Saturday, April 24, 2010

మాటలతో చెప్పలేను

మాటలతో చెప్పలేను మౌనంగా ఉండలేను భావనతోనే తెలుపగలను -
భావాలుగా ఎన్నో ఎన్నెన్నో విశ్వ వైపరిత్యాలను వివరించగలను -
ఏనాడు కని విని ఎరుగని రీతిలో ఎన్నో ప్రపంచం నలుమూలల సంభవిస్తున్నాయి -
ఆనాడు నేను తెలిపిన పంచభూతాలు ఏర్పడిన సృష్టి విధానంలోనే అన్నీ ఉన్నాయి -
మానవ మేధస్సులో లేని విశ్వ ప్రళయాలు నేడు సంభవిస్తున్న ప్రకృతి ప్రభావాలే -
పాతాళము నుండి ఆకాశానికి ఎగిరే అగ్ని జల వాయు ప్రళయాలు భయంకరంగానే -
జ్వాలలుగా లావాలుగా ఎన్నో అగ్ని రాళ్ళు ఆకాశానికి ఎగురుతుంటే ఆశ్చర్యమా -
పొగలు ఆకాశాన్ని కప్పినట్టు విరజిమ్ముతుంటే శిరస్సుకు సెగలు రేగేలా -
అగ్నికి మంచుయే ఇంధనంగా పాతాళమున మంటలు రేగగా ఎరుపు మితిమీరినట్లు మెరుపులతో -
ప్రాణ నష్టమో దేశ నష్టమో ప్రపంచానికి ప్రగతి లేక ఆధ్యాత్మక జీవితాన్ని తెలుసుకోలేక -
మానవ మేధస్సులో ఎంత విజ్ఞానం ఉన్నా జీవితమంతా సమస్యల తోరణంలా -
సుఖాలు అనుభవించే వారికి కూడా హటాత్తుగా కొత్త సమస్యలు తలెత్తుతాయి -
ఎన్ని సమస్యలను ఎన్ని రకాలుగా వివరించినను అర్థం చేసుకోవాలిగా -
జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు మనలో ఆత్మలు చెల్లా చెదురవుతాయి -
జన సంఖ్యను తగ్గించండి ఇదే ప్రథమ సమస్య ఎప్పటికి ఎప్పుడైనా ఎక్కడైనా -

No comments:

Post a Comment