో ఇక్యమగుటకు నేను సిద్ధమే
కాలం ఆగిపోయినా ఆగని భావనగా నీలో ఎప్పటికి నేనే

Friday, April 2, 2010

ఎందుకో ఆ భావం

ఎందుకో ఆ భావం పదే పదే గుర్తుకొస్తున్నది
మరచిపోవాలన్నా మరవలేని విధంగా నాలోనే
కలగా కూడా అదే భావన అలానే ఉండాలని
అదే భావనతో నిలిచిపోవాలనే ఆలోచనలు లేక
మరో భావన పిలుస్తున్నది విశ్వమై రమ్మని
సముద్రంలో అలలు కెరటాలుగా ఆగేలా
ప్రకృతి ఓ క్షణం ఆగినట్టు భావన నిలిచిపోయింది

ఎందుకింత భావమో

ఎందుకింత భావమో ఎవరికిలేని భావము
ఏమిటో ఎలా కలిగెనో చెప్పలేని భావము
నీకే ఎందుకు కలిగినదో మహా గొప్ప భావము
ఇంతవరకు తెలియని భావము ఎంతటిదో
మాట లేదుగా ఆలోచన ఉండనే ఉండదుగా
మౌనమైనా రూపాకారములో ఏదో దాగినట్లుగా
పరమాత్మకైనా తోచదేమో ఏ జీవికి కలగదేమో
ఎవరికి అందని భావము నిన్నే తలచినది వరమై
నిలిచిపోరా నీవే భావానాత్మగా మరో విశ్వంలో

ఉన్న జన సంఖ్య సరిపోవుట

ఉన్న జన సంఖ్య సరిపోవుట లేదా ఇంకా చాలా అవసరమా ఎందుకు -
అందరికి అన్ని రకాల సదుపాయాలు సమపాలలో కలుగుతున్నాయా -
సమాజంలో ఏ సమస్యలు లేవా అందరు ఉన్నవారిగా జేవిస్తున్నారా -
సమస్యలు తీరకపోతే ఎవరు ఎలా ఆలోచిస్తున్నారు సరికాని మేధస్సు కలిగిఉన్నారా -
నేడు ఉన్న మానవ మేధస్సుల విజ్ఞానం చాలటం లేదా ఆలోచించటం లేదా -
ప్రస్తుతం జన్మిస్తున్న వారే మహా గొప్పగా మేధస్సు కలిగినవారిలా ఎదిగేవారా -
సమస్య లెన్నిటినో తీర్చేవారవుతారా ఇక ఏ సమస్యలు సమాజంలో ఉండవా -
నేడు ఉన్నపెద్దలు ఎంత జన సంఖ్యను పెంచేస్తూ పొతే సరిపోతుందో మరి -
ఖాళీగా కూర్చోండి పాతికేళ్ళ తర్వాత నేడు జన్మిస్తున్న వారే సమాజాన్ని మారుస్తారేమో -
కొందఱు సుఖంగా ఉండడం వల్ల తమ ఇంటిలో సుఖమైనా సాధించినది సమాజ సమస్యే -
దురలవాట్లు కలవారు సమాజానికి చెధలవలె శుభ్రత లేక అనారోగ్య సమస్యలెన్నో -
అందరు సుఖంగా జీవించడానికి కావలసిన ప్రణాళిక క్రమ విధానాన్ని తెలుసుకోండి -
సమస్యలను తగ్గిస్తూ జీవించు వారే ఏనాటికైనా మహాత్ములని సమాజంలో గుర్తింపుగా -
ఒక మనిషి తండ్రికి లేదా కుటుంబానికి భారం కావటం కన్నా లేనివారే కొంతవరకు మేలుగా -
సమాజ సమస్యను ఎలా వివరించాలో ఒక గ్రంధముగా కూడా తెలిపిన అర్థం కాని విధంగానే -
అర్థం చేసుకునేవాడికి అర్థమైనా సరైన ప్రణాళిక లేకుండా జేవిస్తూనే ఎన్నో సమస్యలతో -
ప్రతి ఒక్కరు ఆధ్యాత్మకంగా ఎదగడానికి ప్రయతించండి తర్వాత సమాజ సమస్యను అర్థం చేసుకోండి -
ఆధ్యాత్మక విజ్ఞానం లేకపోతే సమాజ సమస్య పరిష్కారణలో జీవితం ముగిస్తుందే గాని తీర్చలెం -
తాత్కాలిక పరిష్కారాలు మరో సమస్యలను తీసుకొని వచ్చేలా నేటి సమాజమున ఎన్నెన్నో క్రమము లేక -

ఎంత కాలం ఇలా

ఎంత కాలం ఇలా మానవ జీవితం ఒకరి తర్వాతా వొకరు వంశ పారంపర్యంగానే -
మానవ జీవితానికి ముగింపు అవసరం లేదా లేదంటే సాధ్యం కాదా ఆలోచించండి -
ఉన్నవాడు ఎలాగైనా జేవిస్తుంటే లేనివాడు కూడా ఎంతటి కర్మలైనా ఎన్నైనా బరిస్తూనే -
అందరు సుఖంగా జీవించే మార్గం మానవ మేధస్సుకు సాధ్యం కాదా తెలుసుకోలేరా -
తెలుసుకున్నా సాధించడానికి ప్రణాళికలు లేవా ఉన్నా ఫలితాలు లేక శూన్యమా -
ఎందరో సరైనా జీవిత కాలం పూర్తి కాకుండానే చనిపోతున్నారు ఎందుకో ఆలోచించండి -
సుఖంగా జీవించలేని మానవ మేధస్సు ఎందుకో సమస్యల కారణాలను తెలుసుకోండి -
జనాభా లెక్కలను సేకరించడం కన్నా జన సంఖ్యను ఎలా పెంచకూడదో తెలుసుకోండి -
కుటుంబ నియంత్రణ ప్రణాళికలను ఎన్నిటినో ఏర్పాటు చేయండి దేశాన్ని సంతోష పరచండి -
ఒక్క మనిషి జన్మిస్తే క్షణానికి వంద సమస్యలు పెరుగుతాయి ఎలాగో తెలుసుకోగలరా -
సమాజాన్ని సమస్యలతో పెంచేస్తూ ప్రణాళికలు వృధా అవుతూనే ఆర్థికంగా ఇబ్బందులే -
ఓ మహా ఆలోచనతో ధ్యానిస్తూ మానవ సమాజానికి ఒక రూప కల్పన నివ్వండి చూద్దాం -

దేశ విదేశాలు తిరిగేందుకు

దేశ విదేశాలు తిరిగేందుకు జీవితం చాలటంలేదే ఎలా భూగోళాన్ని దర్శించేది
విజ్ఞానంగా ఎంత తెలుసుకోవాలన్నా ప్రతి ప్రదేశాన్ని నేను చూడలేకపోతున్నా
ఒక వైపు వృత్తి రిత్య ఎన్నో సమస్యలు అలాగే కుటుంబ సమస్యలతోనే జీవితం
వీలున్నప్పుడు ఎన్ని ప్రదేశాలు చూసినా స్వదేశముననే ఎన్నో ప్రాంతాలు మిగిలేను
చూడాలని చరిత్ర విజ్ఞాన నైపుణ్యాన్ని తెలుసుకోవాలని మేధస్సున ఒక ఆలోచన
స్వదేశ ప్రాంతాలే చూడలేక పోతే అంతరిక్షానికి ఎలా ఎప్పుడనేది కలగా మిగిలేనా
విశ్వమే నాలో దర్శించేలా ధ్యానిస్తూ ప్రతి దేశ విదేశాన్ని అణువణువునా తిలకిస్తున్నా