Wednesday, June 29, 2016

విశ్వమై చూస్తున్నా ప్రతి జీవి కదలికను

విశ్వమై చూస్తున్నా ప్రతి జీవి కదలికను
ఆకాశమై జీవిస్తున్నా ప్రతి అణువు కోసం  || విశ్వమై ||

ప్రతి అణువులో ఆత్మనై ఉంటున్నా పరమాత్మగా
ప్రతి పరమాణువులో స్పర్శనై సాగుతున్నా ధ్యాసగా

ప్రతి రూపం నా మేధస్సులో దాగిన వర్ణ జీవమే
ప్రతి ఆకారం నా యదలో దాగిన శ్వాస స్వభావమే

ప్రతి దేహం నా కోసం జీవిస్తూ విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నది
ప్రతి శ్వాస నాలో కలిగే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలతో కూడినది  || విశ్వమై ||

ప్రతి క్షణాన్ని ఒక యుగములా పరీక్షిస్తూ సాగుతున్నా
ప్రతి నిమిషాన్ని ఒక రోజులా అన్వేషిస్తూ వెళ్ళుతున్నా

ప్రతి భావన నాలో దాగిన స్వభావమై జీవులతో సాగేను
ప్రతి ఆలోచన నాలో నిక్షిప్తమై విశ్వంతో కలిసిపోయేను

ప్రతి బంధం అనుకున్న విధమై సాగుతున్నదా
ప్రతి అనుబంధం అనురాగమై కలిసిపోతున్నదా   || విశ్వమై ||

No comments:

Post a Comment